స్థాణువును
 రాధకృష్ణ కర్రి
9951916499
విజయవాడ
నా మాట కరకుదనాన్ని 
వస్త్రంగా చేసుకుంటుదేమో
భావం మాత్రం వెన్నను పూసుకుంటుంది.
అయినా 
నేను అందర్నీ ప్రేమించలేనేమో, 
నేను ఎప్పుడూ 
నీ మార్గంలో నీ నీడనై
ఉన్నాననుకుంటాను.
కాని అప్పుడప్పుడు నీతో 
విమర్శించబడతాను
విస్మరించబడతాను
విసిరేయబడతాను
కొన్ని అణువులుగా 
విచ్ఛిన్నం కాబడతాను.
ఎన్ని సందెలు సద్దుమణిగినా
ఆవేదన అలలు గుండె తీరాన్ని
ఢీకొడుతూనే ఉన్నాయి.
ఉప్పని ద్రవం 
తెలి మంచుతెరై
కంటిపాపకు అడ్డుపడుతుంది
నీకు కానరాని ఆ మనసు
నీ గుర్తింపు కిరణాల స్పర్శకై 
గడ్డకట్టిన ప్రతిమవుతుంది
బహుశా 
నేను అందర్నీ ప్రేమించలేనేమో
అందుకే 
ఎడారి మాటనై
ఇసుక రేణువుల్లో 
ఆశల తీరం లేని 
మరో రేణువుగా,
స్థాణువుగా ...నేను!!
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment