లగ్నం యోగించే దశలు
ఒకొక్క లగ్నానికి కొన్ని గ్రహ దశలు విశేషం గా యోగిస్తాయి. ఆ యోగించే దశల పట్టిక ఇక్కడ ఇవ్వటం జరిగింది. కాని ఒక వ్యక్తి జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు ఆ గ్రహం ఉన్న స్తానం కూడా పరిశీలించాలి. కొన్ని యోగించని గ్రహ దశలు ఆ స్థాన బలంవలన కూడా విశేషం గా యోగిస్తాయి.
ఇక్కడ పట్టిక లో అనుకూల దశ, ప్రతికూల దశ మారక దశలు అనగా ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ చక్రం లో ఉన్న స్థానలని బట్టి ఫలితాలని చెప్పాలి. మారకం అనగా ఆ గ్రహ దశ లో గాని అంతర్దశ లో గాని మారకం రావచ్చు (ఈ మారక గ్రహాలను బట్టి మరణం నిర్ణయించరాదు, వాటికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అవి మున్ముందు పాఠాలలో తెలుసుకుందాం. మారక దశలలో అనారోగ్యాలు, అనవసర ఖర్చులు లాంటివి కూడా సూచిస్తారు.).
| లగ్నం | అనుకూల దశ | ప్రతికూల దశ | మారక దశ | 
| మేషం | రవి గురు | బుధ శుక్ర శని | శుక్ర | 
| వ్రుషభం | శని బుధ రవి | గురు శుక్ర చంద్ర | కుజ గురు | 
| మిథునం | శుక్ర | కుజ గురు రవి | చంద్ర | 
| కర్కాటకం | కుజ గురు చంద్ర | బుధ శుక్ర శని | శని | 
| సింహ | కుజ గురు రవి | బుధ శుక్ర శని | శని | 
| కన్య | శుక్ర బుధ | చంద్ర కుజ, గురు | కుజ | 
| తుల | చంద్ర, బుధ, శని | రవి,కుజ, గురు | కుజ   | 
| వ్రుశ్చికం | రవి, చంద్ర, గురు | శని, బుధ, శుక్ర | శుక్ర | 
| ధనస్సు | రవి, బుధ, కుజ | శుక్ర | శని | 
| మకరం | శుక్ర, బుధ | గురుడు, శని, కుజ | శని, కుజ   | 
| కుంభం | శుక్ర | గురు, చంద్ర, కుజ | రవి గురు | 
| మీనం | కుజ చంద్ర, గురు | శని, శుక్ర, బుధ, రవి | కుజ | 
ఈ కింద నియమాలని అనుసరించి ఏ దశ ఏ లగ్నానికి యోగిస్తుందో తెలుసుకోవచ్చు.
·      
నైసర్గిక శుభులు (సహజ శుభులు - శుక్రుడు, గురుడు, బుధుడు, పూర్ణ చంద్రుడు)
3,6,8,12స్థానలకు ఆధిపత్యం వహిస్తే ఆధిపత్య 
పాపులు అవుతారు
·      
నైసర్గిక శుభులకు కేంద్రాదిపత్యం వచ్చిన పాపులు
·      
నైసర్గిక పాపులు (సహజ పాపులు రవి, కుజ, శని, రాహు, కేతు, క్షీణ చంద్రుడు)  శుభ స్థానాలకు (1,4,5,9,10)ఆధిపత్యం వహించిన ఆధిపత్య
శుభులు అవుతారు
·      
ఏ లగ్నానికైనను కేంద్ర కోణాదిపతులు శుభులు 
·      
2, 12 స్థానలకు వేరే స్థానాలకు ఆధిపత్యం వహించిన
ఆ స్థాన ఆధిపత్యం బట్టి శుభత్వం పాపత్వం తెలుసుకోవాలి
·      
11 స్థానానికి ఆదిపత్యం వహించిన గ్రహాలు పాపులు
·      
మారక స్థానలకు (2,7) ఆధిపత్యం వహించిన గ్రహాలు పాపు గ్రహాలు
·      
చంద్రుడుకి అష్టమ దోషం లేదు
·      
తులా లగ్నానికి చంద్రుడు శుభుడు
·      
మకర లగ్నానికి చంద్రుడు సప్థమాదిపతి, మారక స్థాననికి ఆధిపత్యం వహించినందున
చంద్రుడు మకర లగ్న జాతకులకు పాపి
· మేష లగ్నానికి చంద్రుడు శుభుడు
గ్రహ దశలు ఫలితాలు
ఏ దశ
యోగిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఆ దశ యోగించక పోతే ఏ ఫలితాలను ఇస్తాడో చూద్దాం
(ఈ ఫలితాలను జాతక చక్రం పరిశీలన చేసేటప్పుడు ఆ గ్రహం ఉన్న స్తానాలని బట్టి తెలుసుకోవాలి.
ఒకో సరి ఆ లగ్నానికి పాప గ్రహం గా చెప్పబడిన గ్రహం, ఆ స్థాన ప్రభావం చేత శుభ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి పరిశీలన చేసెటప్పుడు జాగ్రత్త అవసరం). 
రవి మహా దశ :
అనుకూలం: ఆరోగ్యం, వాహన
లాభం, భూ లభం, ధనం, సంతాన అభివ్రుద్ది, మంచి బుద్ది, కీర్తి, ఉన్నత ఉద్యోగం  ఇలా రవి గ్రహం ఉండే స్థానలని బట్టి తెలుసుకోవాలి
ప్రతికూలం: ధన నష్టం,అధిక శ్రమ,
అనారోగ్యం, అధికారుల వలన భయం, పిత్రు వియోగం, మనో క్లేశం, గౄహ సమస్యలు,
అపమ్రుత్యు భయం.
చంద్ర మహా దశ :
అనుకూలం: ధన లాభం, మనశ్శాంతి,
సోదరుల వలన లాభం, వాహన సౌఖ్యం, పుణ్య కార్యక్రమాలు,
గౄహ నిర్మాణం, కీర్తి, కళ్యాణ్యం, విద్య ప్రాప్తి, వ్యాపారం లో లాభాలు
ప్రతికూలం:
ధన నష్టం,
అనారోగ్యం, మనశ్శాంతి లేక పోవుట, శత్రు పీడ, అధికారుల వలన భయం, అకాల భోజనం, కార్య విగ్నాలు
కుజ మహా దశ :
అనుకూలం: లక్ష్మీ కటాక్షం,
సంతోషం, గౄహ యోగం, కీర్తి, రాజ సన్మానం, పదోన్నతి, స్త్రీమూలక లాభాలు, పుణ్య నదీ
స్నానం, క్రుషికి తగ్గ ఫలితం, వాహన సౌక్యం, వ్యాపార లాభం, 
ప్రతికూలం: భూ నష్టం, ప్రమాదాలు,
భార్య పుత్రులకు కష్టాలు, ఉద్యోగ నష్టం, అధికారుల వలన భయం, కుటుంబ సమస్యలు, స్త్రీ
మూల కలహాలు 
రాహు మహా దశ :
రాహు
మహా దశ పరిశీలన చేసే టప్పుడు, రాహువు ఏ రాశి  లో ఉన్నాడు, లగ్నానికి ఆ రాశి ఏ స్తానం అయ్యీంది,
ఏ గ్రహం తో ఉన్నాడు, రాశ్యాదిపతి ఎవరు అని మున్నగు విషయాలు చూసి ఫలితాలు చెప్పవలెను.
అనుకూలం: అధికారం, పదోన్నతి, విదేశీ యానం, అధిక ధన లాభం, శత్రు నాశనం, గౄహ నిర్మానం, వ్యాపారం లో విజయం, భోజన సౌక్యం, శయన సౌక్యం
ప్రతికూలం: ఉద్యోగం లో ఆటంకాలు,
అధిక ఖర్చులు, అనారోగ్యం, కారాగార నివాసం, కోర్టూ చిక్కులు, కుటుంబ సమస్యలు, మరణ వార్తలు,
అనవసర కలహాలు, మనశ్శాంతి లేకపోవుట, అధికారుల తో విభేదాలు, అధికారుల చే మాటలు పడుట,
గురు మహా దశ :
అనుకూలం: అధికారం, పుణ్య
క్షేత్ర సందర్శన, వాహన యోగం, సంతానం, దాంపత్య సుఖం, గౌరవ మన్ననలు పొందుట, వ్యాపార అభివ్రుద్ది
ప్రతికూలం: అధికారుల వలన భయం,
ఉద్యోగం లో చిక్కులు, స్థాన చలనం, ధన నష్టం, కుటుంబ కలహాలు, కుటుంబ విరోధం
శని మహా దశ :
అనుకూలం: ఉద్యోగం లో అభివ్రుద్ది,
పదోన్నతి, ధన లాభం, విదేశి యానం, గౄహ యోగం, కీర్తి ప్రతిష్టలు సాదించుట
ప్రతికూలం:
ధన నష్టం,
ఉద్యోగ సమస్యలు చిక్కులు, వ్యాపార నష్టం,
గౄహ నాశనం, కార్య హాని
బుధ మహా దశ :
అనుకూలం: గ్రంద పఠనం, సాహిత్య
రచనాశక్తి, ఉన్నత విద్య, ధన లభం, దాంపత్య సుఖం, పరిశోధనాసక్తి, శాస్త్ర విజ్ఞానం
ప్రతికూలం: చెడు బుద్ది, వ్యాపార నష్టం, విద్యా
భంగం, అనారోగ్యం, శస్త్ర చికిత్స, ద్రవ్య నష్టం, గౌరవ హాని, నిరుద్యోగం.
కేతు మహా దశ :
అనుకూలం: ధన లాభం, మంచి
బుద్ది, ఆధ్యాత్మిక చింతన,
అధికారుల అనుగ్రహం, దూర ప్రయాణం, దేవాలయ దర్శనం
ప్రతికూలం: ఉద్యోగం లో ఆటంకాలు,
అధికార నష్టం, కుటుంబ సభ్యుల కు అనారోగ్యం, వ్యాపార ధన నష్టం, అప కీర్తి, ఇష్టం లేని
చోటికి స్థాన చలనం, కార్య భంగం
శుక్ర మహా దశ :
అనుకూలం: లలిత కళల యందు
ఆసక్తి, ప్రావీణ్యత, ఆభరణాల సౌఖ్యం, వాహన సౌఖ్యం, దాంపత్య సౌఖ్యం, కళత్ర సౌఖ్యం, ఉన్నత
పదవి, అధికారుల ఆదరణ, గురు భక్తి, విలాసవంతమైన జీవితం.
ప్రతికూలం: చోర భీతి, ధన నష్టం,
కళత్ర వియోగం, అనారోగ్యాలు, ఉద్యోగం లో చిక్కులు, ౠణ పీడ. 
భావాదిపతులు దశలు
భావాదిపతులు ఆ స్థానలను బట్టి ఫలితాలు ఇస్తారు. కాని ఆ అధిపతులు శుభ స్థానాలలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయా దశలు వచ్చినప్పుడు జాతకుని వయసుని ద్రుష్టి లో పెట్టుకుని ఫలితములు చెప్పాలి.
లగ్నాధిపతి దశ బహు ధనం ఇచ్చును
ద్వితీయధిపతి
దశ ధన లాభం కలిగించును, అపమౄత్యు
దోషం ఇచ్చును
త్రుతీయాదిపతి
దశ కార్య జయం కలిగించును
చతుర్దాదిపతి
దశ మాత్రు సౌఖ్యం,మాత్రు మూలక ధనం, విద్య ఇచ్చును
పంచమాదిపతి
దశ ఉన్నత విద్య, సంతాన ప్రాప్తి
షష్టమాదిపతి
దశ ఆ స్థానాన్ని బట్టి శత్రు బాధలు తెలుపును
సప్తమాధి
పతి దశ వివాహ యోగం ఇచ్చును. శోకం కలిగించును. 
అష్టమాదిపతి
దశ: మౄత్యు భయం కలిగించును
నవమాధిపతి
దశ: ధార్మిక విషయముల యందు ఆసక్తి ని పెంచును
దశమాధి
పతి లేక రాజ్యాధిపతి దశ - ఉద్యోగం ఇచ్చును
ఏకాదశ
అధిపతి దశ - లాభం ఇచ్చును
ద్వాదశాది
పతి దశ - ద్రవ్య నష్టం, అనారోగ్యం, కష్టములు ఇచ్చును.  
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment