శివం-97 - అచ్చంగా తెలుగు

 శివం-97

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 


(కార్తికేయుడు కోటప్పకొండ రావటం.. కార్తికేయుడు రచనలపై అతని సన్నివేశ అల్లికలపై మా యొక్క ప్రతిస్పందన.. కార్తికేయుడు తిరునాళ్లలో జరిగిన అపశృతి సరి చేయడం, అతగాడి కోసం నేనే మెట్లు దిగి రావటం.. అతడికి తారస పడటం.. అతనితో సరదా పరాచకాలు.. అతడు నన్ను రాజా అని ముద్దుగా నటరాజుకి ప్రతిమ వలే పిలవడం.. తన నాటకంలో నాకు శివుని పాత్ర ఇస్తా అనడం.. నేను కూడా ఒప్పుకోవడం.. దర్శనం కోసం వెళ్లిన కార్తికేయుడు)


నేను అనగా శివుడు..

కాలు మీద కాలు వేసుకొని ఆనందంగా జతలు సరి చేసుకుంటూ త్రిశూలం ముందు పెట్టుకొని కార్తికేయుడు తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న నాకు
ఒక పిలుపు వినపడింది..

చూస్తే మీ మాత పార్వతి

"కోటయ్య స్వామి ఏమిటయ్యా నీ సరదా పరాచకాలు.. ఏమిటి నేను నీకు అన్నం పెట్టానా నీ గుండెల మీద కాలితో తన్నానా ఏమిటి ఆ చెప్పటం భక్తులు వింటే ఏమనుకుంటారు" అన్నది హాస్యాస్పదమైన కోపముతో 

నేను "అవును నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమున్నది తమరు అన్నపూర్ణమై మాకు కూడా బిక్ష వేశారు కదా అది మేము తిని ఎంతో ఆనందించాం అంత రుచికరమైన భోజనము.. తిన్నాను కాబట్టే హలహలము గొంతులో ఉన్న కూడా.. ఆ విషపు గాటు నాకు తగలట్లేదు సుమీ " చిలిపిగా

ఇంతలో కుమారస్వామి ప్రత్యక్షమయ్యాడు
"నాన్నగారు నన్ను నెమలితో ఆడుకుంటాను అని చెప్పి అంటున్నారు.. ఇంకా నయం నాగుపామే పుట్టింది అని నామీద చతురు వెయ్యలేదు తమరు"

నేను సరదాగా కార్తికేయుడు అదే మీ దండపాణి చూసి ముద్దుగా దిష్టిపెట్టాను

"మీరందరూ పర్లేదు ఇక నా గురించి అయితే మూషికములు పట్టుకొని తిరుగుతాను అని మరీ చూడండి ఎలా ఆటపట్టించటం చేశారు"అన్నాడు గజాననుడు అలిగినట్టు

పార్వతీ మాత "చూడండి వారు మాత్రం వారి యొక్క గొప్పతనాన్ని ఎక్కడా తగ్గించుకోకుండా తనని వెంటపడి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి తనకోసం తపస్సు చేసింది వక్రీకరించి ఎలా చెప్పారో"

ఇంతలో ప్రత్యక్షమైంది లక్ష్మీదేవి సైతం

"ఈ మగవారు అంతే పార్వతీ మాత.. ఎప్పుడు చూడండి వారి యొక్క ఆధిపత్య ధోరణి చూపిస్తూనే ఉంటారు.. మహాదేవుడు విరాగి.. అని తమరు వెంటపడి చేసుకున్నారు ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎట్లా ఆట పట్టిస్తున్నారు అది తమ అభిమాన రచయిత ముందు"

"సరదా కోసమే ఆ మాట అన్నా కూడా నిజంగా, అర్ధ శరీరం ఇచ్చి అర్ధాంగిని చేసుకున్నారు కదా.."అన్నారు ప్రత్యక్షమైన విష్ణు దేవుడు

లక్ష్మి మాత "అదిగో వచ్చారమ్మా జనార్ధనలు.. మహాదేవుల వారిని ఒక్క మాట కూడా పడనివ్వరు.."

విష్ణు "సోదరీ పార్వతి! మన యందు కార్తికేయుడు రచించిన ఆచంచలమైన రచనలను చూసి కీర్తన కన్నా ఎక్కువగా భక్తి కన్న మధురం గా, భావము కన్నా మిన్నగా ఎంతో అందరము తపించి పోయాము,  భక్తులంటే ఇలా ఉండాలి అని చెప్పే ఆంజనేయుడు సైతం ఇతగాడు రాసిన రచనలను చూసి నిజంగా రాములవారితో నాకిది జరిగితే బావుండు అని అనుకున్నాడు అంటే , అతగాడి సృజన ప్రతిభా  శ్లా ఘనీయమైనది... అనుకున్నదే కదా అతగాడు చేసిన నిందస్తుతి కూడా విందా స్తుతి గా అందరము స్వీకరించాము కదా ఇక ఇప్పుడు మహాదేవుని మనందరం కలిసి అని జరిగేది ఏమున్నది.. ఇప్పుడు మహాదేవుడు రచించిన జగన్ నాటకంలో మన కార్తికేడు రచించిన అసలు నాటకంలో .. మన పాత్రలు ఏమిటో తెలుసుకోవడం తప్ప"అన్నాడు ఎలాగో జరగబోయేది తెలిసినట్టు


" నా కరుణాకటాక్షాలు అతగాడి మీద మెండుగా ఉన్నాయి"
 అన్నది అప్పుడే ప్రత్యక్షమైన సరస్వతి దేవి

"నావి కూడా " పార్వతి దేవి

మహాదేవుడు మరియు విష్ణు దేవుడు
"తమరి ఆశీర్వాదాలు ఇప్పుడు చాలా గట్టిగా కావాలని మన దర్శకుడి కి లక్ష్మీదేవి" 

లక్ష్మి మాత " తధాస్తు అలాగే ప్రసన్నంగా దండి గా ఉన్న ఆశీర్వచనములు కార్తికేయనికి అదే అదే మీ అందరి అభిమాన రచయితకి పుష్కలంగా ఇస్తున్నాను " 

బ్రహ్మదేవులు వారు కూడా ప్రత్యక్షమై "శుభం భూయాత్ దర్శకుడా! " 

కార్తికేయుడు త్రికోటేశ్వరుని దర్శనం  చేసుకుంటున్నాడు.. ఇందరి ఆశీర్వాద ఫలితము ఏమో కార్తికేయుడు మనసులో ఎందుకో సహజ ప్రసన్న భావతరంగాలు ప్రసరించినాయి.. భక్తులు వేసే దండాలు వచ్చి కార్తికేయడి మెడలో పడ్డాయి..

అందరికీ ఒకటే మాట " చేదుకోకోటయ్య ఆదుకో కోటయ్య"

అలాగనే చేదుకుంటాను ఆదుకుంటాను

కార్తికేయుడు " అబ్బా మన శివుడి వేషంలో ఉన్న రాజాని కూడా తెస్తే బాగుండేది.. ఎంతోమందిని శివుని చూసినట్టు ఆనంద పడేవారు ఈ మట్టి బుర్రకి ఈ ఆలోచన రాలేదు " 

దర్శనం కోసం వరుస సమూహంలో క్రమంగా నుంచోటం వల్ల.. కొద్దికొద్దిగా జనులు ముందుకి కదలడం వల్ల.. దూరము నుంచి ఎక్కువ లింగమును దర్శనం చేసుకుంటూ మెల్లిగా కదులుతున్నాడు

కార్తికేయ " స్వామి ఈ దర్శనం చేసుకోవడానికి వచ్చాను చేసుకుంటున్నాను.. మరింత కళా సేవ చేసే అదృష్టాన్ని అవకాశాన్ని తప్పకుండా కల్పించి ఆర్థికంగా నన్ను కొంచెం ఆదుకోకోటయ్య.. మంచి భార్యని పిల్లల్ని కుటుంబాన్ని ఇచ్చి చేదు కో 
కోటయ్య " 

బయట ఉన్న అందరమూ ఒక్కసారిగా తధాస్తు అని అన్నాము

నంది బ్రుంగి కూడా ప్రత్యక్షమయ్యారు వారు కూడా కార్తికేయని గురించి సరదాగా చెప్పి తమ ఆశీర్వచనాలు అందజేశారు ..

వారు "ప్రభు మన కార్తికేయుని కైలాసము తీసుకువెళ్లి అక్కడ రోజుకో నాటిక  రూపొందించుకొని ప్రదర్శన కావిచ్చుకుందాం ప్రభు" 

మాత లు "బాగుంది నంది బృంగి ఇంకా అతగాడితో చేరి త్రిమూర్తులు కూడా నాటకాలు నటిస్తూ ప్రదర్శన కావిస్తూ సృష్టి స్థిత లయ  వదిలేస్తారా ఏమిటి" 
కార్తికేయుడు మనసులో అనుకుంటుంది మా అందరికీ చాలా దగ్గరగా వినపడుతుంది

"శివయ్య ఎంత గొప్పవాడివయ్యా నీవు.. ప్రేమ వద్దన్నా ఎవరు అవసరం లేదన్నారు ప్రపంచం నాలో ఉందన్న నీ ఆది అంతం తెలియదు నువ్వు ఎవరో తెలియదు నువ్వేంటో తెలియదు నువ్వేంటో అర్థం కాదు.. ఎందుకు ఇవన్నీ సృష్టించావో బోధపడుతూ ఎందుకు ఈ జీవితాలు నడిపిస్తున్నావు అర్థం కాదు, మనిషికో పిచ్చి పెడతావు.. మనసుకో త్రు ష్ణ పెడతావు.."

వచన కవిత్వాన్ని అందరము వింటున్నాము


"  విరాగి అన్నావుబంధాలు వద్దన్నావు  సతీమాతని వద్దన్నావు .. ఆవిడ భక్తి అనే ప్రేమ కి లొంగిపోయావు.. ఆవిడని పరిణయం ఆడావు.. అంతా తెలిసి తనని యజ్ఞం కి ఆహుతి కాకుండా ఆపలేకపోయావు.. తన మీద నిరూపించుకున్న ప్రేమని మార్చుకోలేకపోయాను తనకోసం మహాదేవుని అని మిర్చి తన విరహవేదనతో ప్రపంచమంతా సతి లేదని బాధతో తిరిగావు ఇంతకన్నా ఎవరు ప్రేమని చూపిస్తారా అయ్యా.. అందుకే కదా అమ్మ మళ్ళీ పుట్టి నీకోసం తపస్సు చేసి నిన్ను గెలుచుకుంది"

మీ పార్వతీ మాత నా వైపు ఎంతో ప్రేమగా చూస్తుంది.

కా "ప్రపంచంలో మొట్టమొదటి ప్రేమకథయ్యానిది"

గణేషు మరియు సుబ్రహ్మణ్య డు

"అవును మా అమ్మానాన్నది మొట్టమొదటి ప్రేమ కథ"

కార్తికేయుడు అక్కడ ప్రసాదాన్ని తీసుకుంటూ "అయ్యో నాతో తిన్న అని చెప్పాడు గాని రాజా తిన్నాడో తినలేదు. ఎక్కడి నుంచి వస్తున్నాడో" పాపమని ప్రసాదం వడ్డించే వాడితో గొడవ పెట్టుకొని మరి నాకు కూడా భోజనం  తెస్తున్నాడు..

కార్తికేయుడు వస్తుంటంతో.. అక్కడున్న అందరిని వెళ్లిపొమ్మని చెప్పాను..

విష్ణు దేవుడు "బాగు బాగు మొట్టమొదటిసారి దేవుడు మనిషిని చూసి పారిపోవాల్సిన అవసరాన్ని తీసుకొచ్చావా మహాదేవ .. ఇకమీద ఏ పాత్ర చేపిస్తావో ఏ నృత్య భంగమలు చేపిస్తావో.. సిద్ధం కండి " పరమ చలోక్తి గా.

చూడండి ఏమి జరగబోతుందో...

No comments:

Post a Comment

Pages