అమృతవల్లి - అచ్చంగా తెలుగు

 "తిప్పతీగ పికెల్సు - మేడ్ ఇన్ రామయ్య వైఫ్" 
శ్రీపురం మల్లి.



ఒకా నొకప్పుడు త్రిమూర్తులకు పెద్దసమస్య వచ్చిపడింది. ఈసమస్యను ఎవరు తీరుస్తారా ! అని ఎదురుచూడసాగారు. ఇంతలో అగ్గిపుల్ల స్వామిగా పేరుగాంచిన, త్రిలోక సంచారియైన నారదులవారు అటుగా వెళుతూ,  త్రిమూర్తులు విచారవదనంతో ఉండటాన్ని గమనించి, 'సృష్టి, స్థితి, లయ, కారకులకు నారదులవారి నమస్కారము'. అని అనగానే, ఉలిక్కిపడి లేచి, 'సమయానికి వచ్చావు నారదా ! మాసమస్యను నీవే తీర్చగల సమర్ధుడవని,' అసలు విషయాన్ని రహస్యంగా తెలియజేస్తూ, " త్రిదోషాలు " మాకు బట్టుకున్నాయి నివారణ  గురించి చెప్పమనగా !
నారదులవారు భూలోకంలో జరుగుచున్న వింతలు, విడ్డూరాలను జెప్పసాగాడు.
 నేను భూలోక సంచారము చేయుచున్న సమయ సందర్భంలో ఒకాకానొక గ్రామంలో సేదతీర్చుకొని విశ్రమించుటకు అనువైన స్థలాన్ని పరిశీలించు నిమిత్తము కొన్ని చెట్లుచేమలను దాటుకొనుచూ అంతటా కలయదిరిగు చుండగా ! మరలా అచ్చటికే పదేపదే రావటాన్ని గమనించి, ముందుకు దారి కానక అడవిలో తికమకలో పడుచుండగా ! 
రామయ్య అనే " రస మూలికా " వైద్యుడు అగుపడి నాయొక్క అవస్తను గమనించి,
రామయ్య జెప్పిన విషయాలను తమరికి తెలియ జేసెదనని త్రిమూర్తులకు  
 ***** 
నారదులవారి చూచిన రామయ్య,
"ఆర్యా ! నాపేరు రామయ్య. నేను "రస మూలికా" వైద్యుడను నేను. తమరికి నమస్కారములు తెలుపుకొనుచున్నాను.ఇదువరకెన్నడూ తమరిని ఇక్కడి అడవిలో నేను జూచినట్లుగా గుర్తుకు రావటం లేదు.  తమరు ఎవరు ? ఎచటినుండి ఇచ్చటికొచ్చారు ? తమరి నామధేయమేమిటో తెలియజేస్తూ తమరి సమస్యను తెలియజేయగలరని" జెప్పగా,
నారదులవారు అతనికి తన ఇతివృత్తాంతమంతయు తెలియజేస్తూ తనపరిస్తితిని తెలియజేసారు.
రామయ్య ఆశ్చర్యచకితుడై  ఇలా సంక్షిప్తంగా కథను చెప్పసాగాడు. 
మానవాది, దేవతలే కాక గరుడ, గంధర్వాదులకు కూడా తిప్పలు తప్పవు.
అడవిలో దీనిని త్రొక్కిన వారు నానా అగచాట్లు పడుతారు. కావుననే దీనిని "తిప్పతీగ" అంటారు. 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులకైనా తిప్పలు తప్పవు. 
వాత, పిత్త, శ్లేషాలను, ఇది నిరోధించుతుంది. 
దానిని ఎలావాడాలో నారదులవారికి వివరించి, ఇంటికి వెళ్లిన రామయ్య ను 
భార్య "ఏవండీ ఇంతసేపు ఎక్కడికెళ్ళినట్లు?" అనగానే "త్రిదోషహారం" గురించి చెప్పమన్న ఒక మునీశ్వరునికి తెలియ జేసినందుకు గాను ఆలస్యమైనది. 
ఇంతకీ వంటేమిజేశావ్ అని రామయ్య భార్యను అడగగానే !
"తిప్పతీగ - త్రిదోషహారం" అంటూ ఊరంతా తెగ జెప్పేస్తున్నారుగా ! అంగట్లో కూరగాయలు దొరకటం లేదు. 
ప్రతివారు తిప్పతీగను గంపలు గంపలకు దెచ్చి అమ్ముచున్నారు. మీ తిక్కేమోగాని అందరికీ ఎక్కించారుగా !..
కాస్త రుచిజూసి తిన్నారంటే మీరిక వదలరు మొత్తం నాకే కావాలని చంటిపిల్లోడి లాగా మారాంజేసినా జేస్తారు. 
మీ తిక్క తగ్గటానికి గాను కమ్మగా "తిప్పతీగ" పచ్చడి జేశాను వడ్డిస్తాను, తిందురుగాని రండి...
మీకు పోటీగా ఆ త్రిమూర్తులైనా రావచ్చును. ఆలస్యంజేయకు ఆలసించిన ఆశాభంగము కలగవచ్చు. ముల్లోకాలకు ఛార్జీలు లేకుండా చక్కగా తిరగొచ్చును. 
తిప్పతీగను త్రొక్కితేనే చాలు. మీ కాళ్ళు అరిగేలాగ నిరంతరం లోకాలన్నీ యదేచ్ఛగా తిరుగుతారటగా !
మహా మహిమాన్విత మైనది తిప్పతీగ అని అనగానే రామయ్య రెండు కళ్ళుబైర్లు గమ్మాయి. 
కళ్ళు తిరుగుచుండగా ! 
"వో రో రి మాయదారి నారదా ! నాకొంపను నిలువునా ముంచావుగా ! అంటూ మూర్ఛిల్లి క్రిందపడి తనకలాడుతున్న సమయంలో రామయ్య భార్య, తన భర్త కు నాలుకపై పచ్చడి ని రాయగానే దిగ్గునలేచి కూర్చుంటూ ...
హమ్మయ్య నేను బ్రతికే ఉన్నాను అనుకొని, ఇదే " అమృతవల్లి " కాబోలు నాప్రాణాలను దక్కించినది అని, ఆనందపడుతాడు. 
రామయ్య పచ్చడి ప్రభావాన్ని తల్చుకొంటూ...
"తిప్పతీగ పికెల్సు - మేడ్ ఇన్ రామయ్య వైఫ్"
***

No comments:

Post a Comment

Pages