శ్రీధరమాధురి - 85 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 85

Share This

 శ్రీధరమాధురి - 85 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )





మిమ్మల్ని చూసేందుకు వచ్చినప్పుడు బాగా తయారయ్యే రావాలని ఎవరో అన్నారని నాకు ఎవరో చెప్పారు. చాలా హాస్యాస్పదమైన విషయం. మీరు గర్వం అహంకారం అనే ముసుగులను తీసేసి పవిత్రమైన అంతఃకరణంతో, ఒక గురువు ముందుకు రావాలి. మీరు ధరించే దుస్తుల పట్ల, మీరు కనిపించే తీరు పట్ల, మీ వయస్సు, లింగ భేదాలు, మీకు చెందిన సంఘం లేక జాతి పట్ల గురువుకు ఎటువంటి ఆసక్తి ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక చిరునామా ఉంటుంది. కానీ అసలైన చిరునామా ఏమిటో ఆయనకు తెలుసు. మీ చిరునామాను మీ గర్వం, అహంకారం, అసూయ, స్వార్థం, విభేదాలు, ద్వేషం, పక్షపాతం వంటి వాటికి అతీతంగా ఉండనివ్వండి. ఈ జాబితాకి అంతం అనేదే లేదు.    

నిర్వాణం శూన వాహనం - హృదయం నిండా విశ్వాసం నిండిన స్వచ్ఛమైన మనసుతో రండి. ఇదే కీలకమైనది. ఒక కుక్క తన యజమాని వద్దకు ఇలాగే వస్తుంది. మీరూ ఇలా రాగలిగితే భైరవ దేవుడు మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటారు. అప్పుడు గురువుతో ఆనందంగా గడపదగ్గ సమయం ఆసన్నమవుతుంది.

***

రుద్ర స్వరూపం లో ఉండే దేవుడిని మూడు ముఖ్యమైన స్వరూపాలుగా విభజించారు. భోగ, యోగి, వీగ.

భోగ అంటే సోమ స్కందార్, కల్యాణ సుందరార్ వంటివారు.

యోగ అంటే దక్షిణామూర్తి, వృషభ ఆరూఢ మూర్తి, జ్ఞాన దేశికార్ వంటివారు. 

వీగ అంటే భైరవ, వీరభద్ర, శరభ వంటివారు.

రుద్రుడికి ఘోర స్వరూపం కూడా ఉందనే అపోహ ఉంది. రుద్రుడు భోగ, యోగ, వీగ స్వరూపాలలో ఏ విధంగా ఉన్నా కూడా, అది ఎల్లప్పుడూ అఘోర రూపమే. ప్రతి రూపానికీ తనదైన అందం ఉంది. అందుకే ఆయన్ను అఘోర మూర్తి అంటారు. నిజానికి అత్యంత సుందరమైన అఘోర మూర్తిని మనం తిరువెంకడు(తమిళనాడు కు 300 కి.మీ దూరంలో, సిర్కజి, పుంపుహార్ మధ్య మార్గంలో) లో చూడగలం.  దైవానిది కేవలం అఘోర స్వరూపం. వేదాలలో కూడా కేవలం అఘోర స్వరూపాన్ని గురించిన ప్రస్తావన ఉంది. ఘోర స్వరూపాన్ని గురించి లేదు. వేదాలలో రుద్రుడిని పంచ రుద్రులుగా విభజించారు. వామదేవ, అఘోర, త్రయంబక తత్పురుష, ఈశాన. ఘోర స్వరూపం గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. దైవం యొక్క మార్గాలు విలక్షణమైనవి. ఆయనే సర్వస్వం, కనుక ప్రతి రూపంలో ఆయన యొక్క సౌందర్యాన్ని మనం చూడవచ్చు. ‘లయము’ అనేది ఎక్కువగా చెడుకు ప్రతికూలతకు సంబంధించింది. జీవాత్మ తానే కర్తనని భావించిన విషయంలో, ఇది మరింత  ఎక్కువగా వర్తిస్తుంది. అందుకే ఇటువంటి స్వరూపాల్ని ‘ఘోర’ గా విభజించడం అనేది మనలో ఉన్న అజ్ఞానాన్ని చూపిస్తుంది. నిజానికి ఇది మన పిరికి తత్వాన్ని చూపిస్తుంది, అది ఒకరకంగా అహానికి మరో రూపమే. దైవం అన్ని తర్కాలకు అతీతమైన వారు. అయిన మార్గాలు గుహ్యమైనవి. మానవ విశ్లేషణకు, విమర్శకు అందనివి. అందుకే తగిన విధంగా నడుచుకోండి దైవాన్ని కొనియాడండి అఘోర స్వరూపాన్ని కొనియాడండి.

***


No comments:

Post a Comment

Pages