శివం-98 - అచ్చంగా తెలుగు

 శివం-98

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 


కార్తికేయుడు కోటప్ప కొండ లో దర్శనం కోసం లోపలి కి వెళ్ళాక ..బయట ఉన్న నా కోసం విష్ణు దేవుడూ పార్వతీ మాత.. బ్రహ్మ.. దేవులు , లక్ష్మి మాత.. గాజన కుమారు లు నంది బ్రుంగి లు రావటం ..తిరిగి కార్తికేయుడు నా కొసం వస్తు ఉండ గా అందరూ దక్కోవటం)


దూరం నుండి కార్తికేయుడు

"బాబు రాజా ! నీకు కూడా ప్రసాదం తీసుకువస్తున్నాను. తిన్నావా తినలేదు మరొకసారి తిను.."

 నా   ప్రక్కనే ఉన్న వైకుంఠ కైలాస సత్య లోక వాసులు అదృశ్య మయ్యి జరుగు తుంది చూస్తున్నారు 

ఒక బండ ను చూసుకొని కైలాసం లో వలె కూర్చున్న నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్న డు కార్తికేయుడు..

"ఈ దేవుళ్ళందరూ కొండల మీద కొలువు అయ్యి ఉంటారు.. ప్రశాంత త కోసం ఉంటారో ..లేక భక్తులు ఇంత దూరం ఉన్న వస్తారో లేదో అని పరీక్ష కి ఉంటారో.."

నేను "ఏమయ్యా దర్శనం అయ్యిందా ? నన్ను చూస్తే సరిపోలేదా? " 

కా " అహ సరిపోయింది .." చలొక్తిగా

నేను " ఏమిటి ఏదో తెచ్చావు"

కా " రాజా .పోనీలే ..ఎప్పుడో తిన్నవ్ ఎమో..నీ కొసం తినటానికి మళ్ళీ తెచ్చాను..వాడితో గొడవ కూడా పడ్డాను..ను తినాల్సిందే గా తప్పదు " 

నేను " అందరికీ అన్నా ముందు నేనె తిన్నాను" 

కా " ఇదిగో తింటే తిన్నావు కానీ మళ్ళీ తిను ..నీ కోసం నేను తెచ్చాను..రేపు మీ ఆవిడ కు చెప్పు ..నాకు కూడా మంచి భోజనం పెడుతుంది.."

నేను " చెప్పానుగా మంచి భోజనం పెడుతుంది తేడా వస్తే గుండెల మీద కాళ్ళు కూడా పెడుతుంది "

మీ పార్వతి మాత నా వైపు కోపంగా చూస్తుంది

కా " అట్లా ఏం కాదులే నువ్వు మామూలోడివి కాదు నిన్ను ఆ మాత్రం చేయకపోతే మాట వింటావా.. వెతికి వెతికి మరి వెంటపడి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆ మాత్రం అధికారం ఉంటుంది లే అయ్యా "

సరైన సమాధానం చెప్పిన విధంగా తన చూపుని చూపిస్తూ కార్తికేయుడు వైపు నవ్వుతూ చూస్తుంది నీ మాత..

నేను "ఏమిటయ్యా ఈ పలచన .. అందరికీ అడిగేది ఇచ్చేది నేను అందరూ నన్నే తిడుతూ ఉంటారు.. ఏమన్నా అంటే నిందా స్తుతి అంటారు , "అంటూ నిట్టూర్పు విడిచాను..

కా "బాబు రాజా నిన్ను ఎవరేమంటారు అయ్యా సాక్షాత్తు శివుడి లాగా ఉన్నావ్.. శివరాత్రి రోజు వచ్చిన శివుడు అయ్యా నువ్వు .. ఏదో స్నేహభావన కొద్ది సరదాగా రెండు మూడు మాటలు మాట్లాడతాములే.. మరోలా అనుకోవాకు.. స్నేహంలో ఇవన్నీ సహజమే" 


నేను "నేనేం అనుకోను లే బాబు. ఎదురుగున్నది సామాన్య వ్యక్త కాదు కదా.. దిగ్ దర్శకులు దిగ్ రచయితలు.."

కా "ఊరుకోవయ్యా నా బొంద! నేనేదో నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా. అంత గొప్ప గొప్ప మాటలు ఎందుకులే గాని కళ్ళకు సేవ చేసే విధంగా ఆ నటరాజస్వామి నన్ను అనుగ్రహిస్తే చాలు నాయనా!" 

విష్ణు దేవుడు " నటరాజస్వామి అనుగ్రహించబట్టే కదా నటరాజస్వామి తోనే మాట్లాడుతున్నావు" 

కా "ఒక నటరాజ స్వామి ఏంటి వరదరాజస్వామి అన్నిటికీ మించి ప్రస్తుతం లక్ష్మీదేవి అనుగ్రహం ఇవ్వాల్సిందిగా గట్టిగా కోరుకుంటున్నాను " 

లక్ష్మి దేవి " నాకు సంపాదించిన ఈసారి డ నీ ముందు ఉంటే నా అనుగ్రహం కోసం అడుగుతున్నావు చూడు
.. కచ్చితంగా అనుగ్రహిస్తున్నాను తధాస్తు"

కా "నేను కోరుకున్న కోరికలు నెరవేరుటకు తలరాతలో ఉన్నా లేకపోయినా బ్రహ్మదేవులు వారు నా తలరాతన సరిచేసి కొంచెం నా ఆశయ సాధనకు తోడ్పడితే చాలు" 

బ్రహ్మ దేవుడు "తధాస్తు" 

కా "సరే అదేముందిలే కానీ ముందు తెచ్చింది తినవయ్యా నీతో చాలా పని ఉంది , ఓపిక కోసం మరికొంచెం తిను మనం చాలా పని చేయాలి"

నేను " ఇంతకీ నువ్వు తిన్నావా సరిగ్గా తినలేదు అనుకుంటా" 

కార్తికేయడికి ఇప్పుడు గుర్తుకు వచ్చింది రాజాకి ప్రసాదం తీసుకునే ఆలోచనలో తన సరిగ్గా తినలేదు ఏదో కొంచెం తిన్నాడు ..

కా " తిన్నాలే నువ్వు తిను" 

నేను "సరే ఆ విస్తరి ఇక్కడ పెట్టు నాకు అంత ఆకలిగా లేదు నువ్వు ఒక సగమే తిన్నావు కాబట్టి చేరి సగం  తిందాం కూర్చో" 

కా " అంతేనంటావా " 

నేను " అంతే" 

కా "పులిహోర దద్దోజనం పరవాన్నం" 

నేను " కానీ "

ఒకే విస్తరిలో నేను కార్తికేయుడు చె రి సగం పంచుకొని.. తింటున్నాము..

నంది బృంగి ఈ సన్నివేశం చూసి రోమచిత0మయ్యారు..

"మహాదేవుడు మహా నైవేద్యం తినే మహాబలేశ్వరుడు ఈరోజు ఒక సాధారణ భక్తుడితో తన భోజనాన్ని పంచుకుంటున్నారు" 

పాపం ఆకలి మీద కార్తికేయుడు ఆబ రాగా తింటున్నాడు..

నేను "ఏమయ్యా ఇంత ఆకలి పెట్టుకొని నువ్వు పూర్తిగా తినకుండా నాకోసం తీసుకొస్తున్నావా?"

కా "అదేం లేదులే తిన్నాను లే కానీ ఎక్కడ వృదా ఐపోతుంది అని తింటున్న "


నేను "ఆకలి తో తినే వాడీ కి వృదా అవ్తుంది అని తినే వాడికి తేడా తెలియదా? " 

కార్తికేయుడు నవ్వుతూ ఉన్నాడు ..దొరికి పోయినట్టు.

ఇదిగో నీరు తాగు అని జట లో నీరు పట్టించి ఇచ్చాను వెనుక నుండి తీసినట్టు

నేను కూడా తింటున్న ..

విష్ణు బ్రహ్మ దేవులు మాత్రము ఇది అంత మహాదేవుడు తో మామూలే ఆన్న విధము గా చూస్తున్నారు .

వినాయక కుమారులు ఇద్దరు మనం తిరిగి కైలాసం వెళ్ళినప్పుడు నాన్న గారితో ఈ విదంగా ఒకే కంచం లో తిందాం అని అను కుంటున్న రు..

పార్వతీ మాత " మన నలుగురం తిందాం" 

నేను " ఆన్న పూర్ణ మాత అనుగ్రహించింది..ఈ విస్తరి కింద ఇంకా కూడా తినే పదార్దాలు ఉన్నాయి "

 మీ పార్వతీ మాత అర్దం చేసుకొని అభయ హస్తం ఇచ్చింది..

అంతే  విస్తరి కింద రుచికరమైన ..పిండి పదార్థాలు గారెలు బూరెలు బొబ్బట్లు పూర్ణాలు..ఇంకా చాలా ఉన్నాయి ..ఇద్దరి కి సరిపోయే విధంగా 

కా "ఇప్పుడు అర్థమైంది నాకు ఈ విస్తరి తీసుకుంటుంటే వాడు ఎందుకు నాతో గొడవపెట్టాడు.. ఎందుకంత బరువుగా ఉంది అని "

నేను "నాకోసం తెద్దామని ఆదురుతులో ఇవన్నీ గమనించకుండా వచ్చినట్టు ఉన్నావ్ అందుకే అవన్నీ నీకు ప్రాప్తించాయి"

పాపం రుచికరమైన భోజనం చూసి చేసి ఎంత కాలం అయ్యిందో..లొట్టలు వేసుకు ఉంటు తింటున్నాడు.

కా "అబ్బ ఎంత రుచి గా ఉన్నాయో" 

నేను "అచ్చం మా ఆవిడ చేసినట్టే ఉన్నాయి" 

కా " అదృష్టవంతుడివయ్యా ఇలా నీకు చేసి పెడుతుంటే" 

నేను "భయపడకు లే నీకు అతి శీఘ్రముగా కళ్యాణమయి ఇంత రుచిగా ఉండి పెట్టే భార్య లభిస్తుంది లే"

అందరూ " తధాస్తు" అన్నారు.

(కొనసాగుతుంది)

No comments:

Post a Comment

Pages