శివం - 52 - అచ్చంగా తెలుగు
శివం - 52
రాజ కార్తీక్   


(కల్పన భారతి తన అడుగు లో అడుగు వేసుకుంటూ తన ఇంటికి పయనం అయ్యింది. ఆమె మనసులో  అంతర్మధనం జరుగుతోంది. )
కల్పనకి ఏమి జరుగుతోందో అర్ధం కావటంలేదు. గుడిలో శ్రావ్యంగా కీర్తన
ఆలపిస్తున్న తనకి ఏమిటి ఈ పరిస్తితి? తను విన్న వార్త బహుశా ప్రపంచంలో
ఏ స్త్రీ  జరగాలి అనుకోకూడదు ..ఇంకా కల్పన అడుగులు తన జ్ఞాపకాలను
పరికిస్తునే ఉన్నాయ్.

కల్పన పక్కన వారు మాత్రం " తల్లి బాధపడకు అమ్మ. ముందు జరగాల్సింది చూద్దాం
"అంటున్నారు కాని ఎవరు ..ఏమి మాట్లాడలేకపోతున్నారు.‌

కల్పనకు ఎదురు అయ్యాడు ఒక జ్యోతిష్కుడు ..తనకు గుర్తుకు వచ్చింది...
ఒకసారి ఆ జ్యోతిష్కుడు ..కల్పన జాతకం గమని౦చి తనకి వైధవ్యం ఉంది అని చెప్పాడు.
దానితో అగ్గి మీద గుగ్గిలం ఐన కల్పన "నీవు అంత సరి ఐనవడివే అయితే ..అంత
గొప్పవాడివి అయితే, ముందు నీ బతుకును మార్చుకో "అని పదుగురు ముందు హేళనగా
అంది.

అసలే ముక్కోపి ఐన ఆ జ్యోతిష్కుడు "ముర్ఖురాల ! ఎంత పొగరు ? నా మాటనే
ధిక్కరిస్తావా? నేను ఏదో నీ మంచి కోసం చెప్పాను. కానీ నువ్వు దానికి
పరిష్కారం అడగకుండా నన్ను పదుగురిలో అవమానిస్తవా ..అసలు నువ్వు ఎక్కడ ఉంటే
అక్కడ దరిద్రం. అందుకే నువ్వు పుట్టగానే తల్లిని మింగావు. తండ్రిని పనికిరాకుండా చేసి, ఆదరణ కోల్పోయవు. దిక్కు లేకుండా పెరిగి, చివరికి నన్నే దూషిశ్తున్నావా ? అసలు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం. అదే దరిద్రం నీకు నీ
కుటుంబానికి కూడా ఉంది. ఇక్కడ నుండి పో," అన్నాడు.

ఆ జ్యోతిష్కుడు మాత్రం కల్పన దగ్గరకు వచ్చి
"తల్లి దేవుడు నీకు ఎంతో అన్యాయం చేసాడు. నాకు నీ మీద కోపం ఏమి లేదు
అమ్మ ,నిజంగా నువ్వు పాడే పాటలు అంటే ఎంతో ఇష్టం ,ధైర్యం కూడగట్టుకుని ఉండు " అన్నాడు.

ఏం చెప్పగలదు కల్పన కృతజ్ఞతలు తప్ప.
నిజంగా ఆ రోజు తిట్టి చెప్పినా, ఆ జ్యోతిష్యుడు చెప్పినవి అక్షర సత్యాలు. 
ఏమో నిజంగా తను ఒక దౌర్బగ్యురాలేమో. దరిద్రురాలు ఏమో? అని తనను తనే
తిట్టుకుంది.

కల్పనకి ఒకొక్క అడుగు నిప్పుల నడకలా ఉంది .ఇప్పుడు తనకు ఎదురయ్యాడు
తన భర్తను కాపాడిన వ్యక్తి. అతనిని "నువ్వు చేసింది ఏముంది? అని తన మొహం
మీద తలుపు వేసి పంపింది. అప్పుడు తన కనులలో నన్ను అలా అవమానించ వద్దు," అనే ఆర్ద్రత తప్ప ఏం కనిపించలేదు.

కానీ అతగాడి చూపులో తన మీద ఎంతో జాలి, దయ ఉంది. ఆ జాలి లో అర్ధం అయ్యింది తను
ఎంత తప్పు చేసిందో..

భక్తులారా! అవును మీరు చేసిన తప్పుకి నన్ను క్షమాపణ వేడుకొని మళ్ళీ ఆ
తప్పు చేయకుండా, సత్ప్రవర్తన అలవాటు చేసుకోండి. విధిని ఎవరు మార్చలేరు, నేను తప్ప .భక్తి మార్గంలో ఉండి మీ పాపాలను ప్రక్షాళన చేసుకోండి. నన్ను ఎల్లప్పుడు స్మరించేవారు ఎప్పుడు నన్నే చేరుకుంటారు. ఏ రూపం ఐనా అంత నేనే ...

ఆక్రందనతో కల్పన మనసు కీర్తన ఆలపిస్తుంది. ఆ కీర్తన నన్ను చేరుకుంది కల్పన మనసులో ఆలోచన మొదలయ్యింది.‌ గొప్ప సంఘటన వల్ల మనుషుల్లో వచ్చిన మార్పు అంతే ఉంటుంది.‌
కల్పన నడక సాగుతుంది ..
కల్పన కు వినిపిస్తున్నై  కొన్ని కఠిన స్వరాలు
కల్పన భర్త గురించి అవి "చచ్చాడు దరిద్రుడు. తల్లిని కొట్టిన ఆ నీచుడు దిక్కుమాలిన చావు చచ్చాడు. తల్లి తండ్రుల మీద చేతులు ఎత్తిన వారికీ అటువంటి చావే వస్తుంది .అందరికి నీతులు చెప్పే కల్పన భారతి  మరి తన భర్త
తన తల్లిని కొట్టినప్పుడు ఏమి చేసింది? ఎవరో ఒక చిన్న మాట అని అనకుండా అన్నాడని రాజు గారి చేత శిక్ష వేయించింది. మరి అంత నిజాయతి పరురాలు తన తల్లిని కొట్టినవాడికి ఏ శిక్షా విధించమని రాజు గారిని కోరలేదే?
,అందుకే తనకు ఒక నీతి, మరొకరికి ఒక నీతి. అదీ తను రాజు గారి దగ్గర తన
భర్తకి కూడా శిక్ష విధింపజేసి ఉంటే, తనవిలువ పెరిగేది. లేకపోతే నీతులు చెప్పటo ఆపి ఉంటే బాగుండేది. కన్న కొడుక్కి పాయసం పెట్టిన కన్నా తల్లిని కొట్టినవాడు ఇంతే చస్తాడు "అంటున్నారు . తన భర్త తన అత్తను
కొడుతున్నప్పుడు అడ్డు వచ్చినవారు మరొకరు "కల్పన తన కొడుకు బయటకు పోయేటప్పుడు మా అమ్మ ఎదురువస్తే ,తన కనులముందే తన బిడ్డను పిలిచి దిష్టి తీసి అశుభసుచకం అని అనేది. మా అమ్మ ఎంతో బాధపడేది. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ హక్కు అని గుడిలో రాజుగారు వచ్చిన్నప్పుడు నీతులు  చెప్పటానికి మాత్రం  పనికి వస్తుంది ఈ నూతనవిధవరాలు "...

అడుగు అడుగునా కల్పన అహం చనిపోతోంది ..తెరలు కమ్మి పోయిన మబ్బులా తన మనసులో తను చేసిన వైఖరి ఎంత తప్పో తెల్సుకుంటోంది.
కానీ కల్పనకు గుర్తుకు వచ్చాడు తన బిడ్డ. తన బిడ్డను తను బాగా చూసుకుంది. 
అందరు తల్లుల లాగే .ఈ ప్రపంచంలో తను స్వార్ధం చూపకుండా ఉంది ఒక్క తన బిడ్డ
విషయంలోనే. తను చిన్నప్పుడు కోల్పోయిన ప్రతిదీ తన బిడ్డలో చూసుకొని మురిసిపోయేది . అలాంటిది ఇప్పుడు  తన బిడ్డను విగత జీవిగా చూడాలా ..

లాలి లాలి అని తను పడిన లాలి ఇప్పుడు తన బిడ్డకు శాశ్వత లాలి అయింది ..అదే పాడాలా
అని గుక్కపట్టింది  చిట్టి తల్లి. తన గుండె ఎంత బరువుఎక్కిందో.

ఇక కల్పన ఇల్లు కనుచూపుమేరలో ఉంది, తన ఇంటి వాకిలి కనపడింది.
తనకి కనపడ్డాయి దూరంగా తన భర్త, బిడ్డ శవాలు.
దేవుడా అని గుండెలు బాదుకొని మోకాళ్ళ మీద పడి, గుక్క పట్టి ఏడిచింది కల్పన భారతి.
ఆమె పడే వేదన చూసి, తను అంటే కోపం ఉన్నవారికి  కూడా గుండె కరిగింది.
నా చిట్టి తల్లి పడే బాధను నేను కూడా చూడలేకపోయాను.
ఇక నాకు ఈ స్వరాభిషేకం చేసే భక్తురాలి జీవితం ఏ మలుపు తీసుకుందో ..చూద్దురు  గాని...
(సశేషం)

No comments:

Post a Comment

Pages