తెలుగే మన వెలుగు - అచ్చంగా తెలుగు

తెలుగే మన వెలుగు

Share This
'తెలుగే మన వెలుగు!'
-సుజాత.పి.వి.ఎల్
పోతన కలం నుండి
సుమ సౌరభ పరిళాలు
వెదజల్లిన భాష..
సిరులు పొంగు భరతభూమి
పసిడి కాంతులు విరజిమ్ముతూ
దశదిశలా ఖ్యాతిగాంచిన అమృతభాష..
గిడుగు వారి వ్యవహారిక రీతిలో వ్యాప్తి చెంది..
తెలుగుదనం విలువ పంచిన అమ్మభాష..
అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య పదకృతులై
అమృతాన్ని కురిపించే
తేనెలూరు తెలుగు భాష..
విశ్వనాథ వారి వినసొంపు రచనలు
కృష్ణశాస్త్రి గారి కవితాకుసుమాలు
నండూరి వారి ఎంకి సొంపు సొబగులను 
పొదువుకున్నది నా మాతృభాష..
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తెలుగు..
ఘంటసాల, బాలమురళీ కృష్ణ, 
బాలు గారి కంఠస్వర మాధుర్యం తెలుగు..
విశ్వవిఖ్యాతి తెలుగు..
తెలుగే మన వెలుగు.!!
***

No comments:

Post a Comment

Pages