ధ్రువ పదశైలి పద్యాలు
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
“జయజయ మంగళధాత్రి… శరన్నవరాత్రి…
(ధ్రువ పద శైలి పద్యాలు)
మహిషాసుర మర్ధిని! 
మధుకైటభ వధకారిణి!
శక్తిస్వరూపిణి! శాంతి జ్యోతిస్వరూపిణి!
భక్తులకరుణాకారిణి! భువనేశ్వరీదేవీ!
జయజయ మంగళధాత్రి…|శరన్నవరాత్రి…||
అష్టభుజా విరాజిల్లు 
ఆరాధ్య దేవికా!
త్రినేత్రి త్రివిధ శక్తి 
త్రిలోక నాయికా!
సింహవాహన సజ్జనరక్షకా! జగజ్జననీ ప్రకృతి స్వరూపికా!
జయజయ మంగళధాత్రి… |శరన్నవరాత్రి…||
కరతలమున ఖడ్గము 
కరమున త్రిశూలము
పరమ పావన రూపము 
జగమును పరిపాలించు జగన్మాత!
అభయమిచ్చు వేదమాత! 
జయజయ మంగళధాత్రి…|శరన్నవరాత్రి…||
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment