నెత్తుటి పువ్వు - 24 - అచ్చంగా తెలుగు

                                                                  నెత్తుటి పువ్వు - 24

మహీధర శేషారత్నం


(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ) 

ప్రతి చిన్న విషయానికి మొగుడూ, పెళ్ళాలు కొట్టేసుకోవడం, ఈ ఆడాళ్ళు పిల్లల్ని తీసుకుని నూతిలోనో, గోతిలోనో దూకడం తల్లి పేగు కదా! కొంచెం నిగ్రహించకుండా వాళ్ళు చావడమే కాక పిల్లల్ని చంపడానికి కూడా సిద్దపడి పోవడం... సత్యం గొణుక్కున్నాడు. అతడు ఏభై ఏళ్ళు దాటినవాడు. ఎన్నో కేసులు విని విని అతని మనసు బండబారిపోయింది. అయినా ఇంకా పాపం బాధపడుతూనే ఉంటాడు.

పిల్లలు పోయారు. ఆ తల్లి బతికితే బతికినన్నాళ్ళూ కడుపుకోతే కదా! పైగా చావబోయినందుకు కే సొకటి. మరో కానిస్టేబుల్ ఎవరో అన్నాడు.

బతకడం చాతకాక చావబోయి బతికిన వాళ్ళకి ఇండియన్ పీనల్ కోడ్ 309 సెక్షన్ ఇచ్చిన కానుక. బ్రిటిష్ కాలంనాటి చట్టం. ఇదొక క్రిమినల్ అఫెన్స్శంకరం అన్నాడు.

ఎమోషనల్ పెయిన్. సివియర్ మెంటల్ స్ట్రెస్ కారణంగా చూడాలి. డీక్రిమినలైజింగ్ సూసైడ్ టు టౌజండ్ సిక్స్దీన్లో మెంటల్ హెల్త్కేర్ బిల్ పాసయింది. ఎందుకంటే బ్రతకలేక చావబోవడం, చావలేక బ్రతకడం, చుట్టుపక్కల వాళ్ళ వింత చూపులు, పరామర్శలు, గుసగుసలు, పోలీసు స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడాలు... ఇంకా మెస్. ఇదొక పెద్ద విషచక్రం. అవమానంగా భావించాల్సి రావడం. బ్రతకలేక చావాలనుకుని చావలేక బ్రతికిన వాడికి బ్రతుకు ఇంకా దుర్భరం చేయడం ఏం ధర్మం? అందుకే 309 సెక్షన్ తీసేసింది బైపాస్ చేసింది.అన్నాడు భాస్కర్. “అమ్మయ్య! ఇంక నిర్భయంగా చావచ్చన్నమాటహఠాత్తుగా అంది లేడీ కానిస్టేబుల్.

ఇదుగో! ఇలాంటి ఆలోచనా విధానాన్ని కట్టుదిట్టం చెయ్యడానికే 309 సెక్షన్ కాని దానివల్ల కలిగే ఇబ్బందులు చూసాక ఆ సెక్షన్ కేంద్ర ప్రభుత్వం తీసేసింది. అయినా చావాలనుకున్నవాడు ఈ సెక్షన్లు, చట్టాలు చూసుకుని చస్తాడా? బ్రతకలేని దుర్భర స్థితి అనివార్యంగా నెట్టేస్తుంది. లేకపోతే అందరికీ ఒకటే స్థాయి మనస్థితి ఉండదు అన్నాడు భాస్కర్. “అంతే కాదు ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షలమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మాటలు కట్టిపెట్టి ఆ ప్రదేశానికి బయల్దేరారు. చూసుకుంటున్నారు. తాను సుఖంగా బతుకుతూ పక్కవాడిని బతకనిస్తే ఎంత హాయి.

*****

మనిషి బ్రతుకు దుర్భరం కావడానికి మరో మనిషే కారణం మనిషి మనిషి వల్లే బాధపడుతున్నాడు.అన్నాడు భాస్కర్.

ఒక మేధావితోనే చస్తున్నాం. ఇంకో మేధావి జత చేరాడువెక్కిరించింది లేడీ కానిస్టేబుల్ భాస్కర్ని. “మెదడు నిద్రించిన మనిషి అదృష్టవంతుడు మనసు నిద్రించినవాడు మరీ అదృష్టవంతుడుభాస్కర్.

అయ్య బాబోయ్! కవితలతో చావగొట్టకండి మహాప్రభోదండం పెట్టింది. 

ఏం చెప్పాడు అన్నది కాదు ముఖ్యం ఎలా చెప్పాడు? అన్నది.

కత్తిలా గాయపరచిందా? వెన్నెలలా చల్లపరచిందా?

ఏదో సినిమాలో సినిమా పేరు గుర్తులేదుకాని జంధ్యాల సినిమా అనుకుంటా శ్రీలక్ష్మి ఇలాగే తవికలు తవికలు అంటూ పత్రికాఫీసు వాళ్ళను చావగొడుతుంది మన భాస్కర్ లాగ అంది తనే మళ్ళీ.

కాచుకోండి ఇంకా చెప్తానుఉత్సాహంలో రెచ్చిపోయాడు భాస్కర్.

(ఇంకా ఉంది) 

No comments:

Post a Comment

Pages