పాపం‌ పండింది - అచ్చంగా తెలుగు

పాపం పండింది
చెంగల్వల కామేశ్వరి 

“అమ్మా రాజీ ! అని మెల్లగా పిలిచింది కోటమ్మ.
ఉలుకు పలుకు లేకుండా ఎక్కడో దిక్కుల్లో చూస్తూ ముందుకి వెనక్కి ఊగుతూన్న  రాజీ బదులు పలకలేదు.ఒక నిముషమాగి కోటమ్మను తేరిపారా చూసి  ఓ పిచ్చి నవ్వు నవ్వి మళ్లీ ఊగడం ప్రారంభించింది.
మనవరాలిని అలా చూస్తున్న కోటమ్మ గుండె పగిలిపోయింది. చిదిమి దీపంపెట్టేలా ఉన్న బంగారుబొమ్మ లా ఉండే తన మనవరాలు
ఈనాడు ఇలా పిచ్చి చూపులు చూస్తూ కాళ్లు ఊపుకుంటూ తైల సంస్కారం లేని జుత్తు చెదిరిపోయిన జుత్తు కాటుక బొట్టు లేని చంద్రవంకలాఫాలభాగం.చెదిరిపోయినబట్టలు
వస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టుకుని 
"అమ్మా రాజ్యం ఇలాఅయిపోయావేంటే తల్లీ!ఎవరికళ్లు పడ్డాయమ్మా! నా బంగారు తల్లీ మీద ! అనిరాజీ చెంపలు నిముర్తూ దగ్గరకు తీసుకోబోయింది కోటమ్మ.
ఒక్కుదుటన కోటమ్మ చేతులు విసిరికొట్టి ఆమెను ఎడాపెడా కొడ్తూ "నిన్నుఛంపేస్తాను.
ఎందుకొచ్చావు! అనరుస్తూ ఉన్మాదిలా కోటమ్మ ఒళ్లంతా రక్కిపెట్టింది" అయ్యో రాజీ నేనమ్మమ్మనమ్మా కొట్టకమ్మా నిన్నేమి చేయనమ్మా! వదలమ్మా అని అరుస్తున్న కోటమ్మ  అరుపులకు పరుగెత్తివచ్చారు. కమలమ్మ రాయుడు. 
తనని కూడా కొడ్తున్నా అతికష్టం మీద కూతురు చేతుల్లోంచి అత్త గారిని విడిపించి రాజీని బలవంతంగా  గదిలోకి ఈడ్చుకెళ్లి లోపల పడేసి తలుపులు గడియ వేసి ఆయాసపడుతూ దాని దగ్గరకి ఎవరినీ వెళ్లకుండా చూడమన్నానా! 
అంటూ ఏడుస్తూ రక్త సిక్తమయిన  చెంపలు చేతులు చూసుకుంటున్న అత్తగారిని చూసి  "అయ్యయో ఎలా రక్కిపెట్టిందో!  పాపిష్టి ముండ! దాని దగ్గరకి వెళ్లకండి! 
మనందరినీ చంపడానికే పుట్డింది. ఆవిడకి కొబ్బరినూనె రాయి ఇంజక్షన్ కూడా ఇప్పించాలి. ఖర్మ,!ఖర్మ! అంటూ నెత్తి బాదుకుంటూ అవతలికి వెళ్లిపోయాడు. రాయుడు.
 తలుపులు ధనాధనా కొడ్తూ అరుస్తున్న రాజీ  అరుపులకి బిక్కచచ్చిపోయి ఇదేంటే ! దీనికేమయిందే! ఇలా కొడుతోంది. ఎలా భరిస్తున్నారే! అనంటూ ఏడుస్తున్న తల్లిని వాటేసుకుని ఏడుస్తూ " రెండేళ్లనుండి   ఇదేవరస అమ్మా!  మా ప్రాణాలు  అన్నీ దీని మీదే పెట్డుకుని పెంచాము. 
ఇప్పుడిదిలా అయిపోతే ఏంచేయాలి?
నీీీీకు తెలియనిది ఏముందమ్మాా!
ఎవరేం చెప్తే అది చేస్తున్నాము. చక్కగా   కాలేేేజి కి వెళ్లి వచ్చేది. ఒకరోజు సడన్ గా ఏమయిందో! లెక్చరర్ ని లాగి కొట్డిందిట. ఇద్దరుముగ్గురబ్బాయిలని బ్లేడు తో గీసింది. అస్తమానూ ప్రాణాలు తీసుకోవడానికి  ప్రయత్నిస్తోంది. రెండుసార్లు నూతిలో దూకింది.కృష్ణానదిలో రెండుసార్లు దూకింది.ఎవరోవొకరు సమయానికి కాపాడారు. కాని ఇలా ఎవరు ముట్టుకున్నా వాళ్లని చంపడానికి ప్రయత్నిస్తోంది. అప్పటినుండి ఇదేవరస! ఎవరొచ్చినా ముట్టుకోకుండా ఉంటే ఏమీ అనదు.
పొరపాటున ముట్టుకున్నారా! ఇంక రక్తాలు కళ్ల చూస్తే కాని ఒదలదు.
 డాక్టర్స్ కి చూపిస్తే " ఏదో సంఘటన జరిగింది ఆ షాక్ వల్ల ఇలా అయింది. అన్నారు. ఏవో టెస్ట్ లు చేసి మానసికంగా బాగోలేదు అంటే వైజాగ్  మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లాము. ఆరు నెలలుంచి కరెంట్ షాకులిచ్చారు మందులిచ్చారు. పెళ్లి చేస్తే తగ్గి పోవచ్చు అన్నారు. ఇలాంటి దాన్ని ఎవరు చేసుకుంటారు.
అన్న కూతురి మాటకు అడ్డొచ్చి "  ఏదో దగ్గరి సంబంధం ఉందన్నారు కదా! పిల్లలిద్దరికీ ఇష్టమయింది అని చెప్పారు కదే! దీనికిలా అవకముందు "అన్న తల్లి మాటకు
"అయ్యో తాంబూలాలకి కూడా ముహూర్తం పెట్టించాము . ఆ మర్నాటినుండే ఇలా అయింది. వాళ్లకి ఏవో అబద్దాలు చెప్పాము. కాని వాళ్లకి తెలిసిపోయింది. వద్దని కబురు చేసారు.ఇంక ఇది నా గుండెల మీద కుంపటే ! అని భోరుమంది కమలమ్మ
మాటరానంత విషాదం లో మునిగిపోయింది కోటమ్మ మనవరాలు రాజ్యలక్ష్మి నిండా 
పద్దెనిమిదేళ్లు లేవు బంగారు ఛ్చాయతో బారెడు జడతో అప్సరసలా ఉండేది. సరదాగా నేర్చుకున్న సంగీతం వినిపిస్తూ ఎక్కడికెళ్లినా అపరంజి బొమ్మలా అందరినీ ఆకట్టుకునేది.
అటు ఇటు అమ్మమ్మ నాయనమ్మల గారాల మనవరాలిగా గారంగా సుకుమారంగా పెరిగిన  రాజ్యలక్ష్మి  రెండేళ్ల నుండి ఎందువల్ల ఇలా అయిపోయిందన్నది ఎవరికీ తెలీదా! ఎందుకిలా!  ఇలా ఎన్నేళ్లు? అనుకుంటూనే కూతురికి వంటింటి లో సహాయం చేస్తో ఉండిపోయింది..
మర్నాడు ఇద్దరు పనిమనుషులు రాజీని కిటికీకి చెరో చేయి కదలకుండాా కట్టేేేసి పట్టుకుంటే  తిడుతూ ఉమ్ముతూన్న రాజీ ని రెండు తగిలించి  తలకి కొబ్బరి నూనె రాసి జడ గట్టిగా వేసి మురికి పట్టిన బట్టలు తీయించి స్నానం చేయించి బట్టలు కట్టపెట్టే సరికి ఆ తల్లీ కూతుళ్లకి దేముళ్లు కనిపించారు.
ఇంతవుతున్నా  కూతురి అత్తారి వైపెవరూ రావటంలేదాా!  అనుకుంటున్న కోటమ్మ చెవిలో  కమలమ్మ చూడకుండా గుసగుస గా చెప్పిన పనిమనిషి మాటలకు నిరుత్తరాలయిపోయింది కోటమ్మ.
పట్టరాని ఆవేశంతో మహోగ్రురాలయిపోయింది.
కాని ఆ విషయం తనకి తెలిసిపోయిందని తెలిస్తే కూతురు అల్లుడు బ్రతకలేరు.
చిన్నపటి నుండి చేరువగా ఉన్న  సొంత పెదనాన్న  కామానికి బలయిపోయిన రాజీ సున్నిత హృదయం ముక్కచెక్కలయిపోయి మతి చలించిందని. అంత పిచ్చిలో కూడా తనకు జరిగిన దారుణానికి ఆ అవమానానికి ఆ  పిచ్చితల్లి తన ను ఎవరూ తాకకూడదన్నట్లు ప్రవర్తించడం చచ్చిపోవాలని  ప్రయత్నించడం చూస్తే ఆ పిల్ల ఎంత సున్నిత హృదయమో తెలుస్తోంది. ఏమీ ఎరుగనట్లు ఆరునెలలకు పరామర్శకి వచ్చిన ఆ రాక్షసుడిని చూస్తూ నే అపరకాళికలా మారిపోయి  చావచితకబాదితే ఎలాగో పారిపోయాడు"ట."
ఆమె మాటల్లో ఆ రాక్షసుడు ఆ నీచుడు అంటూ చెప్పేవాడు ఆయనే అన్నది అందరికీ
అర్ధమయిపోయింది."ట" అప్పటినుండి రాకపోకలు లేవు. ఈ విషయం తెలిసి కోటమ్మ గుండె చెరువయింది.
ఇలాంటి పాపాత్ములు ఇళ్ల ల్లోనే ఉంటే పసిపిల్లలికి కూడా రక్షణ లేదు.మామయ్యలు బాబయ్యలు ఇంకా ఇరుగు పొరుగు అంకుల్స్ అన్నా తాతగార్లన్బా భయపడే రోజులొచ్చేసాయి. ముక్కుపచ్చ లారని పసిపిల్లలని చూసి రెచ్చిపొవడానికి వాళ్లల్లో ఏం కనిపిస్తుంది. వరసా వావి లేకుండా  ప్రతి ఆడపిల్లని అనుభవించాలన్న వాంఛలు సమాజాన్ని ఏ స్తితికి దిగజారుస్తోంది. చక్కగా పుట్టి పెరిగి చదువుకునే అమ్మాయి
రాజీలాంటి సున్నిత హృదయులు ఇలా మానసికంగా దెబ్బతినేంత దారుణాలు నుండి ఆడపిల్లలని ఎలా కాపాడుకోవాలి? కంచే చేను మేస్తోందన్నట్లు, ఇంట్లో ఒంటరిగా ఉందనిి ఇంతటిఅఘాయిత్యం
చేసింది. స్వంత పెదనాన్న అయితే ఆసమయంలో రాజీ ఎంత తల్లడిల్లిపోయిందో!
ఇలా  అయినవారిలో తెల్సున్నవారిలోనే ఇలాంటి పాపాలకొడిగట్టేవారుంటే ఎవరికి చెప్పుకోవాలి?
తను కూడా ఇలాంటి ఘోరాలు ఎన్నో వింది.
 భర్తను పోగొట్టుకుని అత్తింటికి వేరిన బాల వితంతువులని ఇలాగే బావగార్లు మావగార్లు వాళ్లని వాళ్ల కామానికి ఆహుతి చేసే వారు. వారికి కడుపో కాలో వస్తే  అది ఇంట్లో అందరికీ తెలిసిపోయేది. అది చెప్పుకుంటే సంసారాలు కూలి పోతాయని
ఆడవాళ్లు  నోళ్లు నొక్కుకునేవారు.! ఇంక ఈ విషయం బైటకి పొక్కకుండా వాళ్ల కి నాటు వైద్యాలు చేయించేవారు. ఏ ప్రేమాభిమానాలు నోచుకోకున్నా ఆ ఇంటి మగవాళ్ల దౌష్ట్యానికి గురయిన ఆ అబలలు ఆ పాపాన్ని కడిగే ప్రయత్నంలో ప్రాణాలని కూడా పోగొట్టుకునేవారు.
 అప్పుడూ ఇప్పుడూ కూడా ఇలాంటి ఘోరాలు జరుగుతోనే ఉన్నాయి."పెళ్లి చేసి అత్తింటికి సాగనింపాల్సిన తమింటి దీపాన్ని తామే ఆర్పేసే ఇలాంటి పాపిస్టి వెధవలు ఇంకాఎలా  బ్రతుకుతున్నారో! 
వాళ్లకి చావు రాదా అమ్మా భూమాతా వీళ్లని ఎన్నాళ్లు మోస్తావు! అని ఆక్రోశించింది కోటమ్మ .
కోటమ్మ మొర ఏ దేముడు విన్నాడో!
కమలమ్మ బావగారి కుటుంబమంతా రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు పోగొట్టుకున్నారని  ఆయనొక్కడే రెండు కాళ్లు విరిగి బ్రతికున్నాడని వార్త !  ఆ యాక్సిడెంట్ ని  పోయిన కుటుంబ సభ్యులని వాళ్లని చూసి భోరుమని ఏడుస్తున్న కమలమ్మ బావగారు భూపతిని  రకరకాల వాఖ్యానాలతో  టీ వీ లో చూపించేస్తున్నారు.
భగవంతుడా! వాడు చేసిన పాపాలకు  శిక్ష వేసేసావా తండ్రీ! అని సంబ్రమాశ్చర్యాలతో" టీ వీ" చూస్తూన్న కోటమ్మ కమలమ్మ గట్టి గా నవ్వేసుకుంటూ సంబరంగా గిర గిరా తిరుగుతూ చప్పట్లు కొడుతూ టీవీ చూస్తున్న
రాజీని చూసి  ఆమె మొహంలో కనిపిస్తున్న 
ఆనందాన్ని   చూసి కమలమ్మ రాజీ చేతులు పట్టుకుని టీవీ దగ్గరకి  తీసుకొచ్చి ఆవేశానందాలతో "చూడమ్మా! బాగా చూడు ! నీ పాలిటి రాక్షసుడికి దేముడు శిక్ష వేసాడు. వాడి ఆయు ప్రాణాల మీద దెబ్బ కొట్టాడు నీ జీవితాన్ని నాశనం చేసిన నీచుడు సర్వనాశనమయ్యాడు  వాడు బ్రతికి ఉన్నంతకాలం నీకు చేసిన ద్రోహం వాడిని చంపుతూనేవుంటుంది." అనంటూ అంతలోనే ఏదో తెలివొచ్చినట్లు కోటమ్మను చూసి  తత్తరపడింది. 
కోటమ్మ  మౌనంగా వారిద్దరిని పొదివి పట్టుకుని దగ్గరకి తీసుకుంటూ "అవునమ్మా  పాపం పండింది" అందుకే వాడొక్కడే బ్రతికాడు. అదే శిక్ష వాడికి" అనంటున్న తల్లి వైపు సందిగ్ధంగా చూసింది కమలమ్మ అన్నీ తెలుసన్నట్లు తల పంకించింది. విచిత్రం అమ్మా అమ్మమ్మల చల్లని చేతుల లో ఒదిగి టీవీనే చూస్తోంది రాజీ.
ఉపసంహారం " రాజీ మనసు శాంతిస్తుందో లేదో ఆమె జీవితం ఏ తీరంచేరుతుందో  ఎలా బాగుపడుతుందో తెలీదు. కాని  అమాయకులని ఆడవారిని బాధపెట్టినవారు మాత్రం ఇలాగే శిక్షింపబడుతారు. నవ్వుతూ చేసి  ఏడుస్తూ అనుభవిస్తారు అన్నది నిజం!END

No comments:

Post a Comment

Pages