ఇల మహారాజు వృత్తాంతము - అచ్చంగా తెలుగు

 ఇతిహాసాల్లో దండకారణ్యం

అంబడిపూడి శ్యామసుందర రావు




దండకారణ్యం అనేది రామాయణం లాంటి పురాణాలలో ప్రస్తావించబడిన పెద్ద అడవి రామాయణ కథ లో కనిపిస్తున్న దండకారణ్య ఆవిర్భావ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది ఈ అరణ్యం 92,200చదరపు కిలోమీటర్లు విస్తరించింది ప్రస్తుతం ఈ దండకారణ్యం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని బస్టర్ జిల్లాలో ఉంది. ఇది రాయపూర్ కు 264 కిమీ ల దూరంలో ఉంది ఈ ప్రాంతం వన్యప్రాణులకూ మంచి దట్టమైన అడవులకు ప్రసిద్ధి అందుచేతనే ప్రస్తుతం  దండకారణ్యం నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతముగా వార్తల్లో వింటున్నాము. మనము ప్రస్తుతం ఈ అరణ్యం పౌరాణిక యుగంలో అంటే రాముడు కాలంలో ఎలా ఉండేది ఎలా ఏర్పడింది దీనికి ఆ పేరు ఎలా వచ్చింది లాంటి విషయాలను తెలుసుకుందాం.ఈ అరణ్యం పౌరాణిక యుగములో అంటే త్రేతాయుగములో రాక్షసులకు నిలయంగా ఉండేది రావణాసురుని రాజ్యం లో భాగంగా ఉండేది రావణాసురుని అనుచరుడు ఖరుని అధీనం లో ఈ ప్రాంతం ఉండేది.ఈ అరణ్యము ఇంకా ఎంతమందో భయంకరమైన రాక్షసులకు ఆవాసంగా ఉండేది. శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలో ప్రవేశించి మునులను హింసించే అనేక మంది రాక్షసులను సంహరించాడు

దండకారణ్యం అనే పదం రెండు పదాల కలయిక వలన ఏర్పడింది మొదటిది దండకా అనే రాక్షసుని పేరు రెండవది అరణ్యం అంటే అడవి రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు దండకారణ్యం లో ప్రవేశించి దండకారణ్యం నిర్జనంగా, మృగాలు పక్షులు లేకుండా ఉండడాన్ని గమనించి అగస్త్య మహామునిని  కారణం అడుగగా   అగస్త్యుడు దండకారణ్యం గురించి వివరిస్తాడు విదర్భ రాజు శ్వేతుడు తపస్సు చేసిన ఆ ప్రదేశం కూడా అదే. త్రేతాయుగం నుంచి ఈ అరణ్యం అలాగే ఉందని తాను ఆ అరణ్యాన్ని ద్వాపరయుగంలో చూశానని అగస్త్యుడు అన్నాడు. క్రూరమృగాలు ఏమీ లేకుండా అలాగే జనసంచారం కూడా లేకుండా ఉన్న ఆ అరణ్యంలో ఎన్నెన్నో కందమూల ఫలాలు ఉన్నాయి. అనేక రకాల శాకాలు ఉన్నాయి. ఆ అరణ్యం మధ్యలో అయిదు యోజనాల వెడల్పు గల ఒక సరస్సు ఉంది. హంసలు, అడవి కొంగలు, చక్రవాక పక్షులు ఉన్నాయి. అసంఖ్యాకంగా తాబేళ్ళు కూడా అటూ ఇటూ తిరుగుతున్నాయి. కొంగలు బారులు కట్టి ఆ సరస్సు మీద ఎగురుతున్నాయి. ఎటువంటి హింసకు తావులేకుండా ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది. అందుకే ఆ ప్రాంతాన్ని తాను కూడా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు అగస్త్యుడు శ్రీరామునికి చెప్పాడు

పూర్వం కృతయుగంలో మనువు అనే మహారాజు ఉండేవాడు  అతడు రాజ్యాన్ని నాయ సమ్మతము గాను ధర్మబద్ధం గాను పరిపాలించేవాడు. అతని పాలనలో వర్ణాశ్రమ ధర్మాలు సక్రమముగా కాపాడబడేవి. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు ను రాజుగా చేసి రాజవంశమును విస్తరింప జేయమని కొన్ని ధర్మాలను కూడా చెప్పి, క్షత్రియులు సహజమైన ధర్మ మార్గాన్ని అనుసరించాలి అని, నిరపరాధులను దండించ కూడదు అని, ఎవరైనా అపరాధము చేసిన వారిని శిక్షాస్మృతి అనుసరించి నేరానికి తగ్గ శిక్ష విధించాలి అని ధర్మము వర్ధిల్లే టట్లు పరిపాలన సాగించాలి అని చెప్పి, ఆ విధంగా చేసిన ఆట్టి పరిపాలన చేసే రాజు మరణానంతరం స్వర్గమును పొందుతాడు అని   కుమారునికి చెప్పి మనువు యోగమార్గంలో శాశ్వత బ్రహ్మ లోకమునకు చేరెను.

ఇక్ష్వాకు మహారాజు కూడా తండ్రి వలె యజ్ఞ యాగాదులను, దాన ధర్మాలను తాపములను ఆచరించి నూర్గురు పుత్రులను పొందెను.వారు కూడా తండ్రి వలె తేజ సంపన్నులు కానీ అందరిలో చిన్నవాడు మూర్ఖుడు అతని పేరు దండుడు ఇక్ష్వాకు భవిష్యత్లో తన కుమారుడికి ఒక మహానుభావుడి వల్ల దండన కలగవలసిన పరిస్థితి ఉందని గమనించి అందుకు తగినట్లుగా తన కుమారుడికి ‘దండుడు’ అని పేరు పెట్టినట్లు చెప్పాడు. అలాగే దండుడుకి వింధ్య, నీల పర్వతాల మధ్య భాగంలో ఉన్న అరణ్యప్రాంతాన్నంతటినీ రాజ్యంగా ఇచ్చాడని ఆ అందమైన అరణ్య ప్రాంతమే దండుడు పరిపాలించి నందువల్ల దండకారణ్యంగా పేరు వచ్చిందని పౌరాణిక కథనం పెద్దవాడు అయినాక అతనిని వింధ్యాద్రికి    శైవల పర్వతానికి మధ్యగల ప్రదేశానికి రాజుగా చేశారు. అతను అక్కడ ఒక నగరాన్ని నిర్మించి దానికి మధుమంతం అని పేరు పెట్టారు. దండుడు శుక్రాచార్యుని తన గురువుగా,పురోహితునిగా చేసుకొని పాలన సాగించాడు.ప్రజలు కూడ సుఖసంతోషాలతో గడప సాగారు. ఆ విధంగా దండుడు శత్రు బాధలు లేకుండా కొన్ని వేల సంవత్సరాలు పాలన సాగించాడు.  ఒకనాడు అతఁడు శుక్రాచార్యుని ఆశ్రమమునకు పోయి అచట తపము ఆచరించుచు ఉన్న అతని పెద్దకుమార్తె అగు అరజ అను దానిని చూసి  మోహించగా , అది మంచిది కాదు  అని ఆమె ఎంత చెప్పినా వినక బలాత్కారంగా ఆమెను కూడి వెడలిపోయెను.తర్వాత ఈ విషయం తెలుసుకున్న  శుక్రుడు మిగుల ఆగ్రహించి  దండుఁడు సపరివారముగా నేలపాలు అగునట్లు, ఆ మధు మంతము చుట్టూ ఏడు రోజులు మట్టి వాన కురియునట్లు, జన శూన్యము అగునట్లు శాపం ఇచ్చెను ఆ విధంగా శుక్రాచార్యుని శాపం కారణంగా ఆకాశం నుంచి ధూళి ధారాపాతంగా కురిసింది. ఆ దూళి వర్షంలో దండుడు మరణించాడు. ఆ విధంగా కృతయుగమున ధర్మ విరుద్ధముగా ప్రవర్తించిన దుష్టుని కారణమున వింధ్య-,శైవల పర్వత ప్రాంతము ప్రజలకు నివాసయోగ్యం,అనుకూలము గాక దండకారణ్యము అయ్యెను కాలక్రమేణా మునులు నివసించుట వలన జనస్థానం పిలువబడెను.  


No comments:

Post a Comment

Pages