నాకు నచ్చిన నా కథ - అచ్చంగా తెలుగు
నాకు నచ్చిన నా కథ
కొత్తపల్లి ఉదయబాబు 

వేగంగా వెళ్తున్న ఆటోలో కూర్చున్న మధురిమ పరిసరాలను పరిశీలిస్తూ ఉలిక్కిపడింది.

ఎదురుగ బస్సు స్టాప్ లో ఆ 'అమ్మాయి' ఎవరితోనో మాట్లాడుతోంది. అతను బైక్ మీద కూర్చున్నాడు. ''అరుణ కదూ. అవును. అరుణే. సందేహం లేదు. అతను తమ కాలనీ లో ఉంది మోహన్ కృష్ణ.
అతను ఆమెకు ఎలా పరిచయం అయ్యాడు? ఆలోచిస్తుండగానే ఆటో వారిని దాటేసింది. 'సరే. ఇంటర్వెల్ లో వచ్చి కలుద్దాంలే 'అనుకుంది మధురిమ.
*****
''అరే అరుణా. నువ్వేనా. ఉదయం ఆటో లోంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను. ఎలా ఉన్నావ్? వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు? డ్యూటీ లో ఎపుడు జాయిన్ అయ్యావు?;; ఇంటర్వెల్ లో అరుణను పలకరించడానికి వచ్చిన మధురిమ ప్రశ్నల వర్షం కురిపించింది.
''రండి ఆంటీ. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీకు గాయాలన్నీ తగ్గిపోయాయా? ఈ మూడు నెలలు బెడ్ రెస్ట్ తో విసిగి పోయాననుకోండి. మొత్తానికి మొన్ననే డ్యూటీ లో జాయిన్ అయ్యాను.'' అంటూ కుర్చీ చూపించింది.
మధురిమ కుర్చీని అరుణకు దగ్గరగా లాక్కుని కూర్చుని ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుంటూ అంది.
'' అయామ్ వెరీ సారీ అరుణా. నావల్లే నీకు అన్యాయం జరిగింది. ఆరోజు నువ్వు నా ప్రాణం కాపాడక పోయిఉంటే నా పిల్లలు, నా భర్త దిక్కులేని వాళ్ళు అయిపోయేవారు. నీ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఇంతకీ డాక్టర్లు ఏమన్నారమ్మా?'' అడిగింది మధురిమ.
''ముందుగా ఆలోచించి నేను దూకడంతో నా కాలి మడమ చిట్లిపోవడం, ఆ వెంటనే మీరు దూకేయడం తో ఆ ఆటో వాడి మోసం నుంచి తప్పించుకోగలిగాము. లేదంటే ఆరోజు మనం ఏమైపోయేవాళ్ళమో తలుచుకుంటే నాకు ఇప్పటికీ వెన్నులో చలి పుడుతుంది ఆంటీ."
''నువ్వు నా పక్కన లేకపోయినా, నువ్వు ధైర్యం చెప్పకపోయినా నేనూ తెగించేదాన్ని కాదు. అసలు వాడు మోసం చేశాడన్న ఆలోచనే నా మెదడును మొద్దు బారేలా చేసింది. కానీ బంగారం లాంటి జీవితం ముందున్నదానివి.నీ కాలు...''అంది మధురిమ బాధగా.
''మరో చిన్న ఆపరేషన్ చేయాలన్నారు ఆంటీ. అది జరిగినా మామూలుగా నడుస్తాను అని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. అంటా భగవంతుడి దయ.''నిర్లిప్తంగా అంది అరుణ.
''మనోధైర్యం కలదానివి నువ్వు తప్పకుండా మామూలుగా నడవగలుగుతావు. అప్పట్లో పెళ్లి చూపులు జరుగుతాయని చెప్పావు. ఏమైనా జరిగాయా.''
'' లేదాంటీ. ఆరోజు పెళ్ళివారందరూ ఇంటికి వచ్చి కూర్చున్నారు. నువ్ అర్జంటుగా రా అని నాన్నగారు పదిసార్లు ఫోన్ చేశారు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇక ఇప్పట్లో ఆ అవసరం రాదనుకుంటా. '' అంది దిగులుగా.
"'అలా అని ఎవరన్నారు? నీకేం తక్కువని? చక్కగా చదువుకున్నావు. అందం ఉంది. గుణం ఉంది. చక్కని ఉద్యోగం ఉంది. ఇక నీకాలు సంగతంటావా. అది నువ్ కోరి తెచ్చుకున్న ఆపద కాదు. నేను నిన్ను కోరేది ఒకటే. ఇప్పటి నీ పరిస్థితిని బట్టి ఎవరు నిన్ను చూసి జాలిపడినా వాళ్ళే నీకు కావలసినవాళ్లు అనుకునే ప్రమాదం ఉంది. అందుచేత తొందరపడి ఎవరికీ ఎటువంటి మాట ప్రేమ విషయం లో ఇవ్వద్దు.''అంది మధురిమ.
చురుగ్గా చూసింది అరుణ. ఉదయం తాను మోహన్ తో మాటాడుతుండగా ఆంటీ గాని చూసిందా?ఆమె ఆలోచనలకు అడ్డువస్తూ అంది మధురిమ.
"అమ్మా అరుణా. ఈవేళ లోకంలో మగవాడు తన అధికారాన్ని, అహంకారాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తున్నాడు.ఆడవాళ్ళం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.అలా అప్రమత్తంగా ఉండబట్టే నీదయవల్ల, ధైర్యంవల్ల నేను బతికి బట్టకట్టగలిగాను.ఆత్మస్థైర్యం గలదానివి.సవ్యంగా ఆలోచించగల శక్తి గలదానివి.అందుకే నాకు తోచిన సలహా ఇస్తున్నాను.వస్తానమ్మా.మీ పేరెంట్స్ అంతా బాగున్నారా?ఆడిగానని చెప్పు.మరి వెళ్ళిరానా?నువ్వొచ్చావని తెలిసిందిగా...నేనే తరచు వస్తుంటాను. ఆరోగ్యం జాగ్రత్త.వస్తాను."అని చెప్పి బయల్దేరింది మధురిమ.
******
ఆనాడు అలా అందే గాని మధురిమ మళ్ళీ అరుణని కలవడమే కుదరలేదు. 
కానీ చాలా సార్లు అరుణని మోహన్ బైక్ మీద దూరంగా చూసింది.  మొహన్  మీద కాలనీలో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు. డిగ్రీ పాసయ్యాడు.తల్లితండ్రులు ఎలా తెచ్చిపెట్టారో గానీ చాలా విలాసవంతంగా కనిపిస్తాడు. స్నేహితులతో అన్నిరకాల ఫంక్షన్ లకు హాజరై ఎపుడో అర్ధరాత్రి ఇల్లు చేరతాడు.
అతనికి ఇంకా వయసు రాలేదనే అతని తల్లితండ్రుల అభిప్రాయం.' వయసు  వస్తే వాడే తెలుసుకుంటాడులే' అని సర్ది చెబుతూ ఉంటారు. అతని వల్ల  మోసపోయానని, తానూ గర్భవతిని కూడా అయ్యానని ఒక అమ్మాయి  ఆమధ్య కాలనీకి వచ్చి కాలనీ కమిటీ సభ్యులముందు తనదగ్గరున్న సాక్ష్యాలను ఉంచింది. అవి తామిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు, గ్రాఫిక్స్ సహాయంతో అలాంటివి సృష్టించి తనని మోసం చేస్తోంది అని,  ఒక స్వశ్చంద సేవా సంస్థకు అధ్యక్షుడి స్థానంలో గల తనవెనుకనున్న డబ్బుకు , హోదాకు ఆశపడి ఆమె తనమీద నేరం మోపుతోంది అని వాపోయాడు మోహనకృష్ణ. దాంతో ఆమె చెప్పినవి అబద్ధాలు అని తేల్చి కమిటీ వారు ఆమెను మందలించి పంపేశారు. 
ఆ తరువాత వారం రోజులకు ఆమె ట్యాంకుబండ్ లో శవమై తేలింది. ఆ తరువాత తెలిసింది - ఆమె తన కోల్లెగ్ చెల్లెలు గంగాభవాని అని. నిజంగా అతను ఆమెను గర్భవతిని చేసి మోసం చేసాడని.
" అభం శుభం తెలియని ఆడపిల్లలకు ఆశలు కల్పించి మోజు తీర్చుకుని ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినా వాడిని ఏంచేసినా పాపం లేదు " అని తన భర్త శివరాం తో అంటే '' డబ్బున్న వాళ్ళతోటి, పరపతి ఉన్నవాళ్ళతో 'ఢీ 'కొనడం కోరి తల బద్దలు కొట్టుకోవడమే అవుతుంది. ఆ సంగతి మర్చిపో! దేవుడే అతన్ని శిక్షిస్తాడు.'' అని తేల్చి పారేసాడు.
అసలు సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన ఆ సంఘటనకు తాను ఎంతగా భయపడిపోయింది? 
ఆరోజు ప్ప్రయివేట్ క్లాస్ తీసుకోవడంతో చాలా లెట్ అయిపొయింది. కాలనీలోకి వెళ్లే బస్సు వెళ్ళిపోయింది. ఎలాగా? అనుకుంటుంటే అరుణ అదే బస్సు స్టాప్ లో నిరీక్షిస్తోంది. అంతకు ముందు ఆమె ఎవరో తనకు తెలీదు. రాత్రి ఎనిమిది దాటడంతో బస్సు స్టాప్ లో తామిద్దరే ఉన్నారు. 
అరుణ వచ్చి తనను పరిచయం చేసుకుని అంది " ఆంటీ .మీరు ఎంతవరకు వెళ్ళాలి?'' 
చెప్పింది తాను.
" అరే! మీ ఇల్లు కాలనీలో మొదట. మా ఇల్లు కాలనీ లో ఆ చివర. "
''అయితేనేం? ఇద్దరం ఉన్నాంగా.ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ వర్షం వచ్చేలావుంది.'' అంది తాను.
రెండు మూడు ఆటోలు ఖాళీ గా ఉన్నా ఆపలేదు. నాలుగో ఆటో ముందుకు వెళ్లి వెనక్కు వచ్చి ఆగింది.''ఎక్కడికి మేడం?'' అని అడిగాడు ఆటో డ్రైవర్.
ముద్దగా వఛ్చిన అతని మాట కంగారులో ఉన్న తామిద్దరూ సరిగా వినలేదు. ముందు తాను ఎక్కి అరుణ ఎక్కిన  తరువాత  తమ కాలనీ పేరు చెప్పింది. 
ఆటో రివ్వున వెళ్తోంది.
కబుర్లలో పడి తానూ గమనించలేదు. ఆటో తమ కాలనీ వైపు కాకుండా చిన్న చిన్న గుట్టలు, తుప్పలు ఉన్నవైపు వెళ్తోంది.
''ఒరేయ్.దుర్మార్గుడా .ఆపరా.ఆపుతావా .చంపేయమంటావా?''  ఉద్రేకంతో అరిచింది తాను.
వాడు వికటాట్టహాసంగా నవ్వాడు. 
అరుణ '' కంగారు పడకండి ఆంటీ. ఎదురుగా కార్లు గానీ, ఆటోలు గానీ వస్తున్నాయేమో గమనించండి '' అంది మెల్ల గా తన చెవి లో.  అలా ఒకటికి పదిసార్లు ధైర్యం చెబుతూనే ఉంది.  అయిదు నిముషాల తర్వాత రెండు కార్లు వస్తున్నట్లు కాంతి దగ్గరగా కనిపించింది.
''ఆంటీ .సరిగా ఆ కారు నడుపుతున్న వారి దృష్టి మనమీద పడేలా అరుస్తూ నావెనకాలే దూకేయండి.ఏమీ ఆలోచించవద్దు. ''అంటూ వేగంగా వెళ్తున్న ఆటో లోంచి అరుణ తనని లాగుతూ దూకేసింది.ఆమె కాలు మెయిలు రాయికి తగిలి కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది.ఆమె లాగిన్ అదురుతో తానూ రోడ్డుమీద పడిపోయింది. 
ముందు వస్తున్నా రెండు కార్లలో ఒకటి ఆగకుండా వెళ్ళిపోయింది.రెండవ కారు జరిగిన ప్రమాదాన్ని చూస్తూనే సడన్ గా ఆగిపోయింది.
అంతే.తానూ అరక్షణమ్ ఆలోచించలేదు. తక్షణం లేచివెళ్లి వారిని ప్రాధేయపడింది. 
అందులోంచి దిగిన కుటుంబం తమను ఎక్కించుకుని హాస్పిటల్లో చేర్చారు.tతనకుమోచేతులకు, మోకాళ్ళకు బలమైన దెబ్బలే తగలాయి.అరుణకు కాలు ఫ్రాక్చర్ అయింది.
తనను మరునాడు డిశ్చార్జ్ చేశారు. అరుణ కాలికి ఆపరేషన్ చేసి సిమెంట్ పోత పోశారు.రోజూ తాను రెండుపూటలా వెళ్లి చూసొచ్చేది.
''అయ్యో ఎందుకమ్మా.''అనేవారు అరుణ తల్లితండ్రులు.
ఒక వారం తరువాత వరకు అరుణను పనిఒత్తిడి వల్ల మళ్ళీ కలవలేకపోయింది.ఇంతకూ తాను పనిచేసే పాఠశాలకు అటు దగ్గరలో ప్రయివేట్ కంపెనీలో తాను పెర్సనల్ ఆఫీసర్. 
తన బంధువులు వైజాగ్ కె.జీ.హెచ్. లో ఉండటంతో అరుణను వాళ్ళ తతలితండ్రులుఅక్కడకు తీసుకువెళ్లిపోయారు.
మళ్లీ ఇదే తనను చూడటం.పనిచేసుకుంటూ ఆలోచిస్తున్న మధురిమా గుమ్మలో అలికిడి కావడంతో అటు చూసింది. ఎదురుగా అరుణ.
''వాటే సర్-ప్రయిజ్ ...ఎవరిగురించి అయితే తలుచుకుంటున్నామో వారే ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు మనం కలలో ఉన్నామో నిజంలో బతుకుతున్నామో అర్ధం కాదు కదూ.' అంది మధురిమా.
'' వాట్ బ్యూటిఫుల్ కొటేషన్.చాలా బాగా చెప్పారు ఆంటీ.నిజాంగా నాగురించి ఆలోచిస్తున్నారా?''
''నీమీద వొట్టు .నమ్ముతావా.రెండు నిముషాల్లో పాలు వెచ్చబెట్టి నెస్-కేఫ్ కలిపి అరుణకు ఇచ్చి తానూ తీసుకుని హాల్లో సోఫాలో అరుణ పక్కన కూర్చుంటూ అడిగింది  మధురిమా 
''ఎంత అదృష్టం - నువ్వు మా ఇంటికి రావడం .చెప్పు ఎం సాయపడగలను నీకు?''ఆప్యాయంగా ఆర్ద్రతగా అడిగిన మధురిమ  కళ్ళల్లోకి సూటిగా చూడలేక ఆమె బుజం మీద తలవాల్చి అడిగింది అరుణ.
''ఈవిషయం లో మీరే సాయం చేయగలరాంటీ .నేను మీ పెద్ద కూతురు అనుకున్నారన్న చనువుతో మీముందు నా సమస్య ఉంచుతున్నాను.పూర్తిగా విని ఏంచెయ్యమంటారో చెప్పండి.''
''తప్పకుండానమ్మా.నీకు ఎలా సహాయం చేయగలనా అని సదా కృతజ్ఞతతో ఎదురుచూస్తున్నాను. ఇపుడు నీ సమస్య నీది కాదు. నా కుటుంబ సమస్యగా భావిస్తాను.''
''ఆంటీ.'' అంటూ మధురిమను గట్టిగ కౌగలించుకుంది అరుణ.
''మోహన కృష్ణ అని మన కాలనీ అబ్బాయే.మీకు తెలిసే ఉంటుంది.''
''ఊ.తెలుసు''
''తాను నన్ను ప్రేమిస్తున్నాడని ఒకటే వెంటపడుతున్నారు, ఇలాటి కాలి అవకారంతో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు?అందుకని అతన్ని వివాహం చేసుకుందామని అనుకుంటుంన్నాను.''
''అతనికి మాట ఇచ్చావా?''
''లేదు''
'' అతనితో నీకు పరిచయం ఎలా అయింది?''
''ఈ యాక్సిడెంట్ అయి మీరు హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యాకా తన పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్ లో రోగులకు పళ్ళు, రొట్టెలు ఇచ్చే కార్యక్రమానికి వచ్చి నన్ను చూసాడు. నాన్నగారిని అమ్మని బాగా మెప్పించాడు. వాళ్ళు ఒప్పుకున్నట్లే. నాకు నన్ను ప్రేమించే మనసు కావాలి.అతను నన్ను ప్రేమిస్తున్నాడా ? జాలిపడుతున్నాడా? అది ఎలా తెలుసుకోవాలి అన్నదే నా సమస్య.''
''అంతేనా . సరే.అతను నువ్వు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా ఉందా?''
''లేదు ఆంటీ. నావి సింగిల్ గా తానూ చాలా ఫోటోలు తీసాడు. మనం ఇద్దరం కలిసి తీయించుకుందాం అంటే ఆరోజులన్నీ ముందున్నాయి అనేవాడు.''
''సరే. నీకు నామీద పరిపూర్ణమైన నమ్మకం ఉందా"? 
'' ఆంటీ. మీరేనా ఆమాట అంటున్నది?''
''అందుకోసం కాదమ్మా.యాక్సిడెంట్ తరువాత నీ మనోధైర్యం లెవెల్ ని తెలుసుకోవడం కోసం అడిగాను అంతే.సరిగ్గా వారం రోజుల తరువాత నువ్ వస్తే నీ సమస్యకు ఒక పరిష్కారం చూసిస్తాను. సరేనా?''
                                                                *       *        *
సరిగ్గా వారం తరువాత అదేరోజు అదేసమయానికి అరుణ రానే వచ్చింది.అరుణ చేతిలో రెండు ఉత్తరాలు పెట్టింది మధురిమా.
''చూడమ్మా అరుణా. ఇవి ఉత్తరాలు కావు.నీ జీవితాన్ని ఎటువైపు మలుచుకోవాలో నిర్ణయం తీసుకునే అస్త్రాలు.చదివి ఆలోచించి నిర్ణయించుకో.నేను ఈలోగా టిఫిన్ తయారు చేస్తాను'''
''సరే ఆంటీ.'' అని అరుణ సోఫాలో కూలబడింది ఉత్తరాలతో.
ముందుగా ఎడమ చేతిలో ఉత్తరం విప్పింది అరుణ. అందులో ఇలా ఉంది.
'' అక్కయ్య!  నాన్నగారు పోయాకా ఇంటికి పెద్దదానివైనందుకు బాధ్యతా వహించి , అమ్మను మరిపించి అమ్మవయ్యావు. చక్కని చదువు చెప్పించి నా జీవితానికి చక్కని మార్గదర్శివి అయ్యావు.నువ్వు చెప్పిన అరుణను నేను హాస్పిటల్ కు వెళ్లి చూసాను. కుందనపు బొమ్మలా ఉంది. ఆ అమ్మాయి గుణగణాలు నీద్వారా విన్నాకా ఆ అమ్మాయిని చేసుకునే అదృష్టమా? అనిపించింది.ఎందుకంటే నేను చూసిన రెండు సందర్భాలలో ఆమ్ పక్కమీద కూర్చుని నుదిటిమీద చేయి వేసి చనువుగా మాట్లాడుతున్న మరో వ్యక్తిని చూసాను. ఏది ఏమైనా ఆమెను నా భార్యగా నిర్ణయించిన నీ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాను. అయితే ఆ అమ్మాయికి అంగీకారమైతే, నువ్వు ఆశీర్వదిస్తే ఈ ప్రపంచం లో నన్ను మించి ఆనందించేవాడు   మరి ఎవ్వడూ ఉండడు .నేను శనివారం సెలవు పెట్టి వస్తున్నాను.  - 
సదా నీ ఆశీసులు కోరే నీ చిన్నతమ్ముడు శ్రీ హర్ష.''
చిత్తరువు లా నిలబడిపోయిన అరుణ ఆ ఉత్తరం మూడుసార్లు చదివింది.ఆమె అంతరంగం లో అల్లకల్లోలం మొదలైంది.
ఆమె రెండో ఉత్తరం విప్పింది.అందులో ఇలా ఉంది.
"అక్కా!
అనాదిగా సమాజంలో నమ్మిన ఆడదాన్ని మగవాడు దారుణంగా మోసం చేస్తున్నారు.నేను మోహనకృష్ణ అనే అబ్బాయి ని మనస్ఫూర్తిగా ప్రేమించినాను. ఒక మారుమూల పల్లెలో ప్రాథమిక పాఠశాల స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న నాకు అతను ఒక స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు గా పరిచయం అయ్యాడు.పాఠశాల లో బీదపిల్లలందరికి యూనిఫామ్, పుస్తకాలు, పలకలు పంచిపెట్టాడు.అంత చిన్నవయసులో అతని ఆదర్శానికి నేను ముగ్ధురాలినయ్యాను.ప్రత్యేక అభినందనలు తెలిపాను.అప్పటినుంచి తరచు పాఠశాల కు వచ్చేవాడు.
నాతో పరిచయం పెంచుకున్నాడు.నేను నెమ్మదిగా అతని ప్రేమలో పడ్డాను. కలిసి ఎన్నో ఫోటోలు తీయించుకున్నాం.చివరికి అతను ఎక్కడికి రమ్మన్నా ఒంటరిగా ధైర్యంగా వెళ్లేంతగా నన్ను ఆకర్షించారు.ఒకానొక సమయంలో అతను ప్రొసీడ్ అయ్యాడు.నేనూ అంగీకరించాను.ఫలితంగా నేను గర్భవతి నయ్యాను.ఆ తర్వాత అతను కనిపించలేదు. నాకు ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అని తేలాక ఆటో ఇటో తేల్చుకుందామని అతని ఇంటికి వెళ్ళాను.
నాదగ్గర సాక్ష్యాధారాలు అన్ని గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినవనీ, తనకేపాపం తెలియదని బొంకాడు.నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా ఇతను నన్ను మోసం చేసాడు అని ఎలుగెత్తి అరిచాను.ఈ విషయంలో నాదే తప్పుకాబట్టి, నా తప్పుకు నేనే బలి అవుతున్నాను.సెలవు.
ఇట్లు
నీ చెల్లెలు కాని చెల్లెలు - గంగాభవాని."
అరుణ కళ్ళు వర్షించే శ్రావనమేఘాలు అయ్యాయి.
ఎపుడు వచ్చి వెనుక నిలబడిందో మధురిమ అంది."నువ్వు చదివిన ఉత్తరాల్లో ఒకటి నువ్వు ఊహించలేని నిజం.రెండవది నమ్మలేని వాస్తవం."
"ఆంటీ...ఇది..ఇది నిజమా..",అంది గంగాభవాని ఉత్తరం చూపిస్తూ.
"అవునమ్మా.ముందు కళ్ళు తుడుచుకో.మోహనకృష్ణ రూపానికి మోహనుడు.చేతలకి మోసగాడని నాకు చాలారోజుల క్రితమే తెలుసు.
అతనితో నిన్ను చాలాసార్లు చూసినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. అది అతని పట్ల నీ అభిమానం కావచ్చు.నీదీ గంగాభవాని లాంటి మనస్తత్వమీ అయితే ఎపుడో లొంగిపోయి ఉండేదానివి.నీ మనోధైర్యమే నిన్ను ఆలోచింపచేసి నిర్ణయం తీసుకోలేని స్థితిలో నాదగ్గరకు వచ్చేలా చేసింది.తాను చేసే స్నేహానికి సాక్ష్యం కూడా దొరకనీయని తెలివితేటలు అతనివి.ఆ అమ్మాయి నా కొల్లేగ్ చెల్లెలు. నా కొలీగ్ ను అడిగి ఈ ఉత్తరం తీసుకున్నాను."

"నా కళ్ళు తెరిపించా రాంటీ.నేనేమీ ఆవేశపడకుండా అతను ఇక ఏనాడు నా జోలికి రాకుండా గుణపాఠం చెబుతాను.నన్ను నమ్మండి."
"అలాగే. ఇక నా తమ్ముడిసంగతి.శ్రీహర్ష నా ఆఖరి తమ్ముడు. వైజాగ్ స్టీల్ ప్లాంటులో టెక్నీకల్ సూపరువైజర్ గా పనిచేస్తున్నాడు.నువ్వు   వైజాగ్ లో ఉన్నపుడు నిన్ను ప్రపోజ్ చేసి చూసి రమ్మంది నేనే.నువ్వు నాకు చేసిన సాయానికి నేను నీకు ఏ సహాయం చేయగలను అని ఆలోచించాను.నిన్ను బయటకు పోనివ్వడం నాకు ఇష్టం లేదు. నీకు అభ్యంతరం లేకుంటే మీ పేరెంట్స్ తో మాట్లాడతాను."అంది మధురిమ
"ఆంటీ.సాటిమనిషిగా మీకు ధైర్యం చెప్పిన కృతజ్ఞతకే నన్ను మీరు ఇంతగా ఆదరిస్తున్నారు.మీ కుటుంబం లో నాకూ ఒకస్థానం కల్పిస్తానంటే అంతకన్నా అదృష్టమా.మీకు మీ కుటుంబానికి సదా కృతజ్ఞురాలిని."అండి వంగి మధురిమ పాదాలు తాకుతూ.
""ఆ..ఆ..ఇదంతా మనం వదినా మరదళ్ళం అయ్యాకా.సరేనా.ఈ గులాబీజామ్ తో నోరు తీపిచేసుకో."అంటూ స్పూన్తో గులాబీజామ్ ను అరుణ నోటికి అందించింది మధురిమ.
"ఈ గులాబీజామ్ అంత టీవోయిగా మన బంధం కొనసాగాలి" అంది మధురిమ.
బదులుగా ఆప్యాయంగా కౌగలించుకుని " నేను ఎంత అదృష్టవంతురాలిని ఆంటీ"అంది అరుణ కృతజ్ఞత నిండిన హృదయంతో!!!
****

No comments:

Post a Comment

Pages