'తెలుగు తేజం!' - అచ్చంగా తెలుగు

 'తెలుగు తేజం!'

-సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.
విశ్వ విఖ్యాతిగా 
కులమతాలకతీతంగా
కోట్లాది గుండెల సవ్వడై
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన మువ్వన్నెల పతాక 
రూపశిల్పికి వందనం..
వినీలాకాశంలో విహంగమై విజయబావుటా ఎగరేసి
దశదిశలూ ప్రతిధ్వనించేలా
భరతజాతి సమైక్యతా గీతానికి కరతాళధ్వనుల గంటానాదం ..
పౌరుల పౌరుష ప్రతీక కాషాయం..
సన్మార్గ శాంతి చిహ్నం ధవళం..
ప్రకృతి మమైకభావ సంకేతం హరితం..
నిత్య శ్రమ నిదర్శనం ధర్మచక్రం..
స్ఫూర్తి దాయకం..
స్వాతంత్ర్య సమర వీరుల కీర్తి కిరీటం..
చూసినంతనె మనసున ఉప్పొంగే..
దేశభక్తి భావం..
పింకళి వెంకయ్య జన హృదయాంతరంగ 
తెలుగు తేజం....
భరతజాతి మకుటం.

****


 

No comments:

Post a Comment

Pages