శ్రీధరమాధురి -78 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -78

Share This

 శ్రీధరమాధురి -78

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


మంత్రాలు సహజంగా రెండు ప్రధాన వర్గాలకు చెంది ఉంటాయి, ఈ రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. అవి శబ్ద బ్రహ్మణ ,నాద బ్రహ్మణ.

సద్గురువు ద్వారా మంత్రోపదేశాన్ని పొందడాన్ని ‘మంత్ర దీక్ష’ అంటారు. అది ఒక కటువైన క్రమశిక్షణకు కట్టుబడి ఉండడం. గురువు చెప్పిన నియమనిబంధనలు అన్నింటినీ శిష్యుడు శ్రద్ధగా విని, కఠినముగా వాటిని పాటించాలి. మంత్రం అనేది కేవలం గట్టి మనసు ఉన్నవారికే బలహీనమైన మనసు ఉన్నవారికి కాదు.

మంత్రదీక్ష యొక్క విలువల వ్యవస్థ తెలిసిన సద్గురువు తన శిష్యుడికి అంత తేలిగ్గా మంత్రం దీక్ష ఇవ్వరు. అర్హత కల శిష్యుడు మంత్రాన్ని పొందే ముందు ఎన్నో పరీక్షలకు గురి చెయ్యబడతాడు. సహనం, ఓరిమి అవసరం.

విభిన్న పద్ధతుల్లో మంత్రాల్ని చదవడం వల్ల, వివిధ రకాలైన ప్రకంపనలు కలుగుతాయి.

 

అ - కారం  సృష్టిస్తుంది

ఉ – కారం స్థితికి తోడ్పడుతుంది

మ – కారం లయం చేస్తుంది.

అందుకే ప్రణవమే “AUM (ఓం)” – “దైవం”.

 

అ - కారం బ్రహ్మ తత్త్వం – జననం

ఉ – కారం  విష్ణు తత్త్వం – స్థితి

మ – కారం రుద్ర తత్త్వం – లయ

మూడూ కలిసి ప్రణవం “ఓం” ను సూచిస్తాయి.

 

ప్రతి మంత్రం లోపల జీవం ఉంటుంది. అది స్వయంగా ఆ విశ్వ చైతన్యానికి ప్రతిరూపమే !

 

ఒకరు మంత్రసిద్ధిని పొందేందుకు,  వారికి సద్గురువు ఉపదేశించిన విధంగా మంత్రాన్ని చదవాలి. ప్రతి ఒక్కరికీ, లేక ఒక బృందంలోని కొందరికి, సద్గురువు చదివేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని చెబుతారు. ఇది ప్రతి ఒక్కరికీ మారుతుంది, అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి శిష్యుడు/శిష్యుల బృందం మంత్రోపదేశ సమయంలో అత్యంత జాగరూకులై ఉండాలి. ఆ మంత్రం ప్రాధాన్యత, అర్ధం సద్గురువు చెబుతారు. ఆయన చెప్పేవన్నీ జాగ్రత్తగా మనసులో నిక్షిప్తం చేసుకుని చదవడం శిష్యుడి ధర్మం. కేవలం చదవడం ఒక్కటే చాలదు. అతను జ్ఞానంతో ఆ మంత్రంలో ఉద్దేశించిన దేవతతో మానసికంగా లయం అయిపోవాలి. అప్పుడు హఠాత్తుగా ఒకరోజున అతను మంత్రసిద్ధితో దీవించబడతాడు.

 

ఒకే మంత్రాన్ని, అనేకమంది, అనేక విధాలుగా వ్యక్తీకరించవచ్చు.  ఒకే కుటుంబంలోని వారు, ఒకే గురువు శిష్యులు, వీరికి కూడా సద్గురువు విభిన్నంగా ఉపదేశం చెయ్యవచ్చు. అలా చేసేందుకు ఆయనకు ఏవో దివ్యమైన కారణాలు ఉంటాయి. కాబట్టి, ఇతర శిష్యులతో, లేక వేరే గురుకులం నుంచి వచ్చిన ఇతరులతో మంత్రం గురించి వాదించకండి. మంత్రం అనేది సద్గురువుకు, శిష్యుడికి మధ్య వ్యక్తిగతమైనది, ఇతరులతో ఇది సరైనదా కాదా అని వాదించడం సరికాదు. మంత్రోపదేశం జరిగితే, అది మీ ఒక్కరికి మాత్రమే అని గుర్తుంచుకోండి.

 

ఒక ఉపాసనగా, మంత్రాన్ని చదవాలి. దాన్ని అత్యంత శ్రద్ధతో చెయ్యండి. అదొక సాధనగానో, ఏదో పొందేందుకో చెయ్యకండి. కేవలం దాన్ని ఒక ఉపాసనగా, ఏమీ ఆశించకుండా, చదవండి. పరిణామాలు మిమ్మల్ని అమితాశ్చర్యానికి గురి చేస్తాయి.

 


అతడు నన్నొక వినోదభరితమైన ప్రశ్నను అడుగుతున్నాడు. నా జవాబు ఏమిటంటే...

'నేను మాట్లాడేది గురు కులాన్ని వ్యాపారంలా నడపని‌సద్గురువు యొక్క పనినంతా చేసే సద్గురువు గురించి.' హ హ.

  

గురుకులం అనేది నమ్మకానికి సంబంధించిన అంశం. మరొక గురువు వద్దకు వెళ్లి మీ గురువు చెప్పిన దాని గురించి సందేహాన్ని వెలిబుచ్చకండి. నిజానికి ఇతర గురువుకు తెలిస్తే ఆయన మీ చర్యలను సమర్థించరు. ఒకవేళ ఇతర గురువుకు మీనుంచి విషయం తెలియకపోతే, మీకు వారు బదులు ఇవ్వొచ్చు. ఇటువంటి స్థితిలో తరచుగా జవాబు విభిన్నంగా ఉండొచ్చు. అది విని మీరింకా సందిగ్ధానికి లోనవుతారు. అందుకే గురువు బోధించిన అంశాలపై మీకున్న సందేహాలను ఇతరులను అడక్కండి. మీరు ఇలా చేసినట్లయితే విశ్వాసం అనేది పూర్తిగా నశిస్తుంది. మీరొక గురువుకు శిష్యుడిని అని చెప్పుకోవడం అర్థరహితమవుతుంది. ఆ అనుబంధం బూటకం అవుతుంది.

***


No comments:

Post a Comment

Pages