చిన్న కథ - గొప్ప సందేశం. - అచ్చంగా తెలుగు

చిన్న కథ - గొప్ప సందేశం.

Share This
చిన్న కథ - గొప్ప సందేశం

ఆలూరు కృష్ణ ప్రసాదు 


మీ అమ్మ గారు  పోయి  ఐదేళ్ళు అయ్యింది. ఇన్నాళ్ళూ  మీ నాన్నగారికి  అడ్డమైన చాకిరీ చేసాను. ఇంక నా వల్ల కాదు. మీ నాన్నగారి  విషయం  ఏం చేస్తారో  నిర్ణయించుకోండి.

ఏం చేద్దామంటావు ? 

Old age Home లో  చేర్పించండి . ఇంక నేను చాకిరీ  చెయ్యలేను.

సరే.

నాన్నా  మీ మనవడు చెన్నై లో  I. I. T.   లో  చేరాడు కదా.  వాడొక్కడినీ   అక్కడ ఒంటరిగా  వదిలి  ఉండటం కష్టంగా  ఉందని  మీ కోడలు అంటోంది. అందువలన  మా మేనేజరుని నన్ను చెన్నై  బ్రాంచ్  కు ట్రాన్స్ ఫర్  చేయమని  అడిగాను. ఇస్తానన్నాడు. నాకు  ట్రాన్ఫర్ రాగానే  మే మిద్దరం చెన్నై   వెడదామనుకుంటున్నాం. నువ్వొక్కడివీ  ఒంటరిగా  ఇక్కడ  ఉండటం కష్టం. వాడి  చదువు పూర్తి  అయ్యేవరకు  మేము   తిరిగి  రాము. అందువలన  నేను  Old  age  home  వారితో  మాట్లాడాను.  రేపు  నేను  నిన్ను  అందులో  జాయిన్ చేస్తాను.

తండ్రి  విచారంగా   "సరేరా  నీ ఇష్టం."

అన్ని  formalities  పూర్తి  చేసి  తండ్రిని  Home లో  Join చేసి  కొడుకు  వెళ్ళడానికి  సిద్ధమయ్యాడు.

అక్కడ  ఓ పెద్దాయన  ఈయన్ని చూసి

నమస్కారం  సర్.  మీరు మూర్తి గారు కదండి. ఎప్పుడో  40  సంవత్సరాల  క్రితం  మిమ్మల్ని  చూసాను. అప్పుడు  నేను  Orphan Child  Home లో  పని చేసేవాడిని. అన్నట్లు  మీరు  అప్పుడు  మా దగ్గర  ఏడాది  బాబును దత్తత తీసుకున్నారు. ఆ బాబు  బాగున్నాడా  సర్. ఇప్పుడు  ఏం చేస్తున్నాడు ?  అయినా  మీరేంటి  సర్  ఇక్కడ  ?

"అడుగో  వాడే  నా కొడుకు " అన్నాడు .  ఇంత సులువుగా  అబద్ధం  చెప్పి  తండ్రిని  నమ్మించి  Old age  home  లో  చేర్పించిన , తన పధకం పారిందని  సంతోషంగా  నడిచి  వెడుతున్న కొడుకుని  చూపిస్తూ.

***

No comments:

Post a Comment

Pages