'నిజమైన సార్థకత!'
నేను నిజాన్ని
మేను దహనానికైనా 
సిద్ధపడతానేమో గానీ,
ధర్మాన్ని దగ్ధం కానివ్వను..!
నేను నిజాయితీని
కాలాన్ని శాసిస్తానుగానీ,
సత్యాన్నెన్నడూ వీడను..
నీతిని నీటి పాలు చేయను..!
నేను సంస్కారిని
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా కృషి చేస్తాను గానీ,
న్యాయం నోరు నొక్కి 
కుహనా పన్నాగాలు పన్నను..
నేను మనిషిని
నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటాను గానీ,
క్షణ భంగుర జీవితం కోసం 
మానవతా విలువలు మరచి
అమానుషంగా ప్రవర్తించను..!
ఎందుకంటే..
మానవ జీవితానికి
నిస్వార్థమే నిఖార్సయిన సార్థకత!!
***
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment