నా నువ్వు - అచ్చంగా తెలుగు
నా నువ్వు
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు





వెతికిన చోట నువ్వు,వెతుకని చోట నువ్వు
గదిలో నువ్వు, మదిలో నువ్వు
మృదువుగా నువ్వు, మధువులానువ్వు, 
వలపులో నువ్వు,తీయని పిలుపులో నువ్వు,
ఒక మలుపుగా నువ్వు,నా గెలుపులో నువ్వు,
మాయని తలపులో నువ్వు.
నా కొలుపులో నువ్వు,నా అలుపులో నువ్వు.
కలలో నువ్వు, ఇలలో నువ్వు,
కలగా నువ్వు,ఇలగా నువ్వు,ఇలవేల్పుగా నువ్వు.  
నవ్యంగా నువ్వు, దివ్యంగా నువ్వు,
భవ్యంగా నువ్వు,అనన్యంగా నువ్వు.
నా రాగంలో నువ్వు, నా గానంలోను నువ్వు, 
నా మౌనంలోను నువ్వు, నా ప్రాణంగా నువ్వు,
అనురాగంగా నువ్వు.
నీ సంయోగంలో నువ్వు, నీ వియోగంలోను నువ్వు
నాలో భాగంగా నువ్వు,నా యోగంగా నువ్వు,
నా భాగ్యంగా నువ్వు,నా ఆరోగ్యంగా నువ్వు.
మనంలో నువ్వు,జనంలో నువ్వు,
మధువనంలో నువ్వు,మృదుమధురంగా నువ్వు.
ప్రతి క్షణంలో నువ్వు, ప్రతి కణంలో నువ్వు.
అలకలో నువ్వు,ప్రతి పలుకులో నువ్వు.
అధరంపై నువ్వు,నా ఆధారమై నువ్వు.
అందంగా నువ్వు, నా ఆనందంగా నువ్వు, 
నా అనుబంధంగా నువ్వు,
వేదనలో నువ్వు ,నావాదనలో నువ్వు,
నా సాధనలో నువ్వు,ఒక శోధనగా నువ్వు,
బోధనగా నువ్వు,పరిశోధనగా నువ్వు.
మరపులో నువ్వు,నా వెరపులో నువ్వు. 
శూన్యంలో నువ్వు, పరిపూర్ణంలో నువ్వు.
నవ వధువులా నువ్వు.
అర విరిసిన నీ నవ్వు.
  ***

No comments:

Post a Comment

Pages