శాస్త వైభవం - 4 - అచ్చంగా తెలుగు
శాస్త వైభవం - 4
శ్రీరామభట్ల ఆదిత్యజగద్గురు ఆదిశంకర భగవత్పాదులు అందరు దేవుళ్ళ మీద అనేకానేక స్తోత్రాలు, అష్టకాలు రాశారు. అలాగే హరిహర తనయుడిపై కూడా ఒక స్తోత్రం రచించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ నెల ఈ స్తోత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

ఆశానురూపఫలదం చరణారవిన్ద- భాజామపారకరుణార్ణవపూర్ణచంద్రమ్ |
నాశాయ సర్వవిపదామపి నౌమి నిత్య- మీశానకేశవభవం భువనైకనాథమ్ - 1

పింఛావలీ వలయితాకలితప్రసూన- సంజాతకాంతిభరభాసురకేశభారమ్ । 
శింజానమంజుమణిభూషణరంజితాంగం చంద్రావతంసహరినందనమాశ్రయామి - 2

ఆలోలనీలలలితాళకహారరమ్య- మాకమ్రనాసమరుణాధరమాయతాక్షమ్ । 
ఆలంబనం త్రిజగతాం ప్రమథాధినాథ- మానమ్రలోకహరినందనమాశ్రయామి - 3

కర్ణావలంబిమణికుండలభాసమాన- గండస్థలం సముదితాననపుండరీకమ్ । 
అర్ణోజనాభహరయోరివ మూర్తిమంతం పుణ్యాతిరేకమివ భూతపతిం నమామి - 4

ఉద్దండచారుభుజదండయుగాగ్రసంస్థం -కోదండబాణమహితాంతమతాంతవీర్యమ్ । 
ఉద్యత్ప్రభాపటలదీప్రమదభ్రసారం - నిత్యం ప్రభాపతిమహం ప్రణతో భవామి - 5
  
మాలేయపంకసమలంకృతభాసమాన- దోరంతరాళతరళామలహారజాలమ్ । 
నీలాతినిర్మలదుకూలధరం ముకుంద- కాలాంతకప్రతినిధిం ప్రణతోఽస్మి నిత్యమ్ - 6

యత్పాదపంకజయుగం మునయోఽప్యజస్రం భక్త్యా భజన్తి భవరోగనివారణాయ । 
పుత్రం పురాంతకమురాంతకయోరుదారం- నిత్యం నమామ్యహమమిత్రకులాంతకంతం - 7

కాంతం కళాయకుసుమద్యుతిలోభనీయ- కాంతిప్రవాహవిలసత్కమనీయరూపమ్ ।
 కాంతాతనూజసహితం నిఖిలామయౌఘ- శాంతిప్రదం ప్రమథయూథపతిం నమామి - 8

భూతేశ భూరికరుణామృతపూరపూర్ణ- వారాన్నిధే, వరద, భక్తజనైకబంధో । 
పరమభక్త పాయాద్భవాన్-ప్రణతమేనమపారఘోర - సంసారభీతమిహ మామఖిలామయేభ్యః - 9

హే భూతనాథ భగవన్, భవదీయచారు- పాదాంబుజే భవతు భక్తిరచఞ్చలా మే । 
నాథాయ సర్వజగతాం భజతాం భవాబ్ధి- పోతాయ నిత్యమఖిలాంగభువే నమస్తే - 10

కాంచిపురంలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక వైపు అయ్యప్ప చేతిలో కొరడాతో తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపం మనకు కాంచిపురంలోని ఇతర దేవాలయాలలో కూడా కనిపిస్తుంది. ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

Pages