ఎన్నాళ్ళిలా బ్రతుకుతావు - అచ్చంగా తెలుగు
ఎన్నాళ్ళిలా బ్రతుకుతావు?
 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


ఎన్నాళ్ళిలా బ్రతుకుతావు?
బయటివారికి సూక్తులను బోధిస్తూ
మరోవైపు ఆధ్యాత్మిక గ్రంధాలను శోధిస్తూ
ఇంటిలోమాత్రం అర్దాంగితో వాదిస్తూ
అర్ధంలేకుండా ఆమెపై క్రోదిస్తూ
చేవలేకుండా ఆమె ఆశలను ఛేదిస్తూ
అది చాలదని పదేపదే పరులను వేదిస్తూ
పాపపుపనులను పట్టుదలతో అనుసరిస్తూ
విచక్షణలేకుండా వ్యవహరిస్తూ
ఆలోచన లేకుండా అజ్ఞానాన్ని అనుసరిస్తూ
ఎన్నాళ్ళిలా ఏహ్యంగా బ్రతుకుతావు?
వృద్ధిలేకుండా ఏగుతూ
శుద్ధిలేకుండా వాగుతూ
బుద్ధిలేకుండా గడుపుతూ
శూన్యాన్నిస్పందిస్తూ అందరినీ కందిస్తూ
మనసులో ఒకలా ఆలోచిస్తూ
బయటకు మరోలా ప్రవర్తిస్తూ
జీవితానికి అర్ధం తెలియకుండా 
పరమార్ధాన్ని కలియకుండా 
పశ్చాత్తాపం తో అలియకుండా 
ఎన్నాళ్ళిలా బ్రతుకుతావు?
***

No comments:

Post a Comment

Pages