శ్రీథరమాధురి - 105 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 105

Share This

శ్రీథరమాధురి - 105

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)


 శ్రీ రుద్రం

ధర్మం యొక్క గొప్పతనాన్ని అంతా మనం శ్రీరుద్రం లోని ఈ ఒక్క శ్లోకాన్ని చూచి తెలుసుకోవచ్చు. కేవలం దైవాన్ని కాదు ఆయన అనుచరులను కూడా ఆరాధించి, గౌరవించాలి.
 
నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీథుషే!
 అథో యౌ అస్య సత్త్వనో హంతేభ్యో కరన్నమః !

ఓ రుద్రా, నీలకంఠా ! వేయి కనులు కలవాడా! నేను నిన్ను మాత్రమే నమస్కరించి గౌరవించట్లేదు, నీతో పాటుగా నిన్ను ఆరాధించి పూజించే వారందరినీ కూడా ఆరాధించి గౌరవిస్తున్నాను.

తమ‌ భగవానుడిగా రుద్రుడిని ఆరాధించే వారందరినీ కూడా ఆరాధించి, గౌరవించాలి. ఎందుకంటే భగవానుడు వారి ద్వారా కూడా నివసిస్తూ ఉన్నాడు కదా ! వారు రుద్రుడి నామాలను పగలూ రాత్రీ జపిస్తూ ఉంటారు కనుక, భగవానుడు వారిలో శాశ్వతంగా నివసిస్తూ ఉంటారు. వారి నుంచి ప్రసరించే దివ్యకాంతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రుగ్మతలను నిర్మూలిస్తుంది. వారు వృద్ధుడి యొక్క దివ్య కాంతిని వ్యాప్తి చేస్తూ ఉంటారు, అందుకే వారిని కూడా ఆరాధించి, పూజించాలి.
అటువంటి వారిని కొలిచినప్పుడు, నిశ్చయంగా రుద్రుడు కూడా ప్రసన్నుడౌతాడు. భగవంతుడు ఆయన భక్తులలో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక, వారికి ప్రణమిల్లితే, అది కూడా రుద్రుడిని చేరుతుంది. అందుకే రుద్ర భక్తులను ఆరాధించాలి.

ఇదే సనాతన ధర్మం లో ఉన్న అద్భుతం. వేదాలు సామరస్యాన్ని, పరస్పర గౌరవాన్ని  తీసుకు వస్తాయి. ఇవి 'దేవో మానుష రూపేణ' అన్న అంశాన్ని చాటిచెబుతాయి. అందుకే ధర్మాన్ని పాటించే వారిని గౌరవించాలని ఉద్ఘటించబడింది.
 
***

కార్తీకమాసంలో అందరూ ముఖ్యంగా, భగవానుడైన సదాశివుని ప్రత్యేకమైన భక్తిభావంతో ఆరాధిస్తారు.
 
'ఏకం‌ సత్ విప్రా బహుధా వదంతి...'
సత్యం ఒక్కటే కానీ దాని ఉనికి అనేక రూపాల్లో తెలుపబడింది.
హిందూధర్మం యొక్క సౌందర్యం ఏమిటంటే, అది అత్యంత  దయామయులైన శక్తివంతులైన భగవానుని, అనేక స్వరూపాల్లో వర్ణిస్తుంది.
 
అటువంటి ఒకానొక భగవంతుని స్వరూపమే 'సదాశివుడు.'
 
శివుడిని నేను 'సదాశివుడు' అనేందుకు ఇష్టపడతాను‌
 
'శివుడు' అంటే శుభకరుడు అని అర్థము. 'సదాశివుడు' అంటే ఎల్లప్పుడూ 'శుభాలను కలిగించే వాడు' అని అర్థము.

సదాశివుడు అన్ని విధాలుగా శుభకరమైన వాడు. అయిన ఏమి చేసినా శుభానికే. ఆయన ఏమి చేసినా అది ఎల్లప్పుడూ ఈ విశ్వం యొక్క మేలు కొరకే!

మానవులుగా మన లౌకికమైన తెలివితేటలు, పరిమితమైనందువల్ల, మన మేధస్సుతో సాధారణంగా మనం దేన్నైనా 'మంచి' లేక 'చెడు' అనీ, 'తప్పు' లేక 'ఒప్పు' అనీ 'సంపూర్ణము' లేక 'అసంపూర్ణము' అని ముద్రవేసి విచక్షణ చూపుతాము. సదాశివుని చర్యల్లో గొప్పదైన శ్రేయస్సును మనం గుర్తించలేము. ఆయనే విశ్వ జ్ఞానానికి శాశ్వతమైన మూలమని తెలుసుకోలేము.
 
'సదాశివ' భగవానుని 'శ్రీరుద్రం' ద్వారా ఆరాధిస్తాము. ఇది యజుర్వేదం లోని తైత్తిరీయ ఉపనిషత్తులో ప్రధానంగా మనకు కనిపిస్తుంది.

'శ్రీరుద్రం' శివుని యొక్క పదకొండు నామాలు అన్నిటికంటే గొప్పవని చెబుతుంది.

''నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్ర్యయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః.'
ఈ 11 నామాలలో మీరు నిశితంగా గమనిస్తే రెండవది పదకొండవది ఒకటే, కానీ రెండిటికీ కాస్తంత తేడా ఉంది, అది నేను చివర్లో చెప్తాను.

ఈ మంత్రంలోని పదొవ నామం 'సదాశివాయ'.

-విశ్వేశ్వరాయ - ఆయన ఈ విశ్వానికే దైవం, ఈ సమస్త సృష్టికి, సృష్టిలోని చరాచర వస్తువులకు, సాకార నిరాకార జగతికి కూడా ప్రభువు. ఆయనే సృష్టిని చేసారు కనుక, ఆయన మాత్రమే అన్నిటికీ  యజమాని.

 - మహాదేవాయ - ఆయన అందరూ దేవతలకు అధిపతి, ఈ సృష్టిలోని అంశాలన్నీ సజావుగా సాగేందుకు వారందరికీ పర్యవేక్షించే బాధ్యతను ఆయన అప్పగించారు.

-త్ర్యయంబకాయ - ఆయనలోనే సృష్టి, స్థితి, లయ అనే మూడు అంశాలు ఉన్నాయి. ఆయనలోనే సత్వ( సత్యము & సంతులనం) రజస్(చర్య&రాగము) తమో(వినాశనము &పునర్జీవనము) అనే గుణాలు ఉన్నయి. ఆయన కాలానికి(సమయానికి) అధిపతి. అందుకే ఆయన అతీత(గతము), వర్తమానము (ప్రస్తుతము), భవిష్య(భవిష్యత్తును) పరిపాలిస్తారు. అందుకే ఆయనలో ఇటువంటి అనేకమూన మూడు అంశాలు ఉన్నాయి కనుక వేదాలు ఆయనని 'త్రి-అంబక' అని వక్కాణిస్తాయి. ఈ మూడు అంశాలన్నీ ప్రకృతి మాత యొక్క లక్షణాలను సూచిస్తాయి కనుక, 'త్రి' అంటే మూడు, 'అంబ'క అంటే అమ్మకు సంబంధించినవి, అని అర్ధం. 'అంబక' అంటే కన్నులు అనే అర్థం కూడా ఉంది. మూడు కన్నులలో కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవకన్ను అంగారకుడు. ఎంతపని ఉన్నా కనిపెట్టుకుని వుండే కన్నతల్లి చూపులా, భగవంతుడు మనుషులతో సహా, తన సృష్టిలోని అంశాలన్నింటినీ వాటి సంరక్షణ, భద్రత కోసం గమనిస్తూ ఉంటాడు. ఇది ఆయనలో మాతృత్వానికి సంబంధించిన అంశం.

- త్రిపురాంతకాయ - తారకాసురునికి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ, వారు ముగ్గురికీ ఆకాశంలో మూడు పరిభ్రమించే నగరాలను ఇచ్చాడు‌. ఆ మూడు నగరాలు ఆకాశంలో ఒకేసమయంలో, దూరదూరంగా, వేగంగా తిరుగుతూ ఉండేవి. అలా తిరుగుతున్న ఈ నగరాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు, ఒక్క అగ్ని బాణంతో వాటిని కొట్టినప్పుడే, వారు మరణిస్తారని బ్రహ్మ వారికి చెప్పాడు. ఆ మూడు నగరాలు ఒకే రేఖపై, ఒక ఒకే వరుసలో ఉండే అవకాశాలు చాలా తక్కువ.
ఈ రాక్షసులకు ఒక్కసారి బలం చేకూరగానే వారు దేవతలను, ఋషులను హింసించ సాగారు. చివరికి శివుడు తన రథంలో కూర్చుని బ్రహ్మరథసారధిగా ఉండగా, విష్ణువు అగ్ని బాణంగా ఉండగా, 'త్రిపురా' లని పిలువబడే ఆ మూడు నగరాలు ఒకే వరుసలో కి వచ్చినప్పుడు కాల్చివేశాడు. అందుకే ఆయనను 'త్రిపుర - అంతకాయ', అంటే త్రిపురాలను, ఆ రాక్షసులను సంహరించినవారు అని పిలుస్తారు.

- త్రికాగ్ని కాలాయ - 'త్రికాగ్ని' అంటే మూడు రకాలైన అగ్ని. జఠరాగ్ని, భూతాగ్ని, ధాత్వాగ్ని. ఈ మూడు అగ్నులకూ, జీవులతో చాలా దగ్గరి అనుబంధం ఉంది. మనం తిన్న ఆహారం జీర్ణమై, శోషించుకునేలా చేసేది జఠరాగ్ని. భూతాగ్ని, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం అనే పంచభూతాలతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. పంచభూతాలకు సంబంధించిన ఈ భూతాగ్ని, శోషించుకున్న ఆహారాన్ని కణజాలస్ధాయిలో ఇముడ్చుకునేలా చేస్తుంది. ధాత్వాగ్ని ఇప్పుడు కణజాలాల యొక్క జీవక్రియలను బలోపేతం చేసి, జీవికి శక్తినిస్తుంది.

 కాబట్టి ఉనికి, జీవనపరిమితి అనే వాటిని 'కాలము' నిర్ణయిస్తుంది. అందుకే ఆయనను 'త్రికాగ్ని కాలాయ' అంటారు.

- కాలాగ్ని రుద్రాయ - జీవి యొక్క జీవనం ముగిశాక, కాలాగ్ని స్వరూపుడైన భగవానుడు దానిని మింగుతాడు. విశ్వరూపం చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది కనుక ఆయనను 'రుద్రుడు'(భయంకరమైన వాడు) అంటారు. అందుకే 'కాలాగ్ని రుద్రాయ.'

- నీలకంఠాయ - తమను ఆరోగ్యవంతుల్ని, యౌవ్వనవంతుల్ని, అమరులను చేసే అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు, మహావిష్ణువు 'కూర్మనారాయణుని' అవతారం దాల్చి మందర పర్వతాన్ని పాల సముద్రంలో మునిగిపోకుండా తన వీపుపై మోసారు. శివుడు తొలుత వచ్చిన హాలాహలాన్ని త్రాగడానికి ముందుకు వచ్చారు. ఆయన ఆ విషాన్ని తాగి, తన గొంతులోనే దానిని నిలిపి ఉంచినందువల్ల, ఆయనను నీలకంఠుడు, నీలపు రంగు మెడ కలవారు, అంటారు. అందుకే  'నీలకంఠాయ'.

- 'మృత్యుంజయాయ' - మృకండు మహర్షికి, మరుద్మతికి, మార్కండేయుడు అనే కుమారుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగలవాడు, అయినా పదహారేళ్ల ఆయిష్షు మాత్రమే ఉన్న వాడు. మార్కండేయుడు శివ భక్తుడు యమ కింకరులు అతడిని తీసుకువెళ్లేందుకు వచ్చి, విఫలమయ్యారు. అప్పుడు యముడే నేరుగా వచ్చి, మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకుని ఉండడం చూసి, శివలింగంతో సహా మార్కండేయుడు చుట్టూ తన పాశాన్ని విసిరి, లాగాడు. శివుడు యముడితో యుద్ధం చేసి మార్కండేయుని రక్షించి, చిరంజీవిగా ఎల్లప్పుడూ పదహారేళ్ళ వయసు వాడిగానే ఉండేలా అతడిని దీవించారు. అందుకే మృత్యువంటే మరణము, జయము అంటే దాని పై విజయము. అందుకే మృత్యుంజయుడు అంటే, మరణాన్ని జయించినవాడు అని అర్థం.

- సర్వేశ్వరాయ - ఆయన దేవతలందరికీ కూడా అధిపతి. అందుకే సర్వ - ఈశ్వరాయ.
- సదాశివాయ - హాయ్ విశ్వేశ్వరుడిగా, మహా దేవుడిగా, త్రయంబకుడిగా, త్రిపురాంతకుడిగా, త్రికాగ్నికాలుడిగా, కాలాగ్ని రుద్రుడిగా, నీలకంఠుడిగా, మృత్యుంజయుడిగా, సర్వేశ్వరుడిగా, ఏ పాత్రను పోషించిన కూడా అదంతా విశ్వ శ్రేయస్సుకే.  అది అన్నిటికీ, అందరికీ శుభాలను కలిగించేది. అది సృష్టి స్థితి లయల్లో ఏదైనా కూడా, శుభాలను కలిగించేదే తప్ప, వేరేమీ కాదు. అందుకే ఆయనను 'సదా శివుడు', అంటే ఎల్లప్పుడూ శుభాలను కలిగించేవారు అని పిలుస్తారు.
'     
- 'శ్రీమన్ మహాదేవాయ నమః' - ఇక్కడ 'శ్రీమన్' అన్న పదాన్ని మహాదేవుడి ముందు వాడారు. కానీ రెండవ నామాల్లో కేవలం 'మహాదేవాయ' అని వాడారు. మను శ్రీమన్ లేక శ్రీమాన్ అన్న పదాల్లో దేనిని వాడినా కూడా, 'గౌరవప్రదంగా ఆరాధించదగ్గవార'నే అర్ధం వస్తుంది. ఎందుకంటే శ్రీ అనే పదం 'విశ్వానికి తల్లి' అన్న అర్ధాన్ని కలిగి ఉంటుంది. శ్రీమన్ లేదా శ్రీమాన్ అన్నప్పుడు అది ఈ 'విశ్వ మాతృత్వాన్ని' సూచిస్తుంది. కాబట్టి 'శ్రీమన్మహాదేవాయ నమః' అంటే, ఈ విశ్వానికే తల్లి అయిన ఆయన మాతృత్వానికి, యాదృచ్చికంగా దేవతలకు అధిపతి అయిన శివునికి సాష్టాంగ నమస్కారము.
'అందుకే వేదాలు ఈ మంత్రాన్ని 'శ్రీ రుద్రం' అన్నాయి. ఇక్కడ శ్రీ అనేది భయంకరమైన రుద్రుని శక్తి వెనుక ఉన్న మాతృత్వపు అంశాన్ని నిర్వచిస్తుంది. అయినా భయానకంగా కనిపించినా కూడా, ఎక్కువగా తల్లి వంటి వారు ఆయన 'సదాశివుడు'. ఈ విశ్వానికి, సృష్టికి అత్యధికంగా మేలు చేసేందుకు, ఆయన తప్పనిసరై రుద్రుని పాత్రను పోషించవలసి వస్తోంది.
    
'శ్రీరుద్రం' అనేది చాలా విస్తృతమైన అంశం. దానికున్న అనేక ముఖాల గురించి వివరించడానికి ఒక జీవితం సరిపోదు. ఒకవేళ అలా వివరించిన కూడా యుద్ధంలో మానవ గ్రహింపుకు అందని అనేక అంశాలు ఉన్నాయి.

కార్తీక మాసం కనుక, శ్రీరుద్రంపై కొన్ని అంశాలను వివరించమని ఇవాళ ఉదయం ఒక‌శిష్యుడు నన్ను అభ్యర్థించాడు.

అందుకే నేను అందులోని ఒక చిన్న భాగాన్ని, నాకు నా గురువైన మహర్షి రాజర్ అనుగ్రహించిన విధంగా తెలియజేశాను.

ఓం‌ నమఃశివాయ.

No comments:

Post a Comment

Pages