బర్త్ డే విషెస్ - ఆర్కోట్ వేంకటరమణ - అచ్చంగా తెలుగు

బర్త్ డే విషెస్ - ఆర్కోట్ వేంకటరమణ

Share This

బర్త్ డే విషెస్ 

ఆర్కోట్ వేంకటరమణ


“హ్యాపీ బర్త్ డే గోకుల్” మొబైల్ లో వీడియో కాల్ చేస్తూ విషెస్ చెప్పాడు కిష్టప్ప.

“థాంక్స్ పెదనాన్న!. థాంక్స్! మెనీ మెనీ థాంక్స్! మీ ఆరోగ్యం ఎలా వుంది?”అని అడిగాడు గోకుల్.

“నే బావున్నలేరా! ఎలా వుంది అక్కడ.? మనవాళ్ళు ఉన్నారా? ఎవరైనా పరిచయం అయ్యారా? వాతావరణం ఎలా వుంది?” అని ఆప్యాయంగా అడిగాడు కిష్టప్ప.

“చాలా బాగుంది పెదనాన్న ఇక్కడ. మన వాళ్ళు ఇక్కడ బోల్డు మంది ఉన్నారు” అంటూ బదులిచ్చాడు.

“కోడలు పిల్ల ఎలా వుంది? మనవడు ఏమంటున్నాడు?” ప్రశ్నించాడు.

“ఇదిగో పెదనాన్న అమ్మాయి మీతో మాట్లాడతాను అంటోంది” అంటూ మొబైల్ భార్య వాసంతి కి ఇచ్చాడు.

“హలో మావయ్యగారు! నమస్కారం. ఇక్కడ మేము అందరము క్షేమం.మీరు ఎలా వున్నారు! మీ ఆరోగ్యం ఎలా వుంది? ఇక్కడ చాలా బావుంది మావయ్యగారు. పేరుకి విదేశం అన్నమాటే గానీ అంతా ఇక్కడ మన అనంతపురం లో ఉన్నట్లే ఉంటుంది. మనవాళ్ళు ఎక్కువగా ఈ కాలనీ లో ఉన్నారు. బాగా కలిసిపోయారు. బాబు బాగున్నాడు. ఇక్కడ వాడికి చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఒకటే ఆటలు., పాటలు. మీరూ ఒక్కరేగా! మావయ్యగారు ఇక్కడికి రండి. బాగా కాలక్షేపం. రండి!” అని ఆదరంగా పిలుస్తున్న కోడలి మాటలకు,

“వస్తా అమ్మాయి! తప్పకుండ వస్తా! ముందు మీరు సెటిల్ అవండి. తరువాత తీరుబడి గా వస్తా” అని బదులిస్తుంటే గోకుల్ లైన్ లోకి వచ్చి, 

 “పెదనాన్న! పెదనాన్న! కళ్యాణ్ ఎలా వున్నాడు” అని ప్రశ్నించాడు.

“బావున్నాడు. ఏం నీతో మాట్లాడలేదా?”

“అప్పడు ఎప్పుడో జాబు లో చేరిన కొత్త లో మాట్లాడాడు. అ తరువాత...”

“సరే సరే నే కనుక్కొంటా లే. జాగ్రత్త. కొత్త దేశం. కొత్త వాతావరణం ఎక్కువగా బయట తిరక్కండి. బై. ఒన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే!” అని మొబైల్ కట్ చేసాడు. 

 ******************

“కళ్యాణ్...కళ్యాణ్...’’ పిలుస్తూ ఆ ఇంట్లో కి అడుగెట్టాడు. కిష్టప్ప.

“రా.బావా! రా...బావా...రా... ఎన్నాళ్ళకు నీ దర్శనం!... ఏమేవ్!... మీ అన్న వచ్చాడు... కాఫీ పట్రా...” అంటూ కేకేసాడు తిమ్మప్ప.

“ఏం! బావా బాగున్నావా... అంతా కుశలమేనా?” అంటూ లోపలి అడుగెట్టాడు కిష్టప్ప.

“అంతా కుశలమే బావా!... నీ దయ వలన వాడో ఉద్యోగస్తుడు అయ్యాడు... వాడి చదువుకు చేసిన అప్పులతో నిద్ర వచ్చేది కాదు. ఇప్పుడు ఆ చింత పోయింది బావా! అంతా నీ చలవ బావా...” అన్నాడు తిమ్మప్ప.

“నాదేముంది బావా ! అంతా ఆ రాఘవెంద్రుడి చలవ. మనము నిమిత్త మాత్రులం...”

“హాయ్ మావయ్యా! బావున్నావా!” అంటూ పలకరింపుతో కళ్యాణ్ ప్రత్యక్షము. చేతిలో మొబైల్ చాట్ చేస్తూ...

“నే బావున్నలేరా! నువ్వు ఎలా వున్నావ్... కొత్త ఉద్యోగం, కొత్త గా బండి...కొత్తగా...మొబైల్...”

“హా! మావయ్యా! చాలా బావున్నాను... ఇంకా”

“ఏముంది రా! ఇవాళ గోకుల్ బర్త్ డే. విష్ చేసి ఇలా వచ్చాను.”

“ఓ! మై గాడ్! నేను మర్చేపోయా” అంటూ సెల్ తెసి వాట్సప్లో మెసేజ్ పెట్టేసాడు.

“ఏమి రా ఏం చేస్తున్నావ్?”

“ఏం లేదు మావయ్య! బర్త్ డే గ్రీటింగ్స్ పోస్ట్ చేస్తున్నా వాట్సప్లో!”

“ఫోన్ చేసి చెప్ప వచ్చు గదా?”

“ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ వచ్చాయి మావయ్యా. ఇలా మెసేజ్ పెడ్తే అలా వెళ్ళిపోతుంది.”

“అదేనా విష్ చేసే పద్ధతి?”

“అంతేగా!”

“చేతిలో మొబైల్ వున్నది ఎందుకు. వాడికి ఫోన్ చేసి చెప్ప వచ్చు గదరా?”

“నీవి అన్నీ పాతకాలం ఆలోచనలు. మావయ్యా. ఇప్పుడు అంతా సోషల్ మీడియా నే. ఇది ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ల యుగం!”

 “అలా చేస్తే సరిపోతుంది అంటావా?”

“కాక?”

“ఫోన్ చేసి చెప్పడానికి ఏమి కష్ష్టం?”

“అబ్బా! అదో పెద్ద బోరు మావయ్యా! వెరీ లాంగ్ ప్రాసెస్. మనం ఫోన్ చేసి నప్పుడు ఒక్కోసారి వాడు దొరకడు... లేదా లేటర్ అని మెసేజ్ వస్తుంది.... ఇలా అయితే వాట్సాప్ లో గ్రీటింగ్ మెసేజ్ చూసుకొని వాడు సంతోష పడతాడు.”

“పడి?”

“అంతే మావయ్యా థాంక్స్ అని రిప్లై ఇస్తాడు.”

“అంతేనా?”

“అంతే మావయ్యా...అంతే...”

“తప్పురా తప్పు! ఫోన్ చేసి మాట్లాడాలి! దొరక్కపోతే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. మనిషి మనిషి కి మధ్య పలకరింపులు ఉండాలి! ఇప్పుడు అవి లేవు! మృగ్యం అయిపోతున్నాయి. యాంత్రిక జీవనం లో యాంత్రికత పెరుగుతోంది. ఆత్మీయత, పలకరింపులు, నేను నా వాళ్ళు అన్నవి తగ్గిపోతున్నాయి. ఇదేనా మనకు చదువు నేర్పిన సంస్కారం?

“అబ్బ! మావయ్యా! ఇప్పుడు కాలం మారింది మావయ్యా.”

“ఏమి మారిందిరా! పీల్చే గాలి మారిందా! తినే తిండి మారిందా! తాగే నీళ్ళు మారాయా! రోజుకు ఇరవైనాలుగు గంటలు మారాయా? ఏమి మారాయి రా?”

“మీ ఆలోచనలు మారాయి! అంతే గాని కాలం ఏమి మారలేదు. సాంకేతికత పెరిగే కొద్దీ మనిషి యాంత్రికుడు అయిపోతున్నాడు. బద్ధకం పెరిగి పోతోంది. సోమరితనం పెరిగింది. సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ , ట్విట్టర్ ఇవే జీవితం అనుకొంటున్నాడు... పక్కవాడితో పలకరింపులు లేవు! ఆత్మీయతలు లేవు!...అనుభందాలు లేవు....ఆనందాలు పంచుకోవడాల్లేవు.... సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా చెప్పుకోవడానికి ఓ మనిషి తోడు కావాలి. అదే ఇప్పుడు తగ్గిపోతోంది. పోతోంది ఏమిటి తగ్గి పోయింది. ఇలా అయితే ఎలా! మంచి, చెడ్డా, లేదు.! పలకరింపులు లేవు.! ఆత్మీయ మాటలు , అన్ని మూగపోయాయి! పోతున్నాయి! మన చేతి లోని స్మార్ట్ ఫోన్ తో మనం కూడా స్మార్ట్ గా మం , అంటే స్తబ్డులం అయిపోతున్నాము. నువ్వేమో వాట్సప్ లో బర్త్ డే గ్రీటింగ్స్ పెడతావు.! వాడేమో థాంక్స్ అని రిప్లై ఇస్తాడు. ఇంతేనా మనిషి కి మనిషికి ఉండే సంబంధం. అనుబంధం, ఆత్మీయత లు అన్ని బూటకం అయిపోతున్నాయి! యాంత్రిక జీవనం లో మనం కూడా ఓ యంత్రం లా అయిపోతున్నాము. ఇక ఎక్కడి నుంచి వస్తాయి అభిమానాలు, అనుభందాలు...ఆత్మీయతలు...?

“నువ్వు చెప్పేదేమీ అర్థం కావడం లేదు మావయ్యా...” అన్నాడు చూపు మొబైల్ నుంచి మరలచకుండా...

(చాటింగ్ లో లీనమయి)

“అర్థం కాదు. నీకు అర్థం కాదు...ఇంట్లో చల్లగా తల్లి వండి పెడుతోంటే , టింగురంగ మని బైకు మీద ఆఫీస్ ! పెద్ద జీతం. సౌకర్యమైన జీవితం! ఇక నీను ఏమి అర్థం అవుతుంది! కానీ నువ్వే ఓ సారి గోకుల్ స్థానం లో ఆలోచించు.తెలుస్తుంది! నేను ఫోన్ చేసి మాట్లాడుతున్ద్తే వాడెంత ఉద్వేగభరితంగా ఫీలయ్యాడు తెల్సా! ఆనందంతో ఏడ్చినంత పని చేసాడు.. అదీ ఆత్మీయ పలకరింపులు! అదే కొరవడింది మన జీవితాల్లో! కావాలి అలాంటి కళా కాంతులు తో నిండిన జీవితం. వద్దు! వద్దు! ఇలా యాంత్రిక జీవనం జీవితం వద్దు. వాట్సప్ వద్దని చెప్పను. వాడాల్సిన దానికన్నా ఎక్కువ గా మొబైల్ వాడుతున్నాము.! బానిసలం అయిపోతున్నాము ! తలొంచుకొని స్మార్ట్ ఫోన్ చూడడం కాదు. తలెత్తి జీవితాన్ని చూడండి...అభినందించండి... అభినందనలు అందుకోండి! సెల్ జీవితం కాదు. జీవితం లో ఓ భాగం అంటే కానీ. సెల్లె సర్వస్వం కాదు. కాకూడదు. టెక్నాలజీ ఉండాలి కానీ అది మాత్రమే జీవితం కాదు కాదు. కాకూడదు దానికి మనం బానిసలం. మనుషులతో జీవించండి పరికరాలను వాడుకోండి. ప్రేమించవలసిన మనుషులను వాడుకొని వాడుకోవలసిన పరికరాలతో జీవించకండి. ముందు ముందు జీవితం లో ఎన్నో అనుభూతులు, ఆనందాలు పంచుకొండి. అన్నిటికి కావాలి అనుభందాలు , అత్మేయతలు , పలకరింపులు అవి లేని నాడు మేరు ఎంత సంపాదించినా , మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మర మనిషి గా ఉండి పోతారు. అలా కాకుండా మనుసున్న మనిషిగా తలెత్తి జీవించండి... బతకండి...అనుభవించండి... రమణీయమైన ప్రకృతిని... ఆనందాలని... ఆస్వాదిస్తూ... వస్తాను బావా!” అంటూ బయల్దేరాడు కిష్టప్ప.

***

No comments:

Post a Comment

Pages