అజ్ఞాని ప్రార్ధన!?
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
ఓ దైవమా!
నీకొండంత దయని అకారణంగానే 
నాపై నిరాటంకంగా కురిపించు.
నీఅండతో కలిగే అనంతమైన ధైర్యాన్ని 
నాలో నిరంతరం మెరిపించు.
అకారణంగా నన్ను ద్వేషించేవారిని చూసి 
నన్నునవ్వించు.
నీబిడ్డలా నన్ను బోలెడన్ని కారణాలతో లాలించు
నీభక్తునిగా నన్ను అనవరతం పాలించు.
కఠినశిలను చూసినాకూడా నాలోకరుణను కలిగించు
కఠినాత్మునిపైన కూడా నాలోకలిగే కోపాన్ని తొలగించు.
సందేహాలతో సతమతమయ్యే నామనసును 
సుస్పష్టమైన సమాధానాలతో మురిపించు.
యదార్దాలను గ్రహించే శక్తిని 
నా హృదయానికి ప్రసాదించు.
నిన్నని మరిచి, రేపును విడిచి, 
నేటిలో జీవించే జ్ఞానాన్ని నాపై ప్రయోగించు.
ఉన్నదానిని వదిలి లేని దానికొరకు పరితపించే 
అజ్ఞానాన్ని పవిత్రీకరించు.
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment