‘అనుకోకుండా ఓ రోజు’ కథాసంపుటి సమీక్ష! - అచ్చంగా తెలుగు

‘అనుకోకుండా ఓ రోజు’ కథాసంపుటి సమీక్ష!

Share This

అనుకోకుండా ఓ రోజు’ కథాసంపుటి సమీక్ష!

 -ప్రతాప వెంకట సుబ్బారాయుడు


రచయితలు సామాజిక బాధ్యతతో కథలు రాయాలి. పాఠకులు ఆ కథలు చదివి జీవితాలకు మెరుగులు దిద్దుకోవాలి. ఆ కోవకు చెందినవే పి ఎల్ ఎన్ మంగారత్నంగారి  20 కథల సంపుటి ‘అనుకోకుండా..ఓ రోజు’. 


పుస్తకానికి పెట్టిన శీర్షిక దాదాపు అన్ని కథలకు సరిగ్గా సరిపోతుంది. కథాంశాలు, పాత్రలూ మన చుట్టూ ఆవరించుకున్నవే అవడం మూలాన చదివినవారి మనసు మూలాల్లోకి చొచ్చుకుపోతాయి. సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన కథలవడంవల్లను, మరీ ముఖ్యంగా కొవిడ్ జీవితాలను ఎలా అతలాకుతలం చేసిందో పరిస్థితులను ఆకళింపు చేసుకుని రచయిత్రి రాయడం వల్లనూ పాఠకులను అలరించి తీరుతాయి. 


అనుకోకుండా ఎవరో వచ్చి తాళంకప్ప సమస్యను ఎలా పరిష్కరించారో సరదాగా రాసుకుంటూ వచ్చి చివరికి మధ్యతరగతి మనస్తత్వానికి చురకపెట్టారు. ఈ కథ పేరే కథా సంపుటికి పెట్టారు. ఊరంతా కొవిడ్ కర్ఫ్యూలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కనీసం నడక దారిలోనన్నా సొంత ఊరికి వెళ్లాలని బయల్దేరినవాళ్ల జీవితాలు అర్ధాంతరంగా ఎలా ముగిసాయో ‘కాలం నేర్పిన పాఠం’ మసకబారిన కళ్లకుకడుతుంది. మేల్ ఈగోతో భార్యను ఎలా బాధలు పెట్టాడు, పిల్లల్ని ఎలా భయపెట్టాడు, తర్వాత తనకు ఎలా కనువిప్పు కలిగిందో తెలియజేసే కథ ’జీవితం విలువ’. ఇది మంచి కథల కొంత పరిచయం. మొదటి కథ వద్ద చదవడం ప్రారంభిస్తే చివరి కథ దగ్గర ఆపు(గు)తాం. పాఠకుడికి సంతృప్తిని కలగజేసే కథల సమాహారం అనడం అతిశయోక్తికాదు.

For Copies:



No comments:

Post a Comment

Pages