దుర్గా సప్త శతి - అచ్చంగా తెలుగు

దుర్గా సప్తశతి 

-సుజాత.పి.వి.ఎల్.



దుర్గా సప్త శతి కర్మ, భక్తి, జ్ఞానముల త్రివేణి సంగమం. దుర్గాదేవి కృపను విశదపరుచు చక్కని ఇతిహాసమే కాకుండా, నిగూఢ సాధనా రహస్యములు కూడా నిండియున్న భాండాగారం. సకామ భక్తులు దుర్గాదేవి సేవించి తమ అభీష్టములను, అత్యంత దుర్లభతమ వస్తువులను కూడా సులభంగా పొందుచున్నారు. ఇక నిష్కాములు దుర్లభమగు మోక్షమును పొంది కృతార్థులగుచున్నారు. మేధామహర్షి సురథ మహారాజుతో ఇట్లు చెప్పెను.

తాము పైహి మహారాజ శరణం పరమేశ్వరీమ్!

రాధితా సైవ నృణాం భోగస్వర్గాపవర్గదా !!'

అనగా ''మహారాజా! తాము ఆ పరమేశ్వరినే శరణు పొందుతూ చక్కగా ఆరాధించినచో ఆమెయే మానవులకు స్వర్గమును, భోగమును, చివరకు ఆపవర్గమును కూడా ప్రసాదించును '' అని చెప్పెను. ఈ విధముగానే ఐశ్వర్య కాముకుడగు సురథ మహారాజు భగవతి దుర్గామాతను ఆరాధించి అఖండ సామ్రాజ్యమును పొందగలిగెను. ఇంతవరకు ఆశీర్వాద రూపమగు ఈ మంత్రమయ గ్రంథము ను ఆశ్రయించి ఎందరో జిజ్ఞాసువులు, అర్ధార్ధులు, అలాగే జ్ఞాని భక్తులు, తమ తమ మనోభీష్టములను పొందగలిగిరని నిస్సంకోచముగా చెప్పవచ్చు.

'త్త్యుక్తా సా తదా దేవీ గంభీరాంతఃస్మితా జగౌ !

ర్గా భగవతీ భద్రా యాయెడం ధార్యతే జగత్ !! '

జగజ్జనని శ్రీ దుర్గాదేవి కృపాకటాక్షముతో మార్కండేయ పురాణాంతర్గతమగు ఈ దుర్గా సప్తశతి ని గురోపదేశం తో పారాయణం చేసిన మిక్కిలి ఉపయుక్తము.

యాశ్రీ: స్వయం సుకృతినాం భవనేష్వ లక్ష్మీ :పాత్మనాం కృతధియాం హృదయేశు బుధ్ధి : !శ్రద్ధా సతాం కులజానా ప్రభవస్య లజ్జా

తాంత్వాం సతా: స్మ పరిపాలయ దేవి విశ్వమ్ !

'సప్తశతీ పారాయణము న విధిని జాగ్రత్తగా అవధానంలో ఉంచుకొనవలయును . అంతకన్నా కావలసినది శ్రీ దుర్గా మాత పాదపద్మములయందు భక్తి శ్రద్దాశక్తులతో జగన్మాతను స్మరించుచు సప్తశతీ పారాయణం గావించు వారికి అమ్మ అనుగ్రహం త్వరలోనే అనుభవమునకు వచ్చును .

దేవిప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్జగతో ఖిలస్య !

ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమేశ్వరీ దేవి చరాచరస్య !! '

*******


No comments:

Post a Comment

Pages