ఆ కుక్క... - అచ్చంగా తెలుగు
ఆ కుక్క..... 
  భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.తినడానికేమీ దొరకక, ఒక ఎముకనైనా కొరకక,
ఐ‌నా ఎవరిపైనా అరవక, అకారణంగా ఎవరినీ కరవక,
ఒక మూలని తోక ముడుచుకొని, 
డొక్కలో కాళ్ళను పెట్టుకొని పడుకొని,
కనిపించని వేదనని కనులలో దాచుకొని,
కరుణించని ఆకలిని కడుపులోనే అణచుకొని,
అసహాయతని అదేపనిగా ఆమోదిస్తూ,
నిస్సహాయతని నిర్వేదంతో నివేదిస్తూ,
నిర్లిప్తతని నినదిస్తూ,పరివర్తనను ప్రతిబింబిస్తూ,
పరిణితిని ప్రదర్శిస్తూ,పరిమితిని ప్రబోధిస్తూ,
విపులంగా వివరిస్తూ,విపత్కర పరిస్థితులను కూడా 
వివేకంతో వలచి,ప్రారబ్ధాన్ని తెలిసి,
అవమానాలను,ఆకలిని కూడా మౌనంగానే భరిస్తూ,
తన పరిధిలోనే చరిస్తూ,
అదృశ్యంగా తరిస్తూ,ప్రవర్తిస్తున్నఆ కుక్క
నాకు తత్వాన్ని బోధిస్తున్నట్లు అనిపిస్తోంది ఎంచక్కా! 

***
                                   

No comments:

Post a Comment

Pages