శివం- 104 - అచ్చంగా తెలుగు

శివం- 104

శివుడే చెబుతున్న కథలు

రాజ కార్తీక్ 


దర్శకుని కధ 12

(  నేను {రాజా} అనగా శివుడు - కార్తికేయుడు గురించి కార్తికేయ రచనల గురించి మీకు తెలిసినది.. కోటప్పకొండ జరిగిన సంఘటనలు మీకు తెలిసినవి కార్తికేయనికి రాధా రాణితో పరిచయము దానివల్ల ఉత్పన్నమైన హాస్యము మీకు తెలిసినదే

జరిగిన సంఘటనలు చూస్తూ అందరూ ఆనందంగా నవ్వుకుంటున్నారు మొట్టమొదటిసారి.. నన్ను చిలిపిదనంతో కొంటె దనంతో కైలాస  గణాలు చూసి సంబరపడిపోతున్నారు.. మీ మాత నవ్వు విష్ణు దేవుడు బ్రహ్మదేవుడి నవ్వు కూడా చూసి నేను కూడా చాలా ఆనందపడ్డాను కళాకారులలో ఉండే సామర్ధ్యమే అది రచనలో వారు మమ్మల్ని కట్టిపడేస్తారు మా పాత్రలకు ఆపాదించిన ధర్మాలను సహితుకంగా మేము కూడా పాటిస్తాము..

కార్తికేయుడు.." ఏమయ్యా రాజా! గురువా నాకు ఇన్ని ఆశలు పెడుతున్నావ్ నేను ఆశపడింది అది నా దగ్గరికి రాలే నోటి దాకా వచ్చి నాకు ఫలం చెందేలోపు చేజారి పోతుంటాయి ఇది కూడా అలా కాదు కదా పైగా ఆ అమ్మాయి తొలిచూపులోనే ఎంతో గాని నచ్చింది "

నేను "భయమేల దర్శక ,భయమేలా శిష్యా ఇది నీకు కచ్చితంగా దక్కి తీరుతుంది నీకెందుకు నేను ఉన్నాను కదా వారి వారందరూ నాకు తెలుసు నేను నీకు ఎలాగైనా ఆ అమ్మాయితో కళ్యాణమయ్యే విధంగా చేస్తాను. .."

గణాలు " మహాదేవలవారే.. అభయమిస్తే ఇక మనవాడికి భయమేలా" ..

నేను " తను నీకేం చెప్పినది ఒకసారి గుర్తు చేసుకో " 

కా " ఏం చెప్పినది శుక్రవారం సార తీసుకొని వస్తాను అని " 

నేను " ఈరోజు శుక్రవారం నాయన  సారే తెచ్చిందేమో ఒకసారి వెళ్లి కనపడి రాపో ఈ కొండ దిగి మరొక పని చేద్దాం" 

రాధా రాణి  మళ్ళా చూడొచ్చనేసరికి కార్తికేయుడు మళ్ళీ ఉత్సాహంగా  వెళ్ళాడు..

ఇప్పుడు అందరూ నాతో మాట్లాడ సాగారు

మీ మాత పార్వతి "  ఎందుకని అతని అంత ఆట పట్టిస్తున్నారు మీరు తలుచుకుంటే సంకల్పం మాత్రం జరిగే శుభకార్యానికి ఎందుకు ఇంత గొప్ప సన్నివేశాలు మీరు సృష్టిస్తున్నారు" 

విష్ణు దేవుడు " అది నాకు తెలుసు సోదరి దానికి కారణం ఏమిటంటే అతని రచన చేసిన ఒక ఘట్టంలో మహాదేవుల వారు హాలాహలము తాగిన తర్వాత .. తమరు వెళ్లి మహాదేవుని గొంతుని తడిమారని దానివల్లే ఆ గరళ
 అమృతం అయిపోయి పరమశివుడు గొంతులో అలంకరణగా అయిపోయింది అని ఒక వర్ణన చేశాడు అది మహాదేవుల వారికి ఎంతో నచ్చింది ." 


బ్రహ్మ దేవుడు " మహాదేవుల వారు నిరంతర సమాధి స్థితిలో తపస్సులో ఉంటారు మహాదేవులని ఎవరు తపో భంగం చేయాలని అనుకోరు కానీ అన్ని చోట్ల తానే ఉన్న మహాదేవుల వారు కార్తికేయ రచనలలో వచ్చిన సన్నివేశాలన్నీ అనుభవిస్తూ తానే తపోభంగం చేసుకోవాలని భావించేవారు అటువంటి ఘట్టాలు కార్తికేయుడు మహాదేవుడు వైపే కాకుండా నాపైన విష్ణుదేవుల పైన కూడా వేశాడు " 


నంది బ్రింగీ " ఎప్పుడు తపస్సు చేసుకుంటున్నా ఒకటే ఇలాగా కార్తికేయని వలె భగవంతుని పాత్రలతో అత్యద్భుతమైన సన్నివేశాలు సృష్టించి ప్రజల్ని భక్తులని రంజింపజేసిన ఒకటే" 


గణపతి " బాగు బాగుంది తపస్సు చేసే వాళ్ళని పరీక్షించనేపము తో కావాలని విజ్ఞాలు కలిగిస్తారు.. కానీ ఈ కార్తికేయుడు రచనలు నచ్చిన నాన్నగారు మాత్రం విజ్ఞానం లేకుండా సాక్షాత్తు తానే దిగి వచ్చాడు దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే.. తపస్సు కన్నా ఆ రచన నయం లాగా ఉంది" 

సుబ్రహ్మణ్యడు " సోదరా నాన్నగారి గురించి చెప్పేది ఏముంది ఆయన్ని మెప్పిస్తే ఏదన్నా చేస్తారు
 కాపలా కాస్తాడు కావలి కాస్తాడు కొలిమిలో ఉన్న కాపాడుతాడు. హర హర మహాదేవ" 

మీ మాత లు ముగ్గురు 

" అది సరేగాని తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు "

ఈలోపు వచ్చాడు కార్తికేయుడు

కా " గురువా రాధా రాణి సార తెచ్చింది ఇచ్చేసింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కనపడింది" 

నేను " నిన్ను చూసిందా" 

కా  "వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగింది " 

నేను " సరేలే వెనక్కి తిరిగి చూసిందంటే నీకోసమేలే.."

కా " నీకు ఎలాగో వారు తెలుసు అన్నావుగా ఇకమీద నువ్వు చూసు కుందావు లే గానీ" 

నేను " సరే పద ఇక్కడ దగ్గరలో మా ఇల్లు ఉంది అక్కడికి వెళ్దాం" 

కా " నేను వస్తే పర్లేదా మీ కుటుంబంలో ఇబ్బంది ఏమి లేదా "

నేను " మాకేం ఇబ్బంది అయ్యా మాతోపాటు ఇంకొకళ్ళు ఉంటారు నువ్వు రాసిన నాటకానికి సరిపడే పాత్రలు మొత్తం అక్కడ ఉంటాయి. మేము కూడా నాటక రంగానికి చెందిన వాళ్ళమే ముందరే చెప్పాను కదా అందరం మీ పాత్రలో ఒదిగిపోతాం." 

కా " నేను వస్తే మీ ఆవిడ గారికి ఇబ్బంది ఏమీ లేదా" 

నేను " ఇంత జరిగిన తర్వాత నేను తీసుకెళ్లకపోతే ఇబ్బంది అయ్యో తనకన్నా కోపం వచ్చిందంటే మళ్ళీ"

కా " ఎవరెవరు ఉంటారు ఏంటి మీ ఇంట్లో" 

నేను " మేము ముగ్గురం.. నేను మా ఆవిడ మా ఇద్దరి పిల్లలు.. నాతోపాటు నా గణాలు.. మా ఆవిడ వాళ్ళ సోదరుడు ఆమె బార్య.. మా బావమరిది వారి బంధు ఇంకొక ఆయన ఆయనకు నాలుగు తలలు తెలివి ఉంటది అయ్యా.. వాళ్ళ ఆవిడ.. మేమందరం ఆ ఇంట్లోనే ఉంటాం.." 

కా " చాలా చక్కగా ఉంది చక్కగా ఉమ్మడి కుటుంబ కర్తవ్యాలు నెరవేరుస్తున్నామన్నమట " 

నేను " నెరవేర్చాలి కదా ఎవరి బాధ్యత వాళ్ళది.. నా ఇల్లాలేమో అందరికీ వండి పెడుతుంది.. మా బావమరిది ఇల్లాలేమో ఖర్చులకి డబ్బులు ఇస్తుంది.. మా బావమరిది బంధువు వాళ్ళ ఇల్లాలేమో అందరికీ విద్యాబుద్ధులు నేర్పి సంస్కారం నేర్పుతుంది.." 

ఇవన్నీ చూసి అక్కడున్న వారందరూ ముచ్చట పడుతూ  నవ్వుకుంటున్నారు తమ గురించి చెప్తున్నారు మహాదేవుల వారు ఇంతటి మహా రచయత మాయలో పడిన ఈ కార్తికేయుడికి ఆయన చెప్తుంది అర్థం కావట్లేదని ..

కా " ఇంతకీ మీ బావమ్మర్ది ఏం చేస్తాడు.." 

నేను "ఒకటేమిటి ఆయన అన్ని  చేస్తాడు.. నేను ఎట్లనో ఆయన కూడా అట్లనే.."

కా "ఓహో " 

నేను " ఆయన బంధువు కూడా అన్నీ చేస్తాడు .. మేము ముగ్గురు ఒకటే అనుకో రాదా అందుకే కదా అందరం కలిసి ఉన్నాము "

కా " మరి నేనుంటే నీ పిల్లలకు ఇబ్బంది ఏమి లేదా" 

నేను " మా ఇద్దరి పిల్లలు చాలా తెలివిగలవారు.. ఒకతను ఎప్పుడు నెమలితో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు మరొకతను మాత్రం ఎప్పుడూ మోదకాలు తింటూ ఎలుకతో ఆడుకుంటూ ఉంటాడు అయినా నీకు ఇబ్బంది ఉండదు లే నేను చాలా చక్కగా చూసుకుంటారు అంటే చాలా ఇష్టం మా వాళ్ళకి" 

సుబ్రహ్మణ్యం మరియు గణపతి పకపకానవ్వుకుంటున్నారు



విష్ణు దేవుడు "  మీ అందరికీ ఇదే నా విన్నపం ఇక మహాదేవుల వారి నటన మొదలైంది దేనికోసం వచ్చాము ఆ పని మొదలుగాపోతుంది ఇక మీ అందరూ సామాన్య పాత్రలోకి రండి.. అన్నపూర్ణాదేవి మీ వంటని సామాన్య మానవులే తినటం చాలా ఆనందంగా ఉంది ఇక ఈ కార్తికేయుడు మన మీద చేయబోయే పెత్తనాన్ని చూడండి" 

బ్రహ్మ " తధాస్తు" 

మీ మాటలు ముగ్గురు పోనీలే మాకు కూడా ఒక మానసిక ఉల్లాస యాత్ర లాగా ఇది నిలిచిపోతుంది..

నేను "ఈ దగ్గరలోనే మా ఇల్లు అయ్యా .. ఈ కొండ దిగి చిన్నగా నడుచుకుంటూ వెళ్దాం పద "

కా " ఒకే ఒక్క రోజులో నాకు ఎంత గొప్ప స్నేహితుడు అయ్యావు నువ్వు గురువా పదా నీతో వెళ్దాం అంటూ చేదుకోకోటయ్య ఆదుకో కోటయ్య మళ్ళీ వస్తా కోటయ్య అంటూ శిఖరం పైకి చూసి నాకు దండం పెట్టుకుంటున్నాడు" 

ఇద్దరం పక్క పక్కగా నడుచుకుంటూ కోటప్పకొండ మెట్లు దిగుతున్నాం ముందుంది అసలైన నాటకం

కా "పదరాజ పద! గురువా అంటూ నాతో స్నేహితుని వలె అచ్చిక బుచ్చుక లాడుతున్నాడు" 

మా వెనకున్న బ్రహ్మదేవుడు విష్ణు దేవుడు మీ మాత లు, గణాలు, కార్తికేయుడు, వినాయకుడు ముల్లోకాలు అందరూ ఇది నవ్వుకుంటూ చూస్తున్నారు..

ఎటు చూసినా ఒకటే నినాదం ఓం నమశ్శివాయ.

No comments:

Post a Comment

Pages