శుభ సంక్రాంతి - అచ్చంగా తెలుగు

శుభ సంక్రాంతి

Share This
'శుభ సంక్రాంతి '
-సుజాత. పి .వి.ఎల్ 


వినూత్న కాంతులతో
విశ్వమంతా నేడు
సంక్రాంతి సంబరాలతో నిండింది
సంబరాల సంరంభాన్ని
సరదాగా పంచుకునేందుకు
లక్షలాది ప్రజల కొరకు
సందడిగా సవ్వడి చేస్తూ
తెలతెలవారు జామునే
తలుపుతట్టి
ఊరినే మేల్కొలిపింది సంక్రాంతి లక్ష్మి
ముంగిళ్ల ముత్యాలముగ్గులు
ముగ్గుల్లో దాగిన రతనాల గొబ్బిళ్ళు
గొబ్బిళ్ళ కొప్పులో మురిసే
ముద్దు లొలుకు ముద్ద బంతులు
పచ్చని పైరులు పసిడి ధాన్యపు రాశులు
గంగిరెద్దు ఆటలు
బసవన్న ఆశీస్సులు
హరిదాసు కీర్తనలు సంక్రాంతి లక్ష్మికి
స్వాగతం పలుకగా
ప్రకృతి కాంత పరవశించింది
ప్రతి ఇంటా అడుగిడింది
తొలి నవ్య కాంతి
శుభ సంక్రాంతి ..!
****


No comments:

Post a Comment

Pages