ఒక్కసారి వెళ్ళొస్తే పోయేదేముంది? - అచ్చంగా తెలుగు

ఒక్కసారి వెళ్ళొస్తే పోయేదేముంది?

Share This
 ఒక్కసారి వెళ్ళొస్తే పోయేదేముంది?
 -సుజాత.పి.వి.ఎల్.

అగాధాల లోపల
ఆశల ఆలోచనలే ఉండవుట!..
దిగంతాల ఆవల
దుఃఖానికి చోటే లేదుట!..
అసలు అలాంటి లోకం ఒకటుందా!?
ఏమో!..ఉందేమో!?
ఒక్కసారి వెళ్ళొస్తే పోయేదేముంది?..
నీ కోసం నిరీక్షించి..నిరీక్షించీ
నువ్వు రావని తెలిసి
కన్నీరు కారుస్తూ..
సమయాన్ని వృధా చేసుకునే బదులు..
నీతో నడవలేక,
అడుగు అడుగు ఓడిపోతూ..
దినదిన గండంలా బతికే బదులు..
ఒక్కసారి వెళ్ళొస్తే పోయేదేముంది?
అమావాస్యలైన కనులు కడసారి వేడుకొంటున్నాయి..
మనసు పూర్తి చీకటి రాత్రిగా
మారిపోకముందే..
ఒక్కసారి వెళ్ళొస్తే పోయేదేముంది!?
******

No comments:

Post a Comment

Pages