వానా..వానా..-పి.వి.సుబ్బారాయుడు
వానచినుకుల ఆగమనానికి మురిసిన కళ్ల నుంచి చూపుల అభినందన గ్రీటింగ్ కార్డ్ లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడక్కడ నీళ్లు నిలిచి ఏర్పడిన బుజ్జి తటాకాల్లో పసి హృదయాల్లో ఆనంద తరంగాలుఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.తిరుగాడుతున్న కాగితప్పడవలను చూసి లోలోపల శరీరాన్ని ఆప్యాయంగాస్పృశిస్తున్న వాన చుక్కలకుతన్మయులవుతున్నారు.నడిరోడ్డున ప్రవహిస్తున్నమురికినీళ్ల కాల్వలనుపైకి విసుక్కుంటూ దాటుతున్నా కొమ్మలు, రెమ్మలూపుతూ వృక్షాలుధన్యవాదాలు తెలుపుతున్నాయి.తమకు తలంటి, దాహార్తిని తీర్చడానికిఆకాశాన్నుంచి జాలువారుతున్న నీళ్ళ ధారలకువర్ష రుతుశోభ ధరిత్రికి జీవం పోస్తుంది! ఇంద్రధనుసుతో అలంకరించి అందాన్నలముతుంది!! ***
 
వానా... వానా...
Share This 
Tags
# 062020
# కవితాఝరి
# ప్రతాప వెంకట సుబ్బారాయుడు
      
Share This 
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Labels:
062020,
కవితాఝరి,
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Subscribe to:
Post Comments (Atom)
 



 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment