శ్రీధరమాధురి - 70 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 70

Share This
శ్రీథరమాధురి - 70
                     (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)



ప్రేమ అనేది హృదయ సంగీతం, దాన్ని మాటల్లో వ్యక్తపరచడం వీలుకాదు.

హృదయం నుంచి జనించే ప్రేమకు ఏ భాషా తెలియదు... 

ఏదైనా మంచి అంశం ముగిసిపోతే, మరింత మెరుగైనది మొదలవుతుంది.
ఏదైనా మెరుగైనది ముగిసినప్పుడు, సర్వోత్తమమైనది మొదలవుతుంది.
ఏదైనా సర్వోత్తమమైనది ముగిసినప్పుడు, సంతృప్తి మొదలవుతుంది.
అన్ని ఆరంభాలకు ముగింపు ఈ సంతృప్తే !


మనం బాస్ లను (మన పై అధికారులను) ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాము, కాని చాలా అరుదుగా ఒక నాయకుడిని చూస్తాము. ఒకరిలో ఉన్న నాయకత్వ లక్షణాలకు కొలమానం వారి విద్యార్హత కాదు. ఎంతో అనుభవాన్ని పొందిన తర్వాత కూడా, కొందరిలో నాయకత్వ లక్షణాలు లోపించడం నేను చూసాను. ఒక నాయకుడికి 360 డిగ్రీల దృష్టి ఉంటుంది. అతను దూరాలోచనాపరుడు. విషయం ఎంత చిన్నదైనప్పటికీ, ఒక నాయకుడు తన బృంద సభ్యులు ఇచ్చిన సలహాలను స్పష్టమైన మనసుతో వింటాడు. ఒక నాయకుడు పూర్తి సహనంతో ఉంటాడు. ఒక నాయకుడు చాలా త్వరగా నేర్చుకుంటాడు, నేర్చుకున్న దాని ఆధారంగా పని చేస్తాడు. విమర్శించినా కూడా, ఆయన శాంతంగా ఉండి, ఆ విషయంలో తన అభిప్రాయాలను సంక్షిప్తంగా, ధైర్యంగా వారి ముందుంచుతాడు. తన బృంద సభ్యుల ఆత్మవిశ్వాసానికి ఆనందిస్తూ, తన బృందంపై నమ్మకం ఉంచుతాడు. అతను ఎల్లప్పుడు తన సామర్ధ్యాన్ని, విజయాన్ని తన బృంద సభ్యుల చొరవగా చూపుతాడు. తన బృంద సభ్యుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, పనితీరును బట్టి వారికి బహుమతులు ఇస్తాడు. మీరొక నాయకుడి క్రింద పనిచేస్తుంటే, ఆయన మీకు ఎలా దారిచుపుతారంటే, మీకు ఒత్తిడి అనేదే ఉండదు, దానివల్ల మీరు ఆ సంస్థలో పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తారు. నాయకుడికి అహంకారం ఉండదు, పూర్తి ప్రేమతో ఉంటారు. జీవితంలో ఒక నాయకుడి క్రింద పనిచెయ్యాలంటే వారు దీవించబడిన వారై ఉండాలి. బాస్ వీటన్నింటికీ వ్యతిరేకమైనవారు, ఒక బాస్ క్రింద పనిచెయ్యటం శాపం వంటిది.
***

No comments:

Post a Comment

Pages