ఈ దారి మనసైనది - 21 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 21


అంగులూరి అంజనీదేవి(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా వెళ్తారు అందరూ. తాజ్ మహల్ చూస్తూ ఉంటారు.)   
రాత్రి పదకొండు గంటలకి సిమ్లాకి చేరుకున్నారు.

అక్కడ వాతావరణం చల్లగా అన్పిస్తూ, మంచుకురుస్తూ వాళ్లను వణికిస్తుంది.

డిన్నర్ ముగించుకున్నాక ట్రావెల్ వాళ్లు క్యాంప్ ఫైర్ (Camp Fire) ఏర్పాటు చేశారు.

క్యాంప్ ఫైర్ కి అటువైపుఅబ్బాయిలు ఇటు వైపు అమ్మాయిలు కూర్పుని ... ఆ మంటతో చలికాచుకుంటూ అంతాక్షరి, ధమ్షరాడ్స్, సింగింగ్ చేస్తుంటే అబ్బాయిలు డాన్స్ చేస్తూ ఆ వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు.

 ఉదయాన్నే లేచి కొండలమీదున్నటెంపుల్కి గుర్రాల విూద బయలుదేరారు.

గుర్రాలపై వెళ్తున్నప్పడు... దారిలో పొడవైన యూకలిప్టస్ చెట్లు ఆకాశాన్ని తాకుతూ కన్పించాయి. చలితో దట్టమైన మంచు భూమ్మిద తిరిగే మేఘాల్లా మనుషుల్ని తాకుతున్నాయి. అదోవింత అనుభూతిని కలిగించింది.

దైవ దర్శనం అయ్యాక... బయట కొచ్చి పక్కనే వున్నయాపిల్ తోటలో కూర్చుని, మంచు కొండల్ని చూస్తూ కబుర్లు చెప్పకుంటూ కాలక్షేపం చేశారు. సౌమ్య జోకులు, దినేష్ అల్లరి అంతా, ఇంతా కాదు.

సాయంత్రం మూడు గంటలకి సిమ్లా నుండి డెహరాడూన్ పైగా ముస్సోరికి బయలుదేరారు.

84 కిలో విరాటర్ల... ఘాట్ రోడ్ పై ప్రయాణిస్తూ మధ్య, మధ్యలో భయాన్ని దాచుకోవడం కోసం అరుపులు, కేకలు, మొదలు పెట్టారు.

సాయంత్రం ఆరు గంటలకి ముస్సోరి చేరుకున్నారు. స్నాక్స్ తిని, టీ త్రాగి షాపింగ్ కి బయలుదేరారు.

రాత్రికి క్యాంప్ ఫైర్ దగ్గర బాగ ఎంజాయ్ చేసి ఉదయాన్నే టిఫిన్ ముగించుకొని వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్లారు. అక్కడ "రోప్వే లో కూర్చుని ఒక కొండపై  నుండి ఇంకో కొండ పైకి వెళ్తూ  వాటర్ ఫాల్స్ లోంచి పడ్డ నీళ్లని స్వీమ్మింగ్ పూల్లోకి ఎలా పంపుతున్నారో చూశారు. అక్కడ ఆ వాటర్ ఫాల్స్ క్రింద అబ్బాయిలు స్నానం చేస్తూ ఎంజాయ్ చేశారు.

లంచ్ ముగించుకొని కులుమనాలికి బయలుదేరారు.

బస్లోంచి చూస్తుంటే ... అటు పక్క కొండలు, ఇటు పక్క కొండలు వున్నాయి. ఆ కొండలపైన వున్న మంచు కరిగిమద్యలో ఓ నదిలా ప్రవహిస్తోంది.

ఇక్కడ కూడా ఘాట్ రోడ్డు ప్రయాణమే.

అక్కడ కళ్లకు కన్పిస్తున్న ప్రతి ప్రదేశం వర్ణనాతీతంగా ఉంది,

నైట్ "మనాలిఇన్’హాటల్లో బస చేశారు.

ఉదయాన్నే లేచి బయటకి రాగానే .... సూర్యోదయం ఎర్రగ మెరుస్తూ కన్పిస్తూకనువిందు చేస్తుంటే.. అనురాగ్, దీక్షిత ఆ హోటల్ ముందుకూర్చునిప్రవహిస్తున్ననీటిలో కాళ్లనుపెట్టుకున్నారు వాళ్లద్దరికి ఆ హోటల్ చుట్టూ వున్న కొండల్లోంచి వస్తున్న ఆ నీటి పాయను చూస్తూ కబుర్లు చెప్పకోవడం అద్భుతమైన అనుభూతిని కల్లిస్తోంది.

మధ్యాహ్నం పన్నెండు గంటలకి కులుమనాలి నుండి "రోతన్ పాస్" కి జీపుల్లో బయలుదేరారు.

మంచుకొండల్లోరెండుగంటలుప్రయాణం చేసి రోతన్ పాస్" చేరుకున్నారు.

అక్కడ దిగగానే చలికి తట్టుకోవటం కోసం ప్రత్యేకమైన దుస్తుల్ని గ్లౌజుల్ని రెంట్  కి తీసుకున్నారు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages