చిన్న తప్పు పెద్దనష్టం - అచ్చంగా తెలుగు
 చిన్నతప్పు - పెద్దనష్టం.
  శ్రీబండ్లమూడి పూర్ణానందం.  
   

ఆధునిక మానవుడు శాస్త్రసాంకేతిక రంగాలలో మంచి అభివృద్ధిని సాధించాడు. చంద్రమండలానికి కూడా వెళ్ళి వచ్చాడు.అంగారకు నిపై పరిశోధనలు మొదలుపెట్టాడు.సూర్యమండలానికి వెళ్ళటానికి ఈ మధ్య ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మనిషి గొప్పవాడే.కానీ చిన్న తప్పుకు పెద్దనష్టం చవిచూడవలసి వస్తుంది.ఒకాయన విదేశాలకు వెళ్ళాలనిఅంతా సిద్ధం చేసుకున్నాడు.చివరకు తను చదువు కున్న సర్టిఫికెట్ లో తల్లిపేరులో ఒకఅక్షరం తప్పుగా ప్రింటు అయింది.అది పరిశీలించిన అధికారులు ఆయనకు అనుమతి నిలిపి వేశారు.ఎంతో విజ్ఞానాన్ని సంపాదించిన ఆ పెద్దమనిషి ఒక చిన్న తప్పు సరిచూసుకొనక పోవటం వలన ఇబ్బందిపడవలసి వచ్చింది. రోజూ మనం చేసే పనులలో ఇలాటి తప్పులెన్నో.మనం బ్యాంకులలో వాడే చెక్కులపై ఒకసారి ఏదైనా అక్షరము దిద్దుబాటు కన్పించినా అధికారులు చెల్లుబాటు కాదని చెప్తారు.మరల ఇంకో సంతకం చేయించి దానిని నిజమని నిర్ధారించుకొని  అప్పుడే మనడబ్బులు ఇస్తారు.గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఎవరినీ ఏమీ అనలేము.అంటే అదో గోల.అన్నట్లు మన గాంధీగారు స్వాతంత్ర్యం తెచ్చి అందరికీ కొంత కొంత ఇచ్చినట్లు న్నారు.మా ఊరిలో ఒక పెద్దమనిషి కాస్తమత్తులో ఓటువేసి అభ్యర్థిని ఎంచుకున్నాడు.అంతే ఆ చిన్నతప్పు సరిదిద్దలేని కాలంలో కలిసిపోయినది. ఫలితాలు మనం చూస్తూనే ఉన్నాము.విద్యార్థి పరీక్షరాయటానికి కళాశాలకు వెళ్ళినాడు.ఒక్క నిమిషం ఆలస్యమైంది.అంతే బయటనుంచో వలసిన పరిస్థితి.తద్వారా ఒక సంవత్సరం వృథా.ఒక్కనిమిషం ఆలస్యమనే తప్పు మనిషిని వెనుకకు నడిపించినది.ఏ కాలములో నైనా , ఏ మనిషైనా కాలంతో సమానంగా పోటీపడి నడవలేడు.ఇది పెద్దలందరూ గమనించాల్సిన విషయము. దీనికి మనం సవరణలు చేసుకోవాలి. సరిదిద్దుకోవాలి.ముఖ్యంగా ప్రయాణాలలో మనం చూస్తుంటాము. ఒక డ్రైవర్ ఒక్క నిముషం ఏమరుపాటు,లేక తప్పిదము ఎన్నోప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదముంది.విజ్ఞులు గమనించాలి. దేశమంతటికీ అవసరమైన ఒక సాఫ్ట్ వేర్ తయారుచేశాడు ఒక పెద్దమనిషి.అమలులోకి వచ్చిన తరువాత తెలిసింది దానిలోని సాధకబాధకాలు.దానిని పట్టించుకొనే నాథుడే లేడు. అన్నీ బాగుంటేనే మానవ జీవితం.లేకుంటే శూన్యం.పూజ్యం.

No comments:

Post a Comment

Pages