శివం-103 - అచ్చంగా తెలుగు

 శివం-103

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 


నేను అనగా శివుడు...కార్తికేయుడికి రాధ పరిచయం అవ్వటం వారిద్దరూ నా పల్లకి ఊరేగింపులో నృత్యం చేయడం, కార్తికేయుడు తో సంభాషణలో నాకు కార్తికేయుడు ముందరే తెలుసు తన నాటకాలు  వీక్షించాను. అని చెప్పటం అందుకే తన నటనకు అడిగినా కూడా ఒప్పుకున్నానని చెప్పటం.. రాధకు కార్తికేయను మీద సహృదయం కలగటం..మీ మాత నన్ను చిటికెలో అయిపోయే పనిని ఎందుకు ఇలా దగ్గరుండి చేయిస్తున్నారు అని అడగటం, తన కథలో నాకు అమ్మ ప్రేమను పరిచయం చేశాడని చెప్పటం )


మీ మాత పార్వతి 
" అవును స్వామి నేను కూడా అనుకున్నాను తల్లి లేదంటారు శివుడికి తానే కదా ప్రపంచానికి తల్లి తండ్రి.. అని అలాంటిది.. మిమ్మల్ని చిన్న పిల్లవాడిని చేసి తన రచనలలో మిమ్మల్ని ఓలలాడించాడు.. ఏ నోము కి భూమి కి వచ్చాడు ఏ పూజ చేశాడు ఇంతటి అద్భుతమైన రచన శక్తి అతనికి ఎలా వచ్చిందో.. భూమిలో కొంత బాగాన్ని ఏలే మహారాజులు మెచ్చుకుంటేనే దాన్ని గొప్ప కావ్యంగా పరిగణిస్తారు అలాంటిది విశ్వాన్ని సృష్టించిన మీరు విష్ణుదేవులు అందరు కూడా తన రచనలు కొనియాడుతుంటే అతగాడు ఎంత గొప్ప రచయిత అని నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి.. అతని రచనలలో బావకత నటరాజై గుర్తించాడు వరదరాజులే ఆనందపడ్డారు" అంటూ విష్ణు దేవుని వైపు చూసి మీరు ఏదైనా స్పందించండి అన్నట్లు సంజ్ఞా చేసింది

విష్ణు దేవుడు 

" సోదరి కార్తికేయుడు మహాదేవుల వారికే కాదు నాకు కూడా ఎంతో గొప్పగా రచనా సేవ చేశాడు.. కీర్తనలు ఆలపించే భక్తులను చూశాను కావ్యాలు రాసే భక్తులను చూశాను కానీ అద్భుతమైన సన్నివేశాలతో.. నా పాత్రను గొప్పగా ముడిపెట్టినవి ఎంతో గాను  నన్ను ఆకర్షించాయి.. ఒక బాలుడు. శివలింగముని విష్ణు దేవుడు గ భావించి తెలియక అర్చన చేస్తే
 ఆ శివలింగమున ప్రతి పూజకు ఓం విష్ణువే నమః అని నన్ను ఆరాధిస్తుంటే.. అలా చేయకూడదు అని కొంతమంది పెద్దలు చెబుతుంటే ఆ శివలింగం నుండి నేను ప్రత్యక్షమయ్యాను.. ఇలా మా ఇద్దరికీ భేదం ఏమీ లేదు అని ఎంతో గొప్పగా ఒక బాలుని రూపంలో చెప్పాడు .. ఈ విశ్వమంతా విష్ణు రూపమే అని నన్ను ఈ విశ్వంతో పాలపుంతలతో పోల్చిన విధానం చూసి ఇతగాడికి సష్టి రహస్యం ఎలా అర్థమయిందా అని నేను కూడా ఓ కింత
 ఆశ్చర్యపడ్డాను.. త్రిశూలం పట్టుకున్న విష్ణు దేవుడే మహాదేవుడు.. శంకు చక్రాలు కలిగిన శివుడే విష్ణువు అని అతగాడు ఇచ్చిన సందేశానికి నేనే కాదు వైకుంఠ వాసులు కూడా ఎంతో ఆనందపడ్డారు.. అందుకే అతగాడి నాటకంలో మనందరం పాత్రధారులు అవుతాం "

భక్తులారా ! ఎల్లప్పుడు ఎప్పటికీ ముమ్మాటికి శివుడే విష్ణువు విష్ణువే శివుడు మా ఇద్దరి మధ్యలో బేధము పెట్టి మీరు ఎల్లప్పుడూ ఏ పూజ చేసినా ఏకతో చేసిన దాన్ని మేము స్వీకరించము గుర్తుంచుకోండి...నేను " చిటికెలో చేయు పని నేను ఎందుకు దగ్గరుండి చేస్తున్నానని అడిగావు కదా.. అవును ఎందుకంటే.. నాకు అమ్మ ప్రేమని రుచి చూపించిన వాడు.. భావనలతో భక్తిని చూపిన వాడు.. పాత్రలతో వేదాంతం చెప్పినవాడు.. అన్నింటికీ మించి అటరాజుని పూజించే కళాకారుడు అందుకే అతగాడితో ఈ లీల చేయదలచాము

బ్రహ్మ దేవుడు " నటరాజస్వామి వరదరాజ స్వామి అనుకుంటే ఇంకా దాన్ని ఆపగలిగేది ఎవరు? కానివ్వండి" 

పల్లకి మోస్తున్నారు కార్తికేయడు , రాధ 

కా " తమరి నామదేయం ఏమిటో "

రాధ " వినలేదా " 

కా " ఈ నామ స్మరణ  లో సరిగ్గా వినపడలేదు " 

కా " రాధ రాణి " 

కా " బహు చక్కగా ఉంది నీ పేరు.." 

రా " నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు" 

కా " సాటి మనిషిగా చేయవలసింది చేశాను " 

రా " మీరు నృత్యం బాగా చేశారు "  అని అంది తన నృత్యం గురించి పొగడరా అన్నట్లు

కా " అదే చిన్నప్పటి నుంచి దేవుడి మందిరం చేయటం ఆనందంగా భావిస్తాను అలా భావించాను అంతే" 

ఇక్కడ మాత్రం మేమంతా నృత్యం గురించి పొగడ వయ్య అని కసురుకుంటున్నాం..

లక్ష్మి మాత " విష్ణు దేవా తమరు కృష్ణుని అంశను మన కార్తికేయన్లోకి ప్రవేశపెట్టండి ఎలాగా తన రాద కదా.. అతగాడికి కన్యామణి లతో ఏమి సంభాషణ చేయాలో తెలియదు. భగవంతునితో మాత్రం శభాష్ అనిపించుకుంటాడు " 

రాధకు మాత్రం కార్తికేడు తన నృత్యం గురించి పొగడలేదని ఓకింత అసంతృప్తిగా ఉంది
కానీ మనవాడు ఉన్నాడు కదా సగం మూడుడు.. అర్థం చేసుకోలేడు.. పల్లకి సేవ పూర్తి అవ్వగానే ఆడపిల్లకు వచ్చే సహజ కోపము మనసులో పెట్టుకొని.. అమ్మవారికి సారే తెచ్చే పనిమీద వెళ్లాలి ప్రతి శుక్రవారం నేనే ఈ పని చేస్తాం అమ్మవారికి అంటూ వెళ్లిపోయింది..

కార్తికేడు మాత్రం నాకోసం ఇందాక ప్రసాదం తిన్న స్థలానికి తిరిగి వచ్చాడు..

నేను " ఏమయ్యా ఏమన్నా మాట్లాడావా? " 

కా " చక్కగా మాట్లాడాను పేరు అడిగాను మొత్తం పేరు రాధా రాణి అని చెప్పింది " అంటూ ఏదో తెగ సాధించిన వాడిలాగా భుజాలు పైకి ఎగరేసుకొని నడుం మీద చేయి పెట్టుకొని గొప్పగా చెప్పాడు

నేను " అప్పుడు నువ్వేమన్నావ్" 

కా " నేనేమనలేదు తనే నా నృత్యం బాగుందని చెప్పింది అప్పుడు గుర్తుకొచ్చింది మా రాజా నృత్యం చేయమని ఎందుకు చెప్పాడు.. ఇప్పుడు అర్థమైంది నీ భార్య నీకోసం తిరిగి తిరిగి ఎందుకు అన్నం పెడుతుందని అట్లా అందరి మనసు పట్టేస్తావయ్యా నువ్వు రాజా అంటూ నా జబ్బలు చరిచాడు.. మెచ్చుకోలుగా

పెద్ద పిడుగు పడిన శబ్దం విన పడింది..
ఈ చర్యతో అందరూ కాసింత ఆశ్చర్యపడ్డారు..

నేను " పైన పిడుగులు పట్టించుకోవాకు చెప్పు"

కా " ఇక అమ్మవారికి సారే తీసుకొచ్చే పని ఉందని వెళ్ళిపోయింది" 

నేను " ఇంకా ఏం మాట్లాడలేదా" 

కా " మాట్లాడాను పులిహోర దద్దోజనం  బాగుంది ఎవరు చేశారు అని అడిగాను" 

అందరూ విరగబడి నవ్వారు 

నేను " పులిహోర  గురించి నీకు ఎందుకు.. అసలు నీకన్నా బాగా నృత్యం చేసిన తను కదా నువ్వు వెంటనే తన నృత్యం బాగా చేశావు నా కన్నా అని చెప్పాలి కదా ఆ మాత్రం తెలీదు నువ్వు ఏం దర్శకుడివయ్యా... నన్ను చూడగానే శివుడి పాత్రకి బాగుంటుందని అన్నావు అట్లాంటిది రాధమ్మని మెచ్చుకునే పని లేదా  " 

మనవాడి గ్రంధల్లో సరసగ్రంధులు లేవేమో అని ముల్లోకాల్లో ఇది చూసి నవ్వుకుంటున్నారు..

కా " నిజమే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావ్" 

నేను " చక్కర పొంగల్ ఎవరు చేస్తారు బాగా.అని అడిగి రాపో" 

కా " అలాగే వెళ్ళొస్తాను.. ఇక్కడే ఉండు" 

నేను " బాబు కార్తికేయ .. అమావాస్యక పౌర్ణమితో భోజనం చేసేవాడి ల కాకుండా వెళ్లి ఆ నృత్యం బాగుంది చెప్పడం మర్చిపోయా అని ఎక్కడుందో కనుక్కొని చెప్పి రా పో నేను ఇక్కడే ఉంటాను ఇదే నీకు చివరి అవకాశం " 

కా " సరే సరే రాజా ఈ విషయం ఏదైనా మొత్తం నీ మాటే వింటాను" అంటూ తల గోకుతూ పైకి వెళ్ళిపోయాడు

మీ మాత..విష్ణు దేవుడు.. బ్రహ్మ దేవుడు .. నంది బృంగి .. అందరూ నన్ను చూసి ఎంతో ఆనంద పడుతున్నారు.. ఎల్లప్పుడూ నన్ను శౌర్యంగా నెమ్మదిగా లేకపోతే కోపంగా చూడడమే తప్ప పవిత్రంగా ముభావంగా చూడటమే తప్ప ఎన్నడూ వారు నాలోని హాస్యాన్ని ఇంతవరకు చూడలేదు అలాంటి నేను హాస్యం చేస్తూనేసరికి.. వారందరి మొహంలో నక్షత్రాలు ఏమిటి పాలపుంతలు మెరిసిపోతున్నాయి..

పార్వతి మాత  విష్ణువు తో 
" చూడండి సోదరా మహాదేవుల వారు ఇంత హాస్య రసాన్ని ఈమధ్య యుగాల్లో ఎప్పుడూ వలకబోయలేదు తన భక్తుడి కోసం ఏదైనా చేస్తాడు అవసరమైతే హాస్యాన్నైనా పండిస్తాడు, కడుపున కొలువై ఉంటాడు.." 

మొత్తానికి మన కార్తికేయుడు మళ్లీ గుడి దగ్గరికి వెళ్లి రాధ ఎక్కడ ఉంది అని వెతకటం మొదలుపెట్టాడు.. ఐదుగురు  ను చూసి రాధా రాణి అనుకొని బ్రమపడ్డాడు..
నిజంగా రాధా కనపడేసరికి.. దగ్గరికి వెళ్లి..

"చక్ర పొంగలి" అనబోయాడు.. నా పిలుపు అతనికి "ఓయి" ని గట్టిగా వినపడింది..మనసులో..

రాధ "మహానుభావా మళ్ళీ ఎందుకు తారసపడ్డావు" అంది ఇందాక మెచ్చుకోలేదని కోపంతో

కా "ఇందాక చెప్పడం మర్చిపోయా నీ నృత్యం చాలా అమోఘంగా ఉంది .. తనువుతో కాదు మనసుతో శరీరంతో కాదు ఆత్మతో నృత్యం చేశావు..
లా ఘవంగా నువ్వు చేసిన నృత్యం చూసి మై మర్చిపోయాను అసలు రచయిత, దర్శకుడు అయిన నేను నాకు నీ నిత్యం చూసి నృత్యం చేయాలని అనిపించింది ఇది చెప్పడానికి తిరిగి వచ్చాను " అన్నాడు రొప్పుతూ

రాధ నవ్వు పెదవులు పైనే ఉంది.. మొత్తానికి తన మనసులో ఉన్న భావాన్ని కనిపెట్టాడే అని అనుకోని ధన్యవాదములు అని అన్నది

కా "వీలైతే నటకంలో
 నీవు నృత్యము లు  సమకూర్చ వలసిందిగా కోరుతున్నాను" 

రాధ " ఓహో రచయిత దర్శకులు మీరా! తమరు.. చూద్దాములే తర్వాత మనం మళ్ళీ కలుస్తామో కలవమో" 

నాకు ఎలాగో రాద వాళ్ళు తెలుసని నమ్మకంతో "కచ్చితంగా కలుస్తాం ".. అని నవ్వుతూ భరోసాగా చెప్పాడు కార్తికేయుడు..

నైవేద్యం పెడుతున్నప్పుడు మోగుతున్న గంట గణ గణ గణ అంటూ మోగింది..

అది చూసి రాధ రాణి నవ్వుకుంటూ వెళ్లిపోయింది..

తిరిగి వచ్చాడు కార్తికేయుడు

కా " రాజా నువ్వు .. అద్భుతం అమోఘం అనంతం.. ఆమె యం " 

నేను " నువ్వు మాత్రం అయోమయం" 

కా " నువ్వు చెప్పింది  చేశా కదా" 

నేను " అది నేను చెప్పకుండానే చేయాలి కదా" 

దగ్గరికి వచ్చి నన్ను వాటేసుకొని అబ్బా అంటూ నా మొహం వైపు చూసి గడ్డం పట్టుకుని నాకు తెలియదులే గురువా నువ్వే ఇవన్నీ నేర్పు అంటూ నన్ను మచ్చి కి చేసుకుంటున్నాడు..

అక్కడా వారు అంతా " ఎప్పుడో నీకు మచ్చికైపోయారు లే మహాదేవులు వారు" 

కా " తర్వాత " 

నేను " తను ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నావా" 

కా " నీకు తెలుసు అన్నావు గా" అంటున్నాడు తను మళ్ళి తడబడుతూ

నేను " ఒకవేళ నాకు తెలియకపోతే" 

కా " ప్రతి శుక్రవారం సారె కి వస్తుందట కదా కనుకున్నాం కదా.. మొదలెడదాం కదా.. అదే కదా మన కథ.." 

నేను " పర్లేదు సూక్ష్మ బుద్ధి కలవాడివే..బేష్ " 

కా " నువ్వు కాకపోతే మా పార్వతి మాత చూసుకుంటుంది శుక్రవారం ఆమె కోసమే వస్తుంది కదా.."

మీ మాత ఆనందంగా పకపకా నవ్వుతుంది. మీ మాత నువ్వు చూసి నాకు కూడా ఎంతో ఆనందం వేసింది ఈ మధ్యకాలంలో మీ మాత నవ్వింది లేదు ఇలా..

ఒక్క మాత ఏమిటి అందరూ నవ్వుతున్నారు..

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages