శ్రీధరమాధురి - 104 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 104

Share This

శ్రీధరమాధురి - 104

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)

మీ తల్లి లేక తండ్రి మీకు ఏదైనా ఆస్తిని లేక డబ్బును ఇస్తే దాన్ని నిరాకరించకండి, స్వీకరించండి. అది మీకు పితృ కటాక్షాన్ని ఆర్జించి పెడుతుంది. అది వారి దీవెనలను మీకు అందిస్తుంది.

 ***
తల్లిదండ్రులు తమ కొడుకు లేక కూతురికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన కొన్ని సంఘటనలు నాకు తెలుసు. పిల్లలు తమకు ఆ డబ్బు/ఆస్తి వద్దని అన్నారు. మీరు మాకు చదువును, జీవితాన్ని ఇచ్చారు, అదే చాలు అన్నారు.
మొదట మీ వ్యక్తిగత జీవితాన్ని పరిరక్షించుకోవడం మీరు నేర్చుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితోనూ చర్చించకండి. మీరు చాలా జాగ్రత్తతో, ఎంపిక చేసుకోవాలి.

మనలో కొంతమంది వారితో మన అనుబంధానికి విలువ ఇచ్చేంత పరిణితిని కలిగి ఉండరు. 

అటువంటివారు మనగురించి చాటింపులు వేయడంలో‌ సిద్ధహస్తులు...

***
మీరు ఇలా వాదించడం తప్పు. తల్లిదండ్రుల సేవలకు మీరు ఎన్నడూ ఏమీ తిరిగి చెల్లించ లేరు. అది వాళ్లకు భారం అవుతుందని మీరు ఆలోచించకూడదు. ఒకవేళ వారు మీకు ఇచ్చేందుకు ముందుకు వస్తే, మీరు దాన్ని తీసుకొని ముందు తరాలకు అందించాలి లేదా సరైన విధంగా ఉపయోగించుకోవాలి.
 
తల్లిదండ్రులు ఇచ్చిన ఏ కానుకనూ వద్దనకండి. మీరు నిరాకరిస్తే పితృదేవతలు లేక పూర్వీకులు నిర్ణయం పట్ల సంతోషంగా ఉండరు.

***
మొదట మీ వ్యక్తిగత జీవితాన్ని పరిరక్షించుకోవడం మీరు నేర్చుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితోనూ చర్చించకండి. మీరు చాలా జాగ్రత్తతో, ఎంపిక చేసుకోవాలి.

మనలో కొంతమంది వారితో మన అనుబంధానికి విలువ ఇచ్చేంత పరిణితిని కలిగి ఉండరు. 

అటువంటివారు మనగురించి చాటింపులు వేయడంలో‌ సిద్ధహస్తులు...

***

No comments:

Post a Comment

Pages