అలా కుదరదు - అచ్చంగా తెలుగు

 అలా కుదరదు

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


కుడి కన్ను,ఎడమ కన్ను

మనకు ఒకేలా చూపు నివ్వలేవు.

కుడికాలు,ఎడమకాలు

మనను ఒకేలా నడిపించలేవు.

పగలు,రాత్రి మనపై ఒకేలా

తమ ప్రభావాన్ని చూపలేవు.

సుఖం,దుఃఖం మనని ఒకేలా

స్పర్శించ లేవు.

గెలుపు,ఓటములు రెండూ మనని ఒకేలా

స్పందింప జేయలేవు.

పిల్లలెందరున్నాతమ ప్రేమని

మనకు ఒకేలా అందించలేరు.

*** 

No comments:

Post a Comment

Pages