శ్రీధరమాధురి - 66 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 66

Share This

శ్రీధరమాధురి - 66
                      (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)



అతను – గురూజీ, అతను నా పనిని దొంగిలించి, ప్రమోషన్ తెచ్చుకున్నాడు.
నేను – నీ పని ఇతరుల పదోన్నతికి ఉపయోగపడిందని సంతోషించు. ఎలాగైనా  నీ పనే ప్రసంశల్ని పొందింది కదా.
అతనొక వికారమైన చూపు చూసాడు, నా వద్దకిక రాలేదు. ఇంకో వికెట్ పడిపోయింది. హ హ హ .

పొగడ్తలైనా, శాపాలైనా మనం చేసే పనిమీద ప్రభావం చూపకూడదు. 

ఉదయం వంటింట్లో, కుటుంబ సభ్యుల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కోరి అత్తగారు, కోడలు ఎన్నడూ పోట్లాడుకోకూడదు. అటువంటి విపరీత స్థితిలో హాల్ లో పోట్లాడుకోవాలి, అప్పుడు మావగారు, కొడుకు వంట వండవచ్చు. కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరి ఈ సూచన జారీ చెయ్యడమైనది. హ హ హ.

మీరు చేసే పనులన్నింటిలో నేను దైవత్వాన్ని చూస్తాను. 

పత్రి వారూ ఇతరుల చర్యల్లో దైవాన్ని చూసే విధంగా సుదర్శన భగవానుడు మీకు మంచి దృష్టిని ప్రసాదించుగాక !

ఇలా ఏడుస్తూ కూర్చోకండి...
నాకు బాధ్యతలున్నాయి.
నేను చాలా అప్పులు కట్టాల్సి ఉంది.
నాకు ఆఫీస్ లో ప్రొమోషన్ రాలేదు.
ఒకసారి ఈ భావాల్ని వెళ్ళగ్రక్కలంటే అది పర్వాలేదు. కాని పదేపదే ఇలా చెప్పడం అరిగిపోయిన రికార్డు అదేఅదే పలకడం వంటిది.  
మీ బాధ్యతల్ని మీరే తీర్చాలి.
మీ అప్పులు మీరే కట్టాలి.
మీ పదోన్నతిని మీరే గెల్చుకోవాలి. 
మా మటుకు మేము కర్తలము కాదు కనుక, మాకు ఏ బాధ్యతలూ లేవు.
మేము తీసుకునే అప్పులు సమాజ శ్రేయస్సు కోసం, అది దైవేచ్చ, ఆయనే కర్త అందుకే ఆయనే వాటిగురించి జాగ్రత్త తీసుకుంటారు.
 
మేము కేవలం దైవానుగ్రహం వలన పని చెయ్యగలుగుతాము, ఏ ప్రసంశలు, బహుమతులు ఆశించము. అందుకే అవి మమ్మల్ని ప్రభావితం చెయ్యలేవు. అందుకే మీ సంక్షేమంకోసం మా ప్రార్ధనలు  ఎల్లప్పుడూ కొనసాగుతాయి.
***

No comments:

Post a Comment

Pages