అతని ఇష్టాలు, కష్టాలు - అచ్చంగా తెలుగు
అతని ఇష్టాలు,కష్టాలు
భమిడిపాటి స్వరాజ్య నాగ రాజారావు 
ద్వేషించటం కష్టం,ప్రేమించటం ఇష్టం,
కవ్వించటం కష్టం,కరుణించటం ఇష్టం,
శపించటం కష్టం,దీవించటం ఇష్టం,
తీసుకోవటం కష్టం,ఇవ్వటం ఇష్టం,
అవమానించటం కష్టం,అభిమానించటం ఇష్టం,
అతనికి...

ఒదగటం,అలా ఎదగటం ఇష్టం,
దీవించటం,అలా జీవించటం ఇష్టం,
పంచటం,మంచినిపెంచటం ఇష్టం,
నమ్మటం,మనసును అమ్మటం ఇష్టం, 
కీర్తించటం,కీర్తిస్తూనే నర్తించటం ఇష్టం,
అతనికి...

No comments:

Post a Comment

Pages