'పుప్పొడి తలపు' - అచ్చంగా తెలుగు

 'పుప్పొడి తలపు' 

-సుజాత.పి.వి.ఎల్, 
సైనిక్ పురి, సికిందరాబాద్.పువ్వు రాజ్యానికి యువరాణి
వాల్చిన తలను
తలపులతో సవరించుకొంటోంది..

నానా వర్ణ శోభిత సొగసులతో
చూపరుల కళ్ళ నుంచి
హృదయాలను కొల్లగొడుతోంది..

భానుడి లేలేత కిరణాలు 
స్పృశించగానే తన్మయత్వ భావనతో..
వయ్యారాలు ఒలకబోస్తోంది..
మలయమారుతం ఆకతాయిగా వీచినా..

యాదృచ్ఛికంగా తాకినా..
మురిసి మెరిసిపోతుంది..
గాలి అలలపై తేలియాడుతూ 
మరో పుష్పాన్ని చేరి తరించిపోతుంది..

కాయగా, పండుగా మారి, 
జన్మ ధన్యం చేసుకుంటుంది..
మరో మొక్కకు ప్రాణమవుతోంది..!
****

No comments:

Post a Comment

Pages