శ్రీ శిరిడీ సాయి దివ్య లీలామృతం - అచ్చంగా తెలుగు

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలామృతం

Share This

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలామృతం

రచన: సి.హెచ్.ప్రతాప్ 


శ్రీ సాయి లీలామృతం ఒక పెద్ద సాగరం వంటిది. అందులో లీలలనే ఎన్నో ఆణిముత్యాలు వున్నాయి. అచంచల విశ్వాసం తోఅకుంఠిత దీక్షతోజ్ఞాన పిపాసతో ఆ సాగరం లో మునిగిన వారికి అనేక అపురూపమైన జ్ఞాన రత్నాలు లభ్యమౌతాయనడం లో ఎటువంటి సందేహం లేదు.శ్రీ సాయి చేసిన ప్రతీ లీలలో నిగూఢం గా ఒక సందేశం వుంటుంది. నిష్కల్మషమైన మనస్సుతో తమ తనమనధన ప్రాణాలను శ్రీ సాయి పాదార్పణం చేసి ఈ లీలలను పఠించిన వారి పూర్వ జన్మ పాపాలన్నీ నివృత్తి అయ్యి ఒక కొత్త అధ్యాత్మిక జీవితం ప్రారంభం అవుతుంది. శ్రీ సాయి చేసిన బోధలను తు :చ : తప్పక పాటించిన వారికి ఆయన యొక్క అనుపమానమైన అనుగ్రహ ఫలం లభ్యమై జీవితానికి సార్ధకత చేకూరుతుంది.


ఒక సంధర్భం లో మహారాష్ట్ర లోని నాసిక్ లో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి చెలరేగింది. లక్షల సంఖ్యలో ఎలుకలు చచ్చిపోతున్నాయి. శ్రీ సాయి భక్తాగ్రేసరుడైన ధుమాల్ ఇంట్లో కూడా ఎలుకలు మరణిస్తున్నాయి. అందుకని తన సద్గురువుకు తాను ఇల్లు మారనున్నానని తెలియజేసాడు ధుమాల్. శిరిడీ నుండి సానుకూలం గా జవాబు రావడం తో ధుమాల్ దూరప్రాంతం లో వున్న మరొక ఇంటికి మారాడు.దురదృష్టవశాత్తు ఆ ప్రదేశం లో కూడా ప్లేగు వ్యాపించింది. ఇక చేసేది లేక తన తక్షణ కర్తవ్యం తెలుపమంటూ ధుమాల్ మరల శ్రీ సాయికి లేఖ రాసాడు. శ్రీ సాయి ఎలాగూ ఇంకో ఇంటికి మారమంటారని భావించి ఇంట్లో వున్న సామానంతటినీ సర్దిమరొక ఇంటిని చూసుకొని మారడం కోసం ఎదురుచూడసాగాడు.ధుమాల్ లేఖను శ్యామా శ్రీ సాయికి చదివి వినిపించగా "అతనేం ఇల్లు మారనవసరం లేదు. నేనుండగా అతని కుటుంబానికి ఏం కాదు" అని సాయి బదులిచ్చారు. అదే విషయాన్ని శ్యామా లేఖ రాసాడు. జవాబు నందుకున్న ధుమాల్ శ్రీ సాయిపై అచంచల విశ్వాసం తో అదే ఇంటిలో కొనసాగాడు. ఆశ్చర్యం. చుట్టు పక్కల వారందరూ ప్లేగు వ్యాధి బారిన పడి ఆస్పత్రి పాలయ్యారుకాని ధుమాల్ ఇంటిలోని వారికి ఏ ప్రమాదం జరగలేదు. ఎటువంటి పరిస్థితి లోనైనా శ్రీ సాయి పలుకులను గాఢం గా విశ్వసించిఆయన ఆఞను శ్రీ రామరక్షగా భావించిన వారికి ఎన్నడూ ఏ విధమైన ఆపద జరగదని శ్రీ సాయి మరొక సారి ఈ లీల ద్వారా నిరూపించారు.

మరొక లీలలో ఒక యువకుడు త్రాగుడు అలవాటుకు తీవ్రం గా బానిస అయ్యాడు. సంపాదించిన దాన్నంతటినీ త్రాగుడు కోసమే ఖర్చు చేస్తూ తన సంసారమంతటినీ వీధి పాలు చేసాడు.అతని భార్య ప్రోధ్భలం పై శిరిడీకి వచ్చి శ్రీ సాయి పాదాలపై పడి తన దురలవాటును తొలగించవల్సిందిగా కన్నీరు మున్నీరు గా ప్రార్ధించాడు. శ్రీ సాయి అతడిని ఆశీర్వదించి శిరిడీలో ఒక వారం రోజులు వుండమని ఆదేశించారు. ఆ వారం రోజులలో రెండు పూటలా మశీదులో శ్రీ సాయిని దర్శనం చేసుకునే వాడు. ఆ యువకుడు చిత్రం గా ఇంతకు ముందు వేళా పాళా లేకుండా మద్యం తాగాలనిపించే ఆ యువకుడికి ఒక్కసారిగా త్రాగాలన్న కోరికే నశించిపోయింది.ఆ వారం రోజులు పూర్తయ్యేసరికి అతనిలో కోరిక పూర్తిగా నశించిపోయింది. ఒక సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ నూతనోత్సాహం తో ఆ యువకుడు శ్రీ సాయి ఆశీర్వచనములను అందుకొని సంతోషం గా తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అదే విధం గా సంభార్ అనే ఒక పచ్చి తాగుబోతు అలవాటును కూడా శ్రీ సాయి శిరిడీలో తన సన్నిధిలో వుండడం అనే సాధన ద్వారా మానిపిం చి వేసి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన వైనం శ్రీ సాయి సచ్చరిత్రలో మనం చూడవచ్చు. ఈ లీలలలో సాయి వారికి ఏ విధమైన బోధలు కానిమంత్రోపదెశం గానిధ్యానాలు కాని చేయించలేదు.కేవలం ఒక సన్నిధిలో వుంచి తద్వారా వారిలో పరివర్తన తీసుకు వచ్చారు. అందుకే సాయి సన్నిధిలో సకల జీవులకు పూర్తి రక్షణ లభిస్తూ వుండేది.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు.

***

No comments:

Post a Comment

Pages