ఈవిడ-ఆవిడ - అచ్చంగా తెలుగు
ఈవిడ-ఆవిడ - పారనంది శాంతకుమారి

ఈవిడకేమో అపార్ట్ మేంట్ ఫ్లాట్ లోఉండే సందడి ఇష్టం,
ఆవిడకేమో వ్యక్తిగతమైన గృహంలో ప్రశాంతంగా ఉండటం ఇష్టం.
ఈవిడకేమో ఇంట్లో పనిచేసే కోడలు దొరికితే బాగుణ్ణుఅని ఆశ,
ఆవిడకేమో బయటకువెళ్లి సంపాదించే కోడలువస్తే బాగుంటుందని ఆశ.
ఈవిడకేమో సొంతనిర్ణయాలు తీసుకొనే భర్తంటే ఇష్టం,
ఈవిడకేమోకూతుర్లు పుట్టి ఉంటే బాగుండేది కదాఅని బాధ,
ఆవిడకేమో అన్నీతనని అడిగిమరీ చేసే భర్తంటే ఇష్టం.
ఈవిడకేమో భర్త పూజలు చేయనివ్వటంలేదని పరితాపం,
ఆవిడకేమో కొడుకులు పుట్టిఉంటే బాగుండేది కదా అని బాధ.
ఆవిడకి భర్త పూజలు చేయమంటాడని పిచ్చికోపం.
ఈవిడకు విధిపై గౌరవం,ఆవిడకునిధిపై గౌరవం.
ఈవిడకు నలుగురితోకలిసి ఉండటమంటే ఇష్టం,
ఆవిడకు ఒంటరితనమంటే ఇష్టం.
ఈవిడకు భవిష్యత్తులో జరుగబోయే మంచిని ఊహించుకోవటం ఇష్టం,
ఈవిడకు నలుగురికి పెట్టటమంటే ఇష్టం,
ఆవిడకు నాలుగురాళ్ళు వెనకేసుకోవటమంటే ఇష్టం.
ఆవిడకు గతంలో జరిగిపోయిన చెడును తలుచుకోవటమంటే ఇష్టం.
ఈవిడది ఆత్మవిశ్వాసం, ఆవిడది అహంభావం.
ఈవిడ హృదయానికి ప్రాముఖ్యత ఇస్తుంది,
ఆవిడఅందానికి ప్రాధాన్యత ఇస్తుంది.
***

No comments:

Post a Comment

Pages