కరోనా పై పేరడీ పాట - అచ్చంగా తెలుగు

కరోనా పై పేరడీ పాట

Share This
కరోనా పై పేరడీ పాట
 -సుజాత.పి.వి ఎల్.పల్లవి:
వద్దూ..వద్దంటున్నా వచ్చేశావే
 వస్తాద్ని కూడా వణికిస్తున్నావే
మా లంగ్స్ లోకి..అమాంతం దూకీ..
దేశాలన్నీ దాటి ఎందుకొచ్చావే
దారం కట్టి ప్రాణమెగరేస్తున్నావే
ఓ తుమ్ము తోటీ..హాఁ ఓ దగ్గుతోటీ..
తొలిసారిగా..(తొలిసారిగా)..
 చైనా లోనా...(చైనా లోనా)..
ఏమయ్యిందో..(ఏమయ్యిందో)..
తెలిసేలోగా..(తెలిసేలోగా)..
నీ గోడ దూకేసీ విమానం ఎక్కేసి మా దేశం వచ్చేశావే..
షేక్యాండు ఇచ్చేసి ఓ దగ్గు దగ్గేసి వైరస్ ని పంచేశావే..


 చరణం:  ఈ కరోనా పేరుని వింటూవుంటే..
 వామ్మో! కోవిడ్ కి బతుకంకితమనిపిస్తోందే..
 మేము నీ కంట పడకుండా
దూరంగా దాక్కున్నా వచ్చి చంపేస్తావేంటే!?..

 నీ కళ్ళల్లో ఆనందం చూస్తూవుంటే
నాకు మందేలేదని నువ్వు నవ్వుతున్నట్టుందే..

భయమేసి ఛస్తున్నాములే,
ఓసి మహమ్మారి! వదిలి వెళ్ళిపోవే
 ఒకటే బెదిరిస్తావేం..నీకు విరుగుడేది లేదనేగా
 నువ్ త్వరగా చచ్చిపోవే
మా బతుకు బతకనీవే
 విషజీవి నీకో దండమే..ఓ.ఓ...,
 ******


 (నేడు దేశదేశాల ప్రజలను వణికిస్తున్న కరోనా పై ఈ పాట.  'ఛలో' చిత్రంలో 'చూసీచూడంగానే నచ్చేశావే' పాటకు పేరడీగా..)

No comments:

Post a Comment

Pages