అంతర్యామీ... !
పెయ్యేటి రంగారావు
అంతర్యామీ!  సర్వ అంతర్యామీ!
దీనజనావన లాలస బూని
నేల పైకి దిగిరావదేమీ?
అంతట నీవే నిండి యుంటివా?
మరి నా మొరలను వినకుంటివేమీ?
అణువు యణువున నిలచి యుంటివా?
మరి నా గతిని కనరావదేమీ?
విషయ లాలసలు వదలమందువు
పాంచభౌతిక కాయము నిడుదువు
ఫలితము కోరక కర్మ సలుప వలె
మరి ఈ మనసును  ఎందుకు ఇడవలె?
ఋణముల వలనే భార్యా సుతులు
అల్లెదవేల మరి బంధములు?
కర్మ సన్యాసము వలదను చుంటివి
మరి, కర్మల వలన సంచిత మిడితివి ||
అంతర్యామిని చూడని చెనటిని
జ్ఙానయోగము కలుగని మొరటును 
అంధకారమును తొలగించుమయా
జ్ఙాన జ్యోతిని వెలిగించుమయా||
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment