శివం - 79 - అచ్చంగా తెలుగు
శివం - 79
రాజ‌ కార్తీక్




(హర సిద్దు తనకు లభించిన ధనంతో తన ఇంటికి వెళ్లి, తన తల్లిని పలకరించి.. ఇక మీద మనకి అన్ని మంచి రోజులే అని చెప్పాడు. బొజ్జ లింగం కుంభన్న , అక్కడ జరిగిన రాజ్యంలో ఘట్టాలు, ఇప్పుడు రాజు గారి ఆహ్వానం, ఏదీ తన తల్లికి చెప్పలేదు తనని ఆశ్చర్య పరుద్దామని...)

తన ప్రస్తుత రాజ్య పాలకుడు అయ్యన్న.. తనని రాచ మర్యాదతో అంతఃపురానికి పిలిపిస్తానని అనడంతో.. రాజ పరివారం కోసం చూస్తూ.. తను ఏమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు..

తన తల్లి దగ్గర.. ఎంతో ఆప్యాయంగా ఉండే.. తన కుటుంబానికి స్నేహితుని లాగా ఉండే.. వ్యక్తి తన ఇంటికి వచ్చి, హర సిద్ధుని తల్లిని పరామర్శించి.. హర సిద్ధుని సోదరుడిని కుశల ప్రశ్నలు వేసి, "ఏమి హర సిద్ద, ఏమి చేస్తున్నావ్ అని .. కొద్దిపాటి వెటకారంతో అడిగాడు".. అతగాడికి హర సిద్ధుడు బాధ్యత లేకుండా, నీతులు చెబుతూ.. ఎదుటి వాళ్ళకి.. జ్ఞానం ప్రసరించే.. పండితోత్తముడు, పురాణ పురుషుడు. కానీ తన ఇంటిని చక్కబెట్టుకో లేడు అని ఒక రకమైన వెక్కిరింపు.. అది హర సిద్ధుడి కూడా తెలుసు.. కానీ తన తల్లిని తన సోదరుడిని కనిపెట్టుకొని ఉంటాడని.. అతగాడిని మన హర సిద్దు, ఏమి అనడం లేదు. అతను కూడా హద్దుల్ని దాట లేదులే, దాటితే ఏమవుతుందో తెలుసు కదా,

హర సిద్దు "సోదరా నీవు మా కుటుంబం పైన చూపించే ఆదరణ నాకెంతో ఇష్టం.. నువ్వు నన్ను ఎంత వెక్కిరించినా నేను ఏమి అనుకోను లే.. నేను ఎక్కడున్నా మా అమ్మని తమ్ముని కనిపెట్టుకొని ఉండు.. నువ్వు నాకు మరొక సోదరుడివి, నా కోసం కాకపోయినా మన అమ్మ కోసం.. ఒక చిన్న సహాయం చెయ్"

హర సిద్ధుడు నవ్వుతూ అలా నిటారుగా మాట్లాడేసరికి అతగాడికి ఒక్క నిమిషం ఒళ్ళు జలదరించింది.. వాళ్ల దృష్టిలో హర సిద్దుకి దేవుడంటే ఎవరో తెలియదు, దేవుడి భక్తి లేదు, బ్రాహ్మణోత్తముడు అయ్యుండి.. ఇలా శిల్పాలు.. చెక్కుతూ.. పిడి వాదన చేస్తూ.. ముక్కు మొహం తెలియని వారికి సహాయం నేపంతో నిందలు మోస్తూ, అరజ్ఞానం, ఉన్న భగవంతునికి చాలా దూరంలో ఉండే అజ్ఞాని అని ప్రగాఢ విశ్వాసం.

అతగాడు "చెప్పు హరసిద్ధ నీకు ఏమి సహాయం చేయాలి అని" నిజమైన మనసుతో పలికాడు.

హర సిద్ధుడు తాను తెచ్చిన ధనం మూట విప్పి.." సోదర, నీవు వర్తకంలో ఆరితేరిన వాడివి, ఇది మా పెట్టుబడి గా ఉంచి, మా అమ్మకి నేను ఉన్నా లేకున్నా, ఏమి తక్కువ కాకుండా చూడు.. ఏమి చేస్తావో నీ ఇష్టం. నేను ఉన్నా లేకున్నా మా అమ్మ కి తోడు ఉంటావని, మా అమ్మ నన్ను పూర్తిగా అర్థం చేసుకునే దాకా.. ఇంకా నా పరిస్థితి మెరుగుపడే దాకా.. ఎప్పటిలాగా నా కుటుంబానికి కొద్ది ఆసరాగా నిలువమని, చేతిలో చేయి పెట్టి డబ్బుని బాధ్యతను  అందజేశాడు"
 " నీకంటు ఏం వద్దా, ఉన్న మొత్తం మీ అమ్మకు ఇస్తే పెళ్లి చేసుకోవా? " అడిగాడు అతగాడు..
హర సిద్ద "అన్నీ అవే జరుగుతాయి. కొన్ని మాసాల్లో అన్ని పరిస్థితులు అనుకూలంగా వస్తాయి లే. అప్పుడు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ చేద్దాం. ప్రస్తుతానికి చేతిలో ఉన్నది ఇదే,  కాబట్టి, దీనిని జాగ్రత్త చేసి ఇస్తే నా కుటుంబం కోసం పమికొస్తుంది. ఈ బాధ్యత నీదే సోదరా "అని భుజం తట్టాడు.

ఇప్పుడు హరసిద్ధుని తల్లికి కళ్ళలో నీళ్ళు తిరగసాగాయి.. ఇప్పుడొచ్చింది తనకు ఒక ఆలోచన.."హర సిద్ధుడు జమీందారీ బిడ్డ , తన తాత దగ్గర పెరిగి ఎంతో అపురూపంగా ఉన్నాడు, ఊహ తెలిసిన దగ్గర్నుంచి చేతనైన సహాయం చేశాడు కానీ ఎవరిని ఎప్పుడూ సహాయం అడగలేదు, తాము ఎంతో ఉన్నతమైన వారు.. కానీ నీ తన పూర్వీకుల దానధర్మాలకు ఆస్తులు అంతరించి పోవడం వల్ల.. తన కొడుకు జీవితంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల, వేరొకరి యొక్క ఒత్తిళ్ల వల్ల తన కొడుకు చేసిన క్రియల వల్ల, అందుకు జరిగిన జగడాల వల్ల, ఆ జగడాలలో  తన పూర్వీకుల ను తిట్టడం వల్ల , తనకోపం తారస్థాయికి పోయింది. అందరిని కోప్పడడం వల్ల, తాను ఇప్పుడు ఇలా ఈ పరిస్థితుల్లో ఉన్నాడు.

నీకోసం ఏమీ వద్దా అని మరొకసారి.. అతగాడు అడగడం వల్ల.. తన తల్లి మనసులో మరో ఆలోచన వచ్చింది..

హర సిద్ధుడు... తన తాత, నాయనమ్మ, చనిపోయిన తర్వాత. సాధారణంగా మారిన తర్వాత, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. ఏనాడు నీతి తప్పలేదు ధర్మం తప్పలేదు, తాను తర్ఫీదు పొందాలి అనుకున్నా, ప్రతిసారి అది మంచిది కాదు ఏమో అని... వేరొకరి చేత ఒత్తిడి తీసుకువచ్చి నిర్ణయాలు తీసుకునే విధంగా తాను చేసింది. తన తండ్రిగా భావించిన తన ఆచార్యుడు తనని దారుణంగా మోసం చేశాడు, తన ప్రవర్తన వల్ల తనకు చెప్పుకోలేక.... బాదపడ్డాడు‌. మాటల్లో మాటగా తన కొడుకును 'ఇది తన కొడుకు తీరు' అని తనే  పలచన చేసిన విషయం గుర్తు చేసుకుంది. ఏనాడు.. హర సిద్ధుడు, తన బతుకు తను బతికాడు గానీ.. ఎన్నడూ తనని ఏమీ అడగలేదు. కనీసం ఎన్నడూ తనని వంట చేసి పెట్టమని కూడా అడగలేదు.. అని గుర్తు చేసుకుంది.

హర సిద్ధుడు.. ఇప్పుడు తెచ్చిన ధనంతో.. తన జీవితం హాయిగా గడిచిపోతుంది అని మాత్రం తెలుసుకుంది.. ఇప్పుడు అర్థం చేసుకుంది.. తాను ఒకేసారి కొంత డబ్బును కూడగట్టి ఇక జీవితంలో ఎవరితో పని లేకుండా తన హాయిగా బతికేట్టు ఏర్పాటు చేద్దామని ఇంతకాలం తన డబ్బు తేలేక పోయాడు. తన దగ్గర కూడా ఉండి ఉండదులే అని జరిగిన పరిస్థితుల దృష్ట్యా, అర్థం చేసుకుంది తన తల్లి.. ఇప్పుడు అర్థం అవుతుంది  హరసిద్దుని గొప్పతనం.

భక్తులారా, నిజంగానే హరసిద్ధుడు ఎంతో గొప్పవాడు కదా ఎందుకో తెలుసా... తన తల్లిదండ్రుల్ని విపరీత కోరికలతో.. తమకు లేని దానిని చేయవలసిందిగా కోరుకోలేదు. మనము తల్లిదండ్రులను ఎంచుకోలేము కదా.. ఉన్న వారితోనే జీవితం ముందుకు తీసుకు వెళుతూ ఉండాలి.. అలా మీరు కూడా విపరీత కోరికలతో మీ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టవద్దు. వారికి చేతనైనది వారు కచ్చితంగా చేస్తారు అలా కాకపోతే నన్ను నమ్మండి నేను చేసి పెడతాను.
ఎందుకంటే ఏదైనా చివరిగా చేయాల్సింది నేనే కదా.

హరసిద్ధుని ఇల్లు ఉన్న వీధిలోకి కొంతమంది రాజభటులు రావడం మొదలుపెట్టారు. వారందరూ హర సిద్ధుని.. చిరునామా కోసం వెతకటం మొదలు పెట్టారు.. రాజభటులు ఏంటి హారసిద్దు కోసం రావడం ఏంటి అని చుట్టుపక్కల అందరూ గుసగుసలాడు కోసాగారు..
రాజభటుల ఆహార్యం లో ఎంతో వినమ్రత
 ఉంది .

హర సిద్ధుని ఇంటి దగ్గరికి భటులు వచ్చారు..

హర సిద్ధుని తల్లి.. ఇంటి బయటకు రాగా.. పత్రం ఒకటి తీసి చదువుతూ..
"గౌరవనీయులైన శ్రీ హార సిద్దు ని .. ఈ రాజ్య పాలకుడైన అయ్యన్న మాత్రులు.. రాజ గౌరవంతో.. రాజాంతఃపురంలోని రాజాస్థానానికి తీసుకురావాల్సిందిగా మమ్ము ఆజ్ఞాపించారు.. కావున హర సిద్ధ.. మీరు మా మీద దయ ఉంచి.. మాతో రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము"అని అభ్యర్థన చేశారు.

ఈ పరిణామంతో.. హర సిద్ధుని తల్లి, సోదరుడు, సోదర సమానుడు ఇరుగుపొరుగు ఉన్న వాళ్ళందరూ.. ఈ గౌరవ మర్యాదలు ఇతడికి ఏంటి చెప్పి ముక్కున వేలు వేసుకున్నారు.

హరసిద్ధుడు ఎప్పుడూ ప్రగల్బాలు పలకలేదు కానీ తనకు దొరికిన.. ఈ గౌరవం చూసి తన తల్లి ఎంతో ఆనంద పడుతుంది. అంతే కాకుండా తనను తక్కువ అంచనా వేసిన వారు తన స్థాయి తెలుసుకుంటారని అనుకున్నాడు అంతే.
హర సిద్ధుని మనసులో  కుంభన్న, అదే నేనే గుర్తుకు వస్తున్నాను.. మనసులో మాత్రం 'కుంభన్నస్వామి నిన్ను దేవుడు అనుకోవటం కన్నా అంతకుముందు స్నేహితుడని ఎలా భావించానో, అలా భావిస్తే చాలా దగ్గరి వాడిలా కనిపిస్తున్నావ్.. మరొకసారి మరి నాకోసం రావా అని, ఇట్లాగే మాట్లాడవా' అని మనసులో ప్రార్థించాడు...
 ఎదురుగాతానే చెక్కించిన చిన్న శిల్పంలో నా ప్రతి రూపం నుండి జారిపడిన పువ్వు సాక్షిగా తధాస్తు అని ఆశీర్వదించాను..

హర సిద్ధుని మొహం చూసి,  కొంతమంది సైనికులు కోపంతో రగిలిపోయారు.. అది ఎందుకో కూడా తర్వాత చెప్తాను..

హరసిద్ధుడు తన తల్లిని తనతోపాటు రాజ  మర్యాదతో తీసుకొని రావాల్సిందిగా రాచపరివారాన్ని అడిగాడు.. కానీ తన తల్లి దాన్ని తిరస్కరించి సున్నితంగా, 'నువ్వే వెళ్లు, నాయనా, వెళ్లి పనులు చక్క బెట్టుకుని రా. మిగతా ప్రపంచంలో నీలాంటి వాళ్ళు ఎలా ఉన్నారో, నువ్వు ఎలా ఉన్నావో అని ఆలోచించుకొని ఇకనైనా అన్ని రకాలుగా జీవితంలో అభివృద్ధి వైపు సాగు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూస్తే, అందరూ మనల్ని వాడుకొని మోసం చేసే వాళ్లే! నీ జీవితంలో ఎంతో సమయాన్ని నష్టపోయావు. ఇక  నయన నీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వు గాక..

ఎందుకు ఇవ్వను, హరిసిద్దు కు కాక ఇంక ఎవరికీ ఇస్తాను? నా ప్రతిరూపం ముందు కూర్చొని తపస్సు చేసి, చిత్రమైన వరాలు కోరుకున్న రాక్షసులకే, అవన్నీ ఇచ్చిన వాడిని నా ప్రతిరూపాన్ని చెక్కిన సిద్ధునికి ఎందుకు ఇవ్వను..

హర సిద్దు అంతఃపురం వైపు తన ప్రయాణం మొదలుపెట్టాడు..
హర సిద్ధుని అడుగు ఆగదు.. తాను సమయాన్ని కోల్పోలేదు. తన ఆచార్యుని గురువుగా భావించి శుశ్రూష చేశాడు. తన ఆచార్యుడు తనని మోసం చేసినా, అతని సేవ నాకు దక్కింది.. ఎందుకంటే జగద్గురువులకే గురువుని, నేనే కదా దక్షిణామూర్తిని.. నా ప్రియమైన హర సిద్ధుని కి దక్షిణ సమర్పించ కుండా ఎలా ఉంటాను?

(కొనసాగుతుంది)

No comments:

Post a Comment

Pages