తిరుమలాపుర రామచంద్రప్రభు శతకము - గోపాలుని పురుషోత్తమశర్మ పాకయాజి - అచ్చంగా తెలుగు

తిరుమలాపుర రామచంద్రప్రభు శతకము - గోపాలుని పురుషోత్తమశర్మ పాకయాజి

Share This

తిరుమలాపుర రామచంద్రప్రభు శతకము - గోపాలుని పురుషోత్తమశర్మ పాకయాజి

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం: తిరుమలాపుర రాం, చంద్రప్రభు శతకకర్త గోపాలుని పురుషోత్తమశర్మ పాకయాజి ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు. యజుర్వేదాధ్యాయి. మౌద్గల్య గోత్రుడు. తల్లితండ్రులు కోటమాంబ, వెంకయ్య. ఈకవి బహుగ్రంథ కర్త. 1. కేశవ శతకము, 2. మార్కండేయ, 3. గోపీచందు, 4. సత్యహరిశ్చంద్ర, 5. అభిజ్ఞానశాకుంతల, 6. కోటీశ్వరతారావళి, 7. దుర్గాస్తోత్రము, 8. తిరుమలాపుర రామచంద్రప్రభు  శతకము. ఇవే కాక అనేకదండకములు కూడా ఈకవి రచించినట్లు తెలుస్తున్నది. క్రీ.శ. 1936 న ఈశతకం ముద్రింపబడినది. ఇంతకంటే కవికాలాదులుమొదలైన వివరాలు తెలియరాలేదు.

ఈకవి శతకాంతమున తనగ్రించి ఈవిధంగా చెప్పికొనినాడు.

మ. వినుతాఱ్వేలనియోగివిప్రుఁడ, యజుర్వేదుండ మౌద్గలగో
త్రనరోత్తంసుఁడు వేంకనార్యునకుఁ గాంతామాన్య కోటాం
బకున్ దనయుండం, బురుషోత్తమాహ్వయుఁడ నన్నా! య
జ్వ నిద్దాని జేసినవాడం; గనుపర్తిమానృహరి వాసిం గోర రామప్రభూ!

మ. శతకంబిద్ది రచించె దిశ్శర మహైశ్వర్యేందు సంజ్ఞన్ జగ
న్నుతమై యొప్పిన శాలివాహుశకమందున్ ధుఋతసంవత్సరా
న్వితమౌజ్యేష్ఠపుఁ గృష్ణపక్షమున నెంతేయున్న యేకాదశిన్
మతి నీపైనిడి తిర్మలాపురవరేంద్రా! రామచంద్రప్రభూ!

దీనిని బట్టి కవి క్రీ.శ.1900 ప్రారంభ కాలమువానిగా తోచుచున్నది.

శతకపరిచయం:

"తిర్మలపురీంద్రా! రామచంద్రప్రభూ" అనేమకుటంతో శార్థూల మత్తేభ వృత్తాలలో రచింపబడిన ఈ శతకం భక్తిరసప్రధానమైనది. కవిగారు ఈశతకాన్ని హేలాపురి మండలములోని తిరుమలాపురమునందు వెలసిన శ్రీరామచంద్రునికి అంకితముగా రచించినట్లు శతకారంభమున చెప్పికొనినాడు

సీ. శ్రీమించు హేలాపురీ మండలంబందుఁ, దిరుమలాపురమున వఱలునెవఁడు
కనుపర్తి వీరరాజునకు తనూజుడౌ, శ్రీనృసింహున కిష్టసిద్ధి యెవఁడు
సుబ్బరాయున కాత్మసూనుఁడౌ కృష్ణరా, యునకుఁ బ్రసన్నుఁడై మనుచు నెవఁడు
గురురాజసుతుల నిర్వుర సుబ్బరాయ సం, జీవరాయులనేలు శ్రీశుఁడెవఁడు

తే.గీ. అట్టి సుందరరామ విఖ్యాత నామ
మలరు దేవాదిదేవున కర్పణముగ
శతకవృత్తంబులన్ గృతి సల్పినాఁడ
మోక్షసామ్రాజ్య మొనగూర్ప మ్రొక్కువాఁడ.

కొన్ని పద్యాలను చూద్దాము

శా, శ్రీవైకుంఠ మయోధ్య గాఁగ సిరియే సీతామహాదేవిగాఁ
గైవల్యప్రదుఁడీవ రాఘవుఁడు గాఁగన్,శంఖచక్రంబులే
సెవాసక్తులు కైకసూనులుగాఁ దచ్చేషుండు సౌమిత్రిగా
నావిరుభూతులుగారె తిర్మలపురీంద్ర! రామచంద్రప్రభూ!

కవి శతకారంభమున ద్వితీయ పద్యము నుండి దశావతార వర్ణనము కావించినాడు.

మ. దితిసంతానమునం దొకండగు మదోద్రేకుండు హేమాక్షుడీ
కుతలం బంతయు జాపజుట్టి జలధిన్ గూల్పంగ, భూదేవి ని
న్నతిదీనత్వముఁజెంది వేడఁ గిటివై యాభూమిపైకెత్తి త
త్సతి మెప్పొందిన త్రిమలాఖ్యనగరీశ! రామచంద్రప్రభూ!

మ. మునుయాగార్థము తాటకన్ దునిమి, సమ్మోదంబుతో శంభుదే
వునివిల్లున్ దునియించి సీతఁగొని మెప్పున్ జెంది శూరాళిచే
త, నరణ్యమునకేగి పంక్తిగళునిన్ దండించి సాకేతమున్
ఘనతన్ జేరిన తిర్మలపురీంద్ర! రామచంద్రప్రభూ!

దశావతారవర్ణనము తర్వాత రామాయణామునందలి అనేక ఘట్టములను గూర్చి కవి వివరించినాడు.

మ. శిబి యేమిచ్చె నహల్య యేమిడె గజశ్రేష్ఠుండు పాంచాలియున్
సొబగౌరీతిని నీకొసంగిరొకొ యేసొమ్మేని వాక్రువ్వుమా
విబుధస్తోత్రపరాయణా! తలఁప నీవే కాతు వెల్లప్పుడున్
బ్రబలప్రేమను తిర్మలపురీంద్ర! రామచంద్రప్రభూ!

మరొకొన్ని మనోహరమైన పద్యాలను చూద్దాము.

శా. నీనామామృతమాధురిని, మౌనిస్తోమ మత్యంతమున్
బానార్హంబని క్రోలిసంతసముతోఁ బ్రారబ్ధముల్ వాసె; నా
దీనాలాపము లాలకించి మనుపన్ దిక్కీవె;యీసృష్టికిన్
బ్రాణాధారుఁడ!తిర్మలపురీంద్ర! రామచంద్రప్రభూ!

మ. కరిరాజంతటివాఁడు వారిఁజొర నక్రం బాతనింబట్ట భీ
కరశౌర్యోద్ధితశక్తి నా మకరితోఁ గయ్యంబు గావించి యే
వెఱవుం గానక కావవే యనుచు నిన్ వేడంగ, వేవచ్చి నే
ర్పరివై కాచితి తిర్మలపురీంద్ర! రామచంద్రప్రభూ!

శా. బాలుం డౌటను మన్ను దింటి వను విభ్రాంతిన్ యశోదమ్మ నీ
చాలున్ గానకనోరు చూపుమనగా సర్వప్రపంచంబు నీ
లీలాశక్తిని జూపితల్లి నట వల్లె నాగ మెప్పించితౌ
రా లక్ష్మీధవ! తిర్మలాపురవరేంద్రా! రామచంద్రప్రభూ!

ఇటువంటి కృష్ణలీలలను వర్ణించు పద్యాలే కాక తాత్త్విక యోగ సంభంధమైన పద్యాలను కూడా మనం ఈశతకంలో చూడవచ్చును.

మ. పవనంబున్ బిగియించి, యింద్రియములన్ బంధించి, కామాదులన్
దవులంజేయక దృక్కులన్నిలిపి, చైతన్యంబుడంబాఱగా
భవదీయంబగు రూపుగాంచునరుడే ప్రాజ్ఞుండు, ధన్యుండు
నీశ్వర నిన్ బొందున్ తిర్మలాపురవరేశా రామచంద్రప్రభూ!

మ. నవ మాసంబులు గర్భగోళమున మన్పన్ గర్త యెవ్వాడు యీ
భువనశ్రేణికి రక్షకుం డెవడు, పెంపున్ జేయ మాయింపగా
ధవుఁడెవ్వాడొ జగంబు లెవ్వని సదా ధ్యానించునో యట్టి క
ర్తవు నీవౌదువు తిర్మలాపురవరేంద్రా! రామచంద్రప్రభూ!

మ. కలలోఁ గాంచినవస్తుజాల మది మేల్కొంచలేనట్లుగన్
సలిలాంతశ్చరబుద్భుద ప్రతిమమౌ సంసారసౌఖ్యాళి యా
వల వ్యర్థుం బొనరించు నిట్లెఱిగి త్వత్పాదార్చకుండైన ని
ర్మలుఁడే పూజ్యుఁడు త్రిమలపురవరేంద్ర! రామచంద్రప్రభూ!

మ. త్రివిధంబుల్ గుణముల్ త్రిమూర్తులయి వర్థిల్లెం జుడీ యంచు స
త్కవులుం బండితులండ్రు; తత్త్వము నెఱుంగంజిత్త మాసించు భ
క్తవితానేష్టద మామకేష్టమగు నద్దానిం దయఁజూపున
న్నవమానింపక తిర్మలపురవరేంద్ర! రామచంద్రప్రభూ!

ఇటువంటి అద్భుతమైన పద్యాలతో పురాతన శాతకాలకు ఏమ్మాత్రము తీసిపోని ఈశతకంలో ప్రతిపద్యము మధురమే. అందరు చదువవలసిన ఈశతకాన్ని మీరూ చదవండి. మీ మిత్రులచే చదువించండి. శా. బాలుం డౌటను మన్ను దింటి వను విభ్రాంతిన్ యశోదమ్మ నీ

ఇటువంటి అద్భుతమైన పద్యాలతో పురాతన శాతకాలకు ఏమ్మాత్రము తీసిపోని ఈశతకంలో ప్రతిపద్యము మధురమే. అందరు చదువవలసిన ఈశతకాన్ని మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి. 

***

No comments:

Post a Comment

Pages