శివం - 101 - అచ్చంగా తెలుగు
శివం -101 
(శివుడే చెబుతున్న కథలు)


( కార్తికేయుడుని కోటప్పకొండ లో కలవటం.. అతనితో రాజా గా  పరిచయం.. అతని రచనల గురించి చెప్పడం.. నన్ను నటన చేయమని నాటకంలో అని అడగటం.. నాకు సన్నివేశాలు వివరించడం దానికి నేను ముగ్గురు అవ్వటం చుట్టూ  అదృశ్య రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణు కైలాస పరివారం జరుగుతున్న లీల చూసి సంబర పడటం) 

{నేను అనగా శివుడు...} .
సతివేదన సన్నివేశము తర్వాత.. తదుపరి కథ సన్నివేశం కోసం నేను ఎదురు చూస్తున్నాను..

విష్ణు దేవుడు ఏమో ఈ సృష్టిని ఒక కావ్యం గా మలచి కాలాన్ని ఒక నాటకంగా తీర్చిన మహాదేవుడు తదుపరి సన్నివేశం కోసం ఎదురుచూస్తున్నాడు బ్రహ్మదేవా ఏదైనా ఈ కళాకారుల చాతుర్యం.. బాగు బాగు..అని అనుకుంటున్నాడు

నేను " చాలా చక్కగా ఉంది కార్తికేయ.. నిజంగా కాసేపు ఆ నిమిషంలోకి వెళ్లిపోయి బాధపడిపోయాను తెలుసా..." 

కా " మరి ఏమనుకున్నావ్ రాజా.. మనుషులకి ప్రేమపెడతాడు మహాదేవుడు.. ఏమన్నా అంటే రుణం కొద్ది బంధం కొద్ది బాకీ కొద్దీ నీకు ఏర్పడ్డాయని ఒక గొప్ప సిద్ధాంతం చెప్తాడు వాళ్లు దూరం అయ్యేటప్పుడు.. మనసు పడే బాధ అంతా కాదు అప్పుడేమో వేదాంతం చెప్తాడు.. భలే వాడివయ్యా.. ఆలస్యం అమృతం విషం అంటావు నిదానమే ప్రధానమంటావు నువ్వు ఏమన్నా అంటే సందర్భాన్ని బట్టి చూసుకునే తెలివితేటలు నీకు ఇచ్చానంటావ్ ఇక నిన్ను ఏమన్నా మంటావ్.." 

నేను " ఏమిటయ్యా కార్తికేయ ఇప్పటిదాకా బానే మాట్లాడావుగా మహాదేవుడని ఇప్పుడేంటి కసురుకోవటమ్ మొదలు పెట్టావు... సృష్టి చక్రం అట్లా నడవాలి"

కా " ఏమిటయ్యా శివుడు వెంట వకాల్తా పట్టుకొని వచ్చేసానట్టు ఉన్నావు.. ఏదో బాధ కొద్దీ రెండు మాటలు అంటావయ్యా సాటి మనిషి అంటే ఊరుకోరు కదా ఆ దేవుడు అనుకో పోనీలే ఏదో పిచ్చివాడు కాదు మనోడే కదా అని సరిపెట్టుకుంటాడు.. మన ఆప్తులు మనల్ని ఏమీ అనుకోరు కదా.. అట్లానే శివుడైన విష్ణుమైన బ్రహ్మదేవుడైన జగన్మాత అయిన లక్ష్మీదేవి అయిన ఎవరైనా మన ఆత్మీయ అప్తులే కదా "

 మీ మాత పార్వతి "గట్టివాడే దొరికాడులే .."

నంది"అందుకే కదా  వారు ఇక్కడికి వచ్చి మరి ఏదో నాటకం ఆడుతా అంటున్నారు చూద్దాం" 

విష్ణు దేవుడు "ఆయన ఆడడమే కాదు మనల్ని కూడా ఆడిస్తాడు ఒక ఆట నాటకం అనే పేరు మీద"

బ్రహ్మ దేవుడు"ఇప్పటిదాకా తపస్సులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వరాలు ఇవ్వటమే సరిపోయింది ఇకమీద ఈతగాడు నాటకం  కోసం మనల్ని ఎలా అంటాడు చూడాలి "

విష్ణు " దీనికే ఇలా అనుకుంటే రాబోయే రోజుల్లో శిరోబారం పరిస్థితి ఏమిటి " 

గజాననడు" అసలే ఒకటి కాదు నాలుగు తలలు కదా నొప్పి మరీ ఎక్కువ పుడుతుందేమో నాన్నగారి దెబ్బకి " అంటూ చెలొక్తి విసిరాడు

సుబ్రహ్మణ్యుడు " అమ్మ నాన్నగారిని ఎప్పుడు ఇలా చూడలేదు.. మనం ఉండగా కూడా ఆయనతో భలే పరాచకాలు ఆడుతున్నారే.. నాన్నకి రచన అoటే అంత ఇష్టమా అమ్మ" 

లక్ష్మి దేవి "  అవును కుమారా.. నాన్నకే కాదు మీ మావయ్య కూడా భక్తులన్నా భక్తులు చేసే కళా.సేవ చాలా ఇష్టం.. అప్పుడప్పుడు రచనలో వారికి సమస్య వస్తే వారి స్వప్నంలో సాక్షాత్కరించి లేక వారి రూపంలోనే వీరు వెళ్లి దాన్ని పూరించిన సంఘటనలు చాలా ఉన్నాయి .. కానీ మొట్టమొదటిసారి సృష్టి మొదలైన దగ్గర నుంచి.. ఒక నాటకంలో నటించుటకు.. అందరూ రావడం ఇదే ప్రథమం"

కార్తికేయుడు"  రాజా తదుపరి సన్నివేశము.. పార్వతీమాత తపస్సు మొదలు పెడదామా" 

నేను "కానివ్వు కానివ్వు నీకు ఎదురు ఎవరు.." 

కా " ఏమి మొదలుపెడదాం అయ్యా.. పాపం ఆ జగన్మాత మళ్ళా పుట్టి నీ కోసం తపస్సు చేస్తే... ఆమెని పరీక్షించ దలచి .. కటోర పరీక్షలు పెట్టావు.. పోనీలే ఆదిపరాశక్తి తిరిగి వచ్చింది అని వెంటనే లాగించవచ్చు కదా.. ఆమె ఇబ్బంది పెట్టావు ఎట్టకేలకు ఒప్పుకున్నావు అదేదో ముందే ఒప్పుకుంటే అయిపోతుంది కదా.." 

నేను " ఏమిటయ్యా నువ్వని మరీ అంత నిటారుగా తిడుతున్నావు.." 

కా " నిన్ను కాదులే అయ్యా ఆ శివుడిని" 

పార్వతీ మాత & పరివారం " ఓహో" 

కా " సతీ మాత కోసం విరాగి గా తిరుగుతావా అదే సతిమాత తిరిగి పార్వతి రూపంలో వస్తే ఆమని పరీక్షింప గెలిచి తపస్సు చేసి వచ్చేదాకా ఆగుతావా ఏమిటో  నీకు నీకే చెల్లు.. నిన్ను అడిగేవాడు ఎవడు." 

పార్వతీ మాత " అడుగు అలా అడుగు " 

కా " మా లక్ష్మీ మాత అలిగిపోతేనేమో విష్ణువు లక్ష్మీ లక్ష్మీ అని బాధపడతాడు.. నువ్వేమో అమ్మ లేనప్పుడు సతీసతి అని బాధపడతావు తిరిగి వచ్చిన తర్వాత భయంకరమైన పరీక్షలు పెడతావు ఎదురుగున్న మనిషి విలువ తెలియదు కానీ లేకపోతే మాత్రం లబోదిబో లబోదిబో అంటారు" 

లక్ష్మి దేవి " భలే చెప్పావు నాయనా అడుగు అలా అడుగు" 

కా " మీ అందరికన్నా ఆ బ్రహ్మ దేవుడే నయం సరస్వతీ మాత ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు.." 

బ్రహ్మదేవుల వారు మెచ్చుకోలుగా కార్తికేయ వైపు చూస్తున్నారు..

విష్ణు దేవుడు ..మహా దేవుడు తో "మహాదేవ ఇతగాడు మన మీదకి తెచ్చాడు దయచేసి ప్రవాహాన్ని మార్చవలసిందిగా నా అభ్యర్థన అని గట్టిగా అన్నాడు " 

లక్ష్మి దేవి " ఇద్దరు ఇద్దరే ఒకరి మీద ఒకరిని మాట పడకొనివ్వరు " 

కా " ఏమయ్యా శివయ్య పార్వతీ పరమేశ్వరులు అంటారు కానీ.. లక్ష్మీ నారాయణడు అంటారు కానీ.. ముందు మిమ్మల్ని పిలవరాయ వాళ్ళు ఉంటేనే మీ కు విలువ " 

నేను " ఇప్పుడు ఎవరు కాదన్నారు కార్తికేయ దాని గురించి ఎందుకు? తర్వాత సన్నివేశం ఏదో చెప్పు.. సీతారాముల అంటారు రాధాకృష్ణలు అంటారు దాన్ని మేము కాదనట్లేదు కదా... శివుడు మీ పార్వతీ మాతకి అర్థభాగం ఇచ్చాడు కదా... విష్ణువు లక్ష్మీదేవిని గుండెల మీద పెట్టుకున్నాడు కదా... ఇక ఏమిటయ్యా నీకు ఇబ్బంది ఏదో మీ అమ్మలకు అన్యాయం చేసినట్టు మాట్లాడతు ఉన్నావు "

సుబ్రహ్మణ్యుడు మరియు వినాయకుడు 
" నాన్నగారు భలే సర్ది చె ప్పారు సోదరా "

కా " అవునులే రాజా నువ్వు చెప్పింది కూడా నిజమేలే మనం ఎంత మన జీవితం ఎంత మహాదేవులు వారిని విష్ణు దేవులు వారిని ఏదో మన రచనలలో పొగడమే తప్ప నిందాస్థితి చేయడమే తప్ప వారిని వే క్కి రి ద్దామని నా మనసు కాదుగా అదంతా ఎందుకు వచ్చిందంటే తనకోసం పుట్టిన పార్వతి దేవిని వివాహ ఆడటానికి ఎందుకని మహాదేవుని వేచి చూశారు. వెంటనే చేసుకుంటే సరిపోయేది కదా ఎందుకు మా తల్లిని ఇబ్బంది పెట్టటం అని నా కవి భావన రాజా" 

పార్వతి మాత కూడా మహాదేవ ప్రత్యక్షంగా చూస్తుంది 

నేను " ఓహో అదే నా ! మీ  పార్వతి మాత ఆదిశక్తి యే.. కానీ తపస్సు చేత ఆమె ఆది శక్తి రూపం ఘనంగా ప్రస్ఫుటం అవుతుంది. తపస్సు ద్వారా పూర్తిగా తను వేరు నేను వేరు కాదు అని మహాదేవుని గురించి తెలుసుకుంటుంది తపస్సు ద్వారా ఈ సృష్టి మొత్తాన్ని సృజయించే సామర్థ్యం తనకి తెలిసి వస్తుంది తపస్సు ద్వారా తన ఆధిశక్తి అని పూర్తిగా ఎరుకకి వస్తుంది గుర్తుపెట్టుకో కార్తికేయ.. విగ్రహంగా మారటానికి బండరాయికి సమయం పడుతుంది. ఉరి దెబ్బలు తగిలాయని బాధపడకూడదు విగ్రహంగా మారిపోతున్నానని ఆనందపడాలి అదే సృష్టి " 

ఈ సమాధానానికి నోరు తెరిచి కార్తికేయుడు నా వైపు తిరిగి చూశాడు

నేను " ఏదో చెప్పాలని ఆయన ఎవరో ప్రవచనం చెప్తుండగా విన్నాను నిజమైతే తీసుకో .. ఏదో నీ నాటకంలో కథానాయకుడు కదా తప్పు మాట్లాడితే పెద్ద పట్టించుకోకు"  అని చెలోక్తి విసిరాను

కా " తప్పేందుకు రాజా చాలా సరిగ్గా కచ్చితంగా చెప్పావ్ నిజంగా శివుడే ఉన్నా కూడా అదే మాట చెప్పే వాడేమో ఆహా ఎంత బాగా చెప్పావు మానవ శరీరం తీసుకున్న అమ్మవారు పూర్తిగా ఆదిపరాశక్తి అని తెలుసుకోవడానికి తపస్సు చేసింది అన్నమాట అయితే చాలా బాగా చెప్పా అందుకే నాలాంటి అజ్ఞానులు ఏమన్నా మాట్లాడిన పట్టించుకోకండి దేవతలారా అంటూ పైకి చూశాడు" 

 మీ పార్వతి మాత మాత్రం నవ్వుతూ తన గురించి అంత బాగా చెప్పినందుకు శోభ యతం గా మారింది

కా " దేవుళ్ళకే తప్పలేదు " 

కార్తికేయుడి పరాచకాలు కొనసాగుతున్న ఇక ఒక మంచి అమ్మాయిని చూసి ముడి వేద్దాం.. లంగర్ పడిన నౌకలాగా.. ఉండిపోతాడు.. అనుకుంటున్నారు అందరూ


....(కొనసాగుతుంది)No comments:

Post a Comment

Pages