అమ్మ చిరునామా, వీలునామా - అచ్చంగా తెలుగు

 అమ్మ చిరునామా, వీలునామా

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
చిన్నప్పుడు అతని కూతురని 

మధ్యలో ఇతని భార్య అని 

చివరిలో ఫలానా వారి తల్లి అనిపించుకోవటమే తప్ప

అమ్మకంటూ సొంత చిరునామా లేదా?

అమ్మకంటూ రాయబడిన వీలునామా లేదా?


ఉన్నాయి!

అమ్మకొరకు రాయబడిన వీలునామాలో

అమ్మ ఎక్కడున్నా అమ్మకి చెందేవి,అమ్మ పొందేవి 

రెండు ఉన్నాయి.

ఒకటి శ్రమ,రెండు భ్రమ.

అమ్మ చిరునామా మాత్రం కేవలం ప్రేమే!


అవును, ప్రేమ అన్న పదం అమ్మని విడిచి ఉండలేదు,

ఆ పరమపథం అమ్మలో తప్ప ఇంకెక్కడా నిండలేదు.

అమ్మ నీడలో నిబిడీకృతమై ఉండేది,

అమ్మ జాడలో సుకృతమై నిండేది,

అమ్మ మాటలో నిలిచేది,

అమ్మ మనసులో పొంగి పొరలేది ప్రేమ మాత్రమే.

ఆ ప్రేమకు చిరునామా అమ్మ మాత్రమే!

***   

No comments:

Post a Comment

Pages