తెలుగు పునర్వైభవం!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
అమ్మభాష పునర్వైభవమా?
అమ్మ పునర్వైభవమన్నంత విడ్డూరంగా ఉంది
అవునులే! అమ్మల్నే అనాధశరణాలయాల పాలు
చేసిన మనకు
అమ్మభాషను కాంతి కోల్పోయిన వజ్రం చేయడం
ఎంతపని?
అమ్మ లేకపోతే జగతికి జననమేది? 
అమ్మభాషలేకపోతే
మానవులకు మనుగడేది?
అసలు..మాతృభాష లేకుంటే
ఒడి నుంచి బడిదాకా ప్రథమ గురువేది?
అమ్మభాషలోని పదాల ఉచ్చారణతో
నోటిలోని లాలాజలం గంగాజలమవుతుంది
బుద్ధిని పాదరసం చేసి
పరుగులెట్టిస్తుంది
అమ్మ విలువ..అమ్మభాష గొప్పతనం !
నేటికైనా తెలుసుకుంటే
మాతృభాష పునర్వైభవానికి నాంది పలికినట్టవుతుంది!
మనలను మనం సంస్కరించుకున్నట్టవుతుంది!!
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment