ఈ దారి మనసైనది - 23 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 23


అంగులూరి అంజనీదేవి

పూజారులు వచ్చిపెద్ద దీపాన్ని వెలిగించి గంగామాతకు పూజ చేసిఆ దీపాలను భక్తులకి చూపిస్తుంటే... ఆ దీపాల ప్రతి బింబాలు గంగానదిలో తిరిగి కన్పిస్తూ “న భూతో న భవిష్యతి" లా వుంది.

పెద్దవాళ్లు కానిచిన్నవాళుకాని.... తన జీవితకాలంలో ఒక్కసారైనా చూడవలసిన పుణ్యక్షేత్ర మది.
రాత్రికి హరిద్వార్ లోనే హోటల్లో బస చేసి ఉదయాన్నే రిషికేష్బయలుదేరారు.
రిషికేష్ లో  రెండు కొండల మధ్యనప్రవహిస్తున్నగంగానది,ఆ రెండు కొండల్ని కలుపుతూ రామ్ లక్ష్మణ్ జులాలువున్నాయి.
రాం జులా  పై నుంచి గంగానదిని దాటుతూ నది ఒడ్డున వున్న రామ్ జులా  (టెంపుల్)కి చేరుకున్నారు.
అందరు దేవుళ్ళు వున్న ఆ టెంపుల్నిగుండ్రంగా ఎక్కి పైకి చేరుకున్నారు.
పైన వున్న టెంపుల్లో రాముడు కొలువైవున్నాడు.
తర్వాత లక్ష్మణ్జులాచాముండేశ్వరి దేవిని దర్శించుకొని అక్కడనుండి అమృతసర్ కి బయలుదేరారు.
అమృతసర్ లో స్వర్ణదేవాలయాన్నిదర్శించుకోవడం కోసం సిక్కులు కట్టుకున్నట్లే తలకి ఓ గుడ్డ కట్టుకొని లోపలకి వెళ్లారు.
ఆ దేవాలయం సిక్కుల ఆరాధ్య దేవాలయం.
ఆ టెంపుల్నిదర్శిస్తున్నప్పడు......ఆక్కడక్కడ సిక్కు మత గురువుల గురించివాళ్ల చరిత్ర గురించి రాయబడి వుండడం చూశారు.
అక్కడ నుండిజెలియన్వాలాబాగ్ చూడటానికి వెళ్లారు. ఆ గార్డెన్ లో ... బ్రిటిష్ అధికారి 'డయ్యర్ కాల్పులు జరిపినప్పడు చాలా మంది భారతీయులు ఆ కాల్పుల్ని తట్టుకోలేక దూకేసిన బావిని,గోడలపై బుల్లెట్ మార్క్ ని, చనిపోయిన వాళ్ల పేర్లని రాసినస్థూపాన్నిచూశారు.
అక్కడ నుండి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ (వాగ్ బోర్డర్) కి చేరుకున్నారు. అక్కడ బార్డర్ చుట్టూ దట్టమైన పెన్సింగ్ వుంది. దానికి కరెంట్ సపైచేయబడివుంది.
సాయంత్రం నాలుగుగంటలనుండే అక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు తమతమ నంనృతిని చాటుతూ ప్రదర్శనలిస్తున్నారు. ఆడియన్స్ అందరు “భారత్ మాతాకీ జై "అంటూ తమ దేశ భక్తిని తెలియజేస్తున్నారు.
ఆ తర్వాత ...
సాయంత్రం ఆరుగంటలకి బార్టర్ జవాన్స్ "మార్చ్ ఫాస్ట్"చేసుకుంటూ వెళ్లి బార్టర్ మధ్యలో వున్న గేటుని తీశారు. అదే సమయంలో అటు పాకిస్తాన్ సైనికులు కూడా వాళ్ల గేటుని తీశారు. తర్వాత మరో ఇద్దరు జావాను మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ జెండాకి సెల్యూట్ చేసి జెండాను తీసేశారు.
సూడెంట్స్ అంతా ఎవరి ఫీలింగ్లో వాళ్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
మన్విత మాత్రం ఎవరితో మాట్లాడకుండప్రతి ప్రదేశాన్ని అంతః చక్షువుతో ఆస్వాదిస్తున్నట్లు ... అనురాగ్ ఎక్కడున్నాడో కూడా చూసుకోవడం లేదు.
రాత్రి ఏడు గంటల వరకు అక్కడే వుండి తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో . ఇండియాగేట్కుతుబ్మినార్లోటస్ టెంపుల్,పాల రాతితో కట్టిన అక్షరథామ్, శ్రీ కృష్ణ టెంపుల్ చూసి....
ఆ తర్వాత ఎ.పి. ఎక్స్ప్రెస్టైనెక్కి వరంగల్ చేరుకున్నారు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages