ఇండియన్ నేవి (భారతీయ నౌకాదళము) - అచ్చంగా తెలుగు

ఇండియన్ నేవి (భారతీయ నౌకాదళము)

అంబడిపూడి శ్యామసుందర రావు  

 


ఇండియన్ నేవి ప్రపంచములోని నావికా దళాలలో ఐదవ పెద్దది.భారతీయులు సముద్రాన్ని వ్యాపారము కోసము, యుద్ధాలకు ఎన్నో ఏళ్లుగా వాడుతుఉండేవారు . సింధు నాగరికత కాలము లోనే (2300 బిసి) ఓడలకోసము డాక్ యార్డ్ నిర్మించుకున్నారు.  మౌర్యులు, శాతవాహనులు గుప్తులు పాండ్యులు, విజయనగర రాజులు, మొఘలులు, మరాఠాలు నావికా దళము శక్తిని వారి అవసరాలకు వాడుకున్నారు. మరాఠా చక్రవర్తి శివాజీ ని ఇండియన్ నేవి కి పితామహుడిగా పేర్కొంటారు. మన ఇండియన్ నేవీలో పనిచేసే వారి సంఖ్య79,083 మంది.కేరళ లోని ఎజ్హిమాల లో గల ఇండియన్ నావెల్ అకాడమీ ఆసియాలోనే పెద్ద ట్రైనింగ్ సెంటర్ భారతదేశము యొక్క మొట్ట మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నొక"INS విక్రాంత్."
      
గోవా విమోచన ఉద్యమములో మొదటిసారిగా ఇండియన్ నేవి పోర్చుగీస్ కు వ్యతిరేకము గా 1961 లో తన మొదటి ఆపరేషన్ ను చేసింది.1971 ఇండో పాకిస్తాన్ యుద్దములో ఇండియన్ నేవి పెద్ద అలజడిని సృష్టించింది. డిశంబర్ 4 వ తేదీన ఇండియన్ నేవి ఆపరేషన్ ట్రైడెంట్ ను ప్రారంభించి కరాచీలోని పాకిస్తాన్ నేవల్ హెడ్ క్వార్దర్స్ పై దాడి చేసి పాకిస్తాన్ మైన్ (మందు పాతర్ల) స్వీపర్స్  అలాగే ఆయుధాల ను సరఫరా చేసే నౌకను ద్వంసము చేశారు.ఈ దాడిలో కరాచీ పోర్ట్ లోని స్టోరేజ్  ట్యాంకులను  ధ్వంసము చేశారు అందుచేతనే ఆ రోజును నేవి డే గా జరుపుకుంటారు  1971 ఇండో పాక్ యుద్దాన్ని బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటముగా పేర్కొంటారు.అంతకు మునుపు జరిగిన 1965 యుద్దములో నేవి పాత్ర భారతీయ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించటమే ఆపరేషన్ ట్రైడెంట్ లో కిల్లర్ స్క్వాడ్రన్ కు చెందిన మూడు మిస్సైల్ బోట్స్ కరాచీ పోర్టు పై దాడి చేసి పాకిస్తాన్ సప్లై రూట్ ను అడ్డుకున్నాయి. ఆ మూడు మిస్సైల్ బోట్స్ INS నిపట్ ,INS నిర్ఘాట్,INS వీర్ ఈ బోట్ల లోని సిబ్బంది రష్యన్ భాషలో మాట్లాడుతూ పాకిస్తానీ వారిని తప్పుదారి పట్టించి ఆ బొట్లు రష్యన్ బొట్లు అని భ్రమింపచేశారు  దీని తరువాత డిశంబర్ 8, 1971న  ఆపరేషన్ పైథాన్ మొదలయింది
అమెరికా ,ఇటలీ నేవి ల తరువాత ప్రపంచములో ఒకటి కన్నా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కలిగి ఉన్న నేవి ఇండియన్ నేవి ఒక్కటే మన ఇండియన్ నేవీకి ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు INS విక్రాంత్  మరియు INS విక్రమాదిత్య.ఇండియన్ నేవి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి అభివృద్ధి చేసిన స్పెషల్ కమాండో ఫోర్స్ పేరు "మార్కోస్". రికోన్, డైరెక్ట్ యాక్షన్, రెస్క్యూ మిషన్స్ లు మార్కోస్ ప్రత్యేకతలు.ఈ ఫోర్స్ దేశములో చాలా బెస్ట్ ఫోర్స్ అమెరికన్ నావెల్ ఫోర్స్ తో ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో ఇండియన్  నేవి పంపిన ఒక ఇండియన్ మార్కో ,అమెరికన్ నేవి సీల్ కోర్స్ ను అమెరికన్ల కన్నా చాలా సులభముగా నేర్చుకున్నారు.మార్కోస్ అంటే కాశ్మీరీ ఉగ్రవాదులకు భయము వాళ్ళు మార్కోస్ లను "దాడివాలా పౌజి" అంటారు ఎందుకంటే వీళ్లకు గడ్డాలు ఉంటాయి మార్కోస్ లో అందరు పారా జంప్ లో క్వాలిఫై అయినవాళ్లే కొంతమంది HALO/HAHO పారా  జంప్ లో శిక్షణ పొందుతారు అంటే హై  అల్టిట్యూడ్, లో ఓపెనింగ్ మరియు హై అల్టిట్యూడ్ హై ఓపెనింగ్ ల లో శిక్షణ పొందుతారు. మార్కోస్ అనే వాళ్ళు ప్రపంచములోని స్పెషల్ ఫోర్స్ వీళ్ళు సముద్రలోకి ఆయుధాలతో పారా జంపింగ్ చేస్తారు.

ప్రాజక్ట్ 15B పధకంలో నాలుగు నౌకల నిర్మాణము జరిగింది అవి INS విశాఖపట్నం,INS పరాదీప్,INS మార్మగోవా అనే రెండు ఫాలో ఆన్ ఇవి  నౌకలు, ఇవి 2020 మరియు 2022లో కమిషన్ అవుతాయి 2024 లో కమిషన్ అవ్వాల్సిన నౌక కు ఇంకా పేరు పెట్టలేదు.ఇజ్రాయిల్ ఇండియా సంయుక్తముగా తయారుచేసిన బారక్ 8 మిస్సైల్స్ (ఉపరితలం నుండి ఆకాశానికి ప్రయోగించే) ను ఇండియన్ నేవి నౌకలు ఉపయోగిస్తాయి భారత దేశము భవిష్యత్తులో 28 సబ్ మెరైన్లను రంగములోకి దింపుతోంది.వీటివలన భారతదేశము ఇండియన్ ఓషన్ ప్రాంతములో బలమైన సబ్ మెరైన్ ఫోర్స్ కలిగిన దేశముగా ఉంటుంది మొదటిసారిగా అమెరికా ఇండియన్ నేవి కోసము ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తయారీలో సహకరిస్తుంది. రాబోయే 10 ఏళ్లలో సంవత్సరానికి ఐదు షిప్స్ చొప్పున ఇండియన్ నేవి సంపాదించుకుంటుంది ఆవిధముగా 2027 నాటికి 150 షిప్స్, 500 ఎయిర్ క్రాఫ్ట్స్ సమకూర  గలవు.     

26/11న  ముంబై పై ఉగ్రవాదుల దాడి తరువాత మార్చ్ 2009 లో ద సాగర్ ప్రహరీ బల్ (SPB) ని ఏర్పాటు చేశారు ఇండియన్ నేవి యొక్క ఈ యూనిట్ భారదేశము యొక్క తీరప్రాంతాల గస్తీ నిర్వహిస్తూ ఉంటుంది. ప్రపంచములో రెండే రెండు ఏరోబాటిక్ టీమ్ లు ఉన్నాయి అందులోమన దేశానికి చెందిన సాగర్ పవన్ టీమ్ ఒకటి ఇండియన్ నేవి విజయవంతముగా నార్త్ పోల్ సౌత్ పోల్ సాహస యాత్రల ను పూర్తిచేసింది.     

INS అరిహంత్(6000 టన్నుల బరువు) మొదటి పూర్తి స్వదేశీయ విజ్ఞానముతో తయారుచేసిన న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ షబ్ మెరైన్(జలాంతర్గామి) .కలాం 4 ప్రవేశ పెట్టటంతో సబ్ మెరైన్ లాంచెడ్ బ్యాలిస్టిక్ మిస్సైల్(SLBM)ను INS అరిహంత్ పై ఏర్పాటు చేయటము వలన భారత దేశానికి న్యూక్లియర్ పాటవం పూర్తిగా ఏర్పడింది.ఇండియా కు మొదటి సూపర్ క్యారియర్ INS విశాల్ 2025 నాటికి వస్తుంది.  

ఎప్పుడైనా యుద్ధము సంభవిస్తే ఇండియన్ నేవి కరాచీ పోర్ట్ ను ముట్టడి చేసి దారిని అడ్డగిస్తే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ గుండా 14 గంటలలో ఆఫ్ఘనిస్తాన్ చేరుకోగలడు అని సైనిక విశ్లేషకుల అభిప్రాయము.
  
ఇండియన్ నేవి యుద్దములో కోల్పోయింది ఒకే ఒక నౌకను దాని పేరు INS కుక్రి దానిని 1971 యుద్దములో కోల్పోయారు. ఆ నౌక క్యాప్టెన్ ఎమ్ ఎన్ ముల్ల. అయన తన సిబ్బందిని నౌకను ఖాళి చేయమని చెప్పి కుక్రి నౌకతో సముద్రపు లోపలికి  వెళ్ళిపోయాడు.అంటే షిప్ ను సముద్రములో ముంచేశాడు దురదృష్టవశాత్తు ఇప్పటివరకు ఇండియన్ నేవీలో ఏ ఆఫీసర్ కు అత్యున్నత పురస్కారం పరమ వీర్ చక్ర లభించలేదు ఇండియన్ నేవీలో మూడు కమాండ్స్ ఉన్నాయి అవి విశాఖపట్నము లోని ఈస్టర్న్ కమాండ్, ముంబై లోని వెస్ట్రన్ కమాండ్, కొచ్చిన్ లోని సదరన్ కమాండ్ ప్రతి కమాండ్ కు ఒక ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ నాయకుడిగా ఉంటారు.ఇండియన్ నేవి సోమాలి పైరేట్స్ (సముద్రపు దొంగలను) అడ్డగించి వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణాలకు సహకరిస్తుంది.ఇవండీ ఎంతో ఘనత  ఉన్న ఇండియన్ నేవి యొక్క విశేషాలు. 

***            

No comments:

Post a Comment

Pages